
ప్రతి ఏడాది మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుతారు. అయితే, ఈ రోజున మహిళలు సాధించిన ఎన్నో గొప్ప పోరాటాలను గుర్తు చేసుకుంటారు. మన దేశంలో చరిత్ర సృష్టించిన భారతీయ మహిళల్లో ఎంతో మందిని గుర్తు చేసునుకుని ఈ ఉమెన్స్ డేను జరుపుతారు. వారిలో కొందరు దేశ ఖ్యాతిని చాటిచెప్పి ప్రపంచ వేదికల మీద గొప్ప పతకాలను పొందారు.
“మహిళ ప్రేమ, ఆమె బలాన్ని చెప్పాలంటే మాటలు సరిపోవ్వు. ప్రపంచాన్ని వెలిగించగల శక్తి ప్రతి మహిళకి ఉంటుంది మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!”
“మహిళల బలం వలనే ఈ ప్రపంచం ముందుకు నడుస్తుంది అందరికీ అంతర్జాతీయ మహిళ దినోత్సవ శుభాకాంక్షలు..
“మీరు కలలు కనవచ్చు, ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు వాటిని జయించవచ్చు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.”
“కుటుంబానికి వెలుగుగా ఉన్న ప్రతి మహిళకి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!”
“నా జీవిత ప్రయాణంలో నాకు అండగా నిలిచిన ప్రియమైన అమ్మాయికి.. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.”
“మీ కన్న కలలన్నీ సాకారం కావాలి. నా ప్రియమైన సోదరీమణులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!”
“ఒక పురుషుడు ప్రతిదీ నాశనం చేయగలిగితే, ఒక అమ్మాయి దానిని ఎందుకు మార్చకూడదు?” – మలాలా యూసఫ్‌జాయ్
“ఒక స్త్రీ టీ ఆకు లాంటిది.. మీరు ఆమెను వేడి నీటిలో ఉంచినప్పుడు మాత్రమే ఆమె బలాన్ని మీరు గ్రహిస్తారు.” – ఎలియనోర్ రూజ్‌వెల్ట్
స్త్రీవాదం అంటే సమాన విద్య, వేతనాలు, పిల్లల రక్షణ, హింస నుండి విముక్తి కోసం పోరాటం – లారెల్ థాచర్ ఉల్రిచ్