Our Living Islands Policy: ఆ దేశానికి వెళ్తే రూ. 71లక్షలు ఇస్తారు! త్వరపడండి బంపర్ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే..

మీరు ప్రకృతి ప్రేమికులా? చుట్టూ కొండలు, సముద్రం, పచ్చందాల నడుమ శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకో సూపర్ ఆఫర్ ఉంది. ఐర్లాండ్ ప్రభుత్వం తమ దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని దీవుల్లో స్థిరపడాలనుకొనే వారికి ఓ కొత్త విధానాన్ని రూపొందించింది. దీనిలో భాగంగా రూ. 71 లక్షలు కూడా ప్రోత్సాహకంగా ఇస్తామని పేర్కొంది.

Our Living Islands Policy: ఆ దేశానికి వెళ్తే రూ. 71లక్షలు ఇస్తారు! త్వరపడండి బంపర్ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే..
Ireland

Updated on: Jun 22, 2023 | 4:45 PM

మీరు ప్రకృతి ప్రేమికులా? చుట్టూ కొండలు, సముద్రం, పచ్చందాల నడుమ శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకో సూపర్ ఆఫర్ ఉంది. ఐర్లాండ్ ప్రభుత్వం తమ దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని దీవుల్లో స్థిరపడాలనుకొనే వారికి ఓ కొత్త విధానాన్ని రూపొందించింది. దీనిలో భాగంగా రూ. 71 లక్షలు కూడా ప్రోత్సాహకంగా ఇస్తామని పేర్కొంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

గత కొన్నేళ్లుగా ఐర్లాండ్‌లోని పల్లె వాసులు నగరాలకు తరలి వెళ్లిపోతున్నారు. దీంతో ఐర్లాండ్ గ్రామీణ జనాభా గణనీయంగా తగ్గిపోతోంది. కొన్ని దీవుల్లో కేవలం 160 మంది జనాభా మాత్రమే ఉంది. ఈ పరిస్థితిని చూసి ఆందోళన చెందిన ఐర్లాండ్‌ ప్రభుత్వం జనాభా పెంచుకునేందుకు ఈ వినూత్న కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. దాని పేరు ‘అవర్ లివింగ్ ఐలాండ్స్ పాలసీ`. దీనిలో భాగంగా 23 దీవులను ఎంపిక చేసింది. ఆయా ద్వీపాల్లో స్థిర నివాసం ఉండాలనుకొనే వారికి 80 వేల యూరోలు అందజేస్తామని ప్రభుత్వ అధికార వెబ్‌సైట్‌లో వెల్లడించింది. అంటే మన కరెన్సీలో రూ.71 లక్షలు ఇస్తామని పేర్కొంది.

ఈ పాలసీ ప్రధాన ఉద్దేశం..

ఈ ఆఫర్ ద్వారా ఐర్లాండ్ దేశానికి మరో ఉపయోగం కూడా ఉంది. ఆ దేశపు దీవుల్లో జనాభా తగ్గిపోతుండటంతో అక్కడి ద్వీపాలో పాడుబడిన, శిథిలమైన ఆస్తులు, కట్టడాలు పెరిగిపోతున్నాయి. వాటిని పునరుద్ధరించే లక్ష్యంతో ఈ స్కీమ్‌ తీసుకొచ్చింది. అలాగే జనాభా తగ్గుదల కారణంగా టెక్నాలజీ, ఫినాన్స్‌, మెడికల్‌ ఇండస్ట్రీ సహా వివిధ విభాగాల్లో నిపుణుల కొరత కూడా తీవ్రంగా ఏర్పడింది. దీన్ని అధిగమించి ఆయా విభాగాల్లో అత్యంత ప్రతిభావంతులైన వారు తమ దేశంలో స్థిరపడేలా ప్రోత్సహించడంలో భాగంగానే ఐర్లాండ్‌ ఈ పాలసీని తీసుకొచ్చింది. దీనివల్ల ఆయా విభాగాల్లో అభివృద్ధి చెందడంతో పాటు.. ప్రపంచ దేశాలతో కమ్యూనికేషన్‌ పెంచుకోవచ్చని ఆశిస్తోంది.

ఇవి కూడా చదవండి

నిబంధనలు ఇవి..

ఈ పాలసీలో కొన్ని కండిషన్లు కూడా ఉన్నాయి. ఐర్లాండ్‌ దేశంలో సెటిల్‌ అవ్వాలంటే కచ్చితంగా అక్కడ ఓ నివాసాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అది కూడా 1993 కంటే ముందు నిర్మించినదై ఉండాలి. పైగా అ ప్రాపర్టీ కనీసం రెండేండ్లుగా ఖాళీగా ఉండాలి. అలా ఖాళీగా ఉన్న నివాసాన్ని కొనుగోలు చేస్తే దాని రిన్నోవేషన్, మెయింటెనెన్స్ కోసం మాత్రమే ఈ రూ.71లక్షలను వినియోగించాలి. ఈ ఆఫర్‌ నచ్చినవాళ్లు జూలై 1వ తేదీ నుంచి అప్లై చేసుకోవచ్చని ఐర్లాండ్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఐర్లాండ్ మాత్రమే కాక.. స్పెయిన్, మారిషస్, గ్రీస్, క్రొయేషియా, ఇటలీ, చిలీ వంటి దేశాలు కూడా ఇప్పటికే ఇటువంటి ఆఫర్లను ప్రకటించాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..