
ఐస్ వాటర్‌లో ముఖాన్ని ముంచే బ్యూటీ టిప్స్‌కి సంబంధించి చర్మవ్యాధి నిపుణురాలు ఇప్సితా జోహ్రి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో చర్మ నిపుణురాలు ఐస్ వాటర్ ముఖాన్ని రిఫ్రెష్ చేయడంలో సహాయపడుతుందని, తక్షణమే వాపును తగ్గిస్తుందని, మీ చర్మాన్ని తాజాగా ఉంచుతుందని వివరిస్తుంది. ఐస్ వాటర్ రక్త ప్రసరణను పెంచుతుంది. మీ ముఖం మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఇంకా, మేకప్‌కు ముందు ఐస్ వాటర్ థెరపీని ఉపయోగించడం వల్ల మీ మేకప్ ఎక్కువసేపు ఉంటుంది. అయితే, అలా చేసేటప్పుడు కొన్ని సాధారణ జాగ్రత్తలు టిప్స్ పాటించాలని చెబుతున్నారు. లేదంటే, ఇది ప్రయోజనాలను ప్రతికూలతలుగా మారుస్తుందని చెబుతున్నారు.
ఏం చేయకూడదు?
మీ ముఖాన్ని ఐస్ వాటర్‌లో ఎక్కువసేపు ఉంచవద్దు. ముఖాన్ని ఎక్కువసేపు ఐస్ వాటర్‌లో ముంచడం వల్ల మీ చర్మం దెబ్బతింటుందని చర్మవ్యాధి నిపుణులు అంటున్నారు. దీనివల్ల చర్మం పొడిబారడం, చికాకు లేదా ఎర్రటి మచ్చలు ఏర్పడతాయి.
ముఖంపై నేరుగా ఐస్‌ని అప్లై చేయరాదు.. ముఖ్యంగా మీ చర్మం సన్నగా లేదా ఇప్పటికే పొడిగా ఉంటే, ఐస్ క్యూబ్‌లను నేరుగా చర్మానికి పూయడం వల్ల రాషేస్ వస్తుంది.
మొటిమలు, సున్నితమైన చర్మంపై ఉపయోగించవద్దు. మీ ముఖం మీద మొటిమలు, ఎర్రటి మచ్చలు, దద్దుర్లు ఉంటే, ఐస్ వాటర్ దానిని మరింత చికాకుపెడుతుంది. ఈ పరిస్థితులలో ఐస్ వాటర్ థెరపీని నివారించండి.
ఐస్ వాటర్ ఉపయోగించిన తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోకపోవడం మర్చిపోవద్దు. ఐస్ వాటర్ చర్మాన్ని బిగుతుగా మార్చడమే కాకుండా పొడిబారేలా చేస్తుంది. కాబట్టి మాయిశ్చరైజర్ రాయడం చాలా అవసరం.
ఏం చేయాలి?
నిపుణులు ప్రకారం..ఐస్ వాటర్ థెరపీలో 10-15 సెకన్ల పాటు మాత్రమే ముఖాన్ని ఐస్ వాటర్‌లో ఉంచండి. అంటే, ముఖాన్ని 10 నుండి 15 సెకన్ల పాటు మాత్రమే మంచులో ఉంచండి. మధ్యలో బ్రేక్ తీసుకోండి.
మీ చర్మం సున్నితంగా ఉంటే, ఐస్ కు బదులుగా చల్లటి నీటిని వాడండి.
చర్మం తేమగా ఉండటానికి ఐస్ వాటర్ ఉపయోగించిన తర్వాత ఎల్లప్పుడూ మాయిశ్చరైజర్ రాయండి.
ఇవన్నీ కాకుండా, రోజుకు 1 నుండి 2 సార్లు కంటే ఎక్కువ ఐస్ వాటర్ ఫేస్ డిప్ చేయవద్దు.
చర్మ నిపుణులు మీ ముఖాన్ని ఐస్ వాటర్‌లో ముంచడం ప్రభావవంతమైన బ్యూటీ ట్రిక్ అని అంటున్నారు. కానీ జాగ్రత్త చాలా అవసరం. కొన్ని సాధారణ విషయాలను దృష్టిలో ఉంచుకోవడం ద్వారా, మీరు మీ చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు. మెరిసే, ఆరోగ్యకరమైన రంగును కాపాడుకోవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..