
ఆన్‌లైన్ పుడ్ డెలివరీ చేసినప్పుడు చూడముచ్చటగా ఉండే ప్లాస్టిక్ డబ్బాల్లో వేడి వేడి ఆహారం గుమ్మం ముందుకు వస్తుంది. గిన్నెలు ఖాళీ చేశాక వాటిని చక్కగా శుభ్రం చేసి వంటగదిలో పేర్చేస్తారు. ఇవి సౌకర్యవంతంగా ఉంటాయని, వీటి వల్ల ఎలాంటి హాని జరగదని అందరూ అనుకుంటారు. దాదాపు ప్రతి ఒక్కరికీ ఈ అలవాటు ఉంటుంది. దీనిపై ప్రముఖ పోషకాహార నిపుణురాలు డాక్టర్ నందితా అయ్యర్ తన ఎక్స్ ఖాతాలో షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఫుడ్ డెలివరీకి వినియోగించే నల్ల కంటైనర్లు అంత సురక్షితం కాదని హెచ్చరించారు. నల్లటి ప్లాస్టిక్ ఎలా తయారవుతుందో, అది ఆహారంతో ఎలా స్పందిస్తుందో ఆమె తన పోస్టులో వివరించారు.
దాదాపు అన్ని రెస్టారెంట్లు ఆహారాన్ని డెలివరీ చేయడానికి వీటిని ఉపయోగిస్తాయి. ఈ కంటైనర్లను పారవేయడానికి చాలా మందికి వెనకాడుతుంటారు. నిజానికి ఈ నల్ల ప్లాస్టిక్ కలుషితమైన ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడం ద్వారా తయారు చేస్తారు. ఈ వ్యర్థాలలో పాత టీవీలు, రిమోట్‌ల వంటి ఎలక్ట్రానిక్స్ అవశేషాలను, PVC స్క్రాప్‌లు వంటి రకరకాల ప్లాస్టిక్ వ్యర్ధాలు ఉంటాయి. ఈ పదార్థాలతో తయారు చేసిన ప్లాస్టిక్‌లో వేడి ఆహారాల ఉంచడం సురక్షితం కాదు. ఈ కంటైనర్లు వేడికి స్పందించే విధానం మరింత ఆందోళన కలిగించే విషయం. తక్కువ గ్రేడ్ ప్లాస్టిక్‌లకు నల్ల రంగును ఉపయోగిస్తారు. ఇలాంటి వ్యార్ధాలతో తయారు చేసిన ప్లాస్టిక్ అసలు గుట్టు దాచడానికి నల్ల రంగు సహాయపడుతుంది. ఈ కంటైనర్లలో వేసిన వేడి ఆహారం, నూనె కూరలు, పుల్లని వంటకాలను వేసినటప్పుడు అవి హానికరమైన రసాయనాలను విడుదల చేస్తాయి. ముఖ్యంగా మైక్రోవేవ్‌లో నల్ల ప్లాస్టిక్‌ను ఆమ్లం, కొవ్వుతో కూడిన ఆహారాలతో వేడి చేసినప్పుడు భారీ స్థాయిలో హానికరమైన సమ్మేళనాలను లీక్ చేస్తుంది.
If most of the food you’re ordering comes in black plastic containers – you need to watch this video pic.twitter.com/m5VYXUN2VI
— Dr Nandita Iyer (@saffrontrail) February 18, 2026
అలాగని ప్రతి నల్లటి ప్లాస్టిక్ వస్తువు ప్రమాదకరమైనదిగా చెప్పడం లేదని ఆమె స్పష్టం చేసింది. కానీ వీటిల్లో చాలా వరకు రీసైకిల్ చేసిన పదార్థాలతో తయారు చేస్తారు. వీటిని గుర్తించలేం. ఇవి పిల్లల్లో హార్మోన్ల అంతరాయం, న్యూరోటాక్సిసిటీ వంటి సమస్యలకు దారి తీస్తాయని డాక్టర్ అయ్యర్ హెచ్చరిస్తున్నారు. అందుకని ప్రతి ఒక్కరూ తమ వద్ద ఉన్న అన్ని ప్రతి ప్లాస్టిక్ వస్తువును పారవేయమని చెప్పడం లేదు. వీలైనంత వరకు వీటి వాడకాన్ని తగ్గించుకుని, తెలివిగా ఎంపికలు చేసుకోవాలని సూచిస్తున్నారు. రెస్టారెంట్లు నల్లటి ప్లాస్టిక్ కంటైనర్లను ఉపయోగించవద్దని కోరడం అత్యవసరం. అలాగే పేపర్ కంటైనర్లు కూడా అంత సురక్షితం కాదు. ఎందుకంటే వాటిలో చాలా వరకు సన్నని ప్లాస్టిక్ లైనింగ్ ఉంటాయి. కాబట్టి రెస్టారెంట్లు స్టీల్ లేదా గాజు కంటైనర్‌లో ఫుడ్ డెలివరీ చేయాలని ఆమె సూచిస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా నల్లని ప్లాస్టిక్ డబ్బాలలో ఆహారాన్ని మైక్రోవేవ్‌లో అస్సలు వేడి చేయకూడదని డాక్టర్ నందితా అయ్యర్ నొక్కి చెప్పారు.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.