Lucky Plants: వాస్తుప్రకారం మీ ఇంటికి అదృష్టాన్ని తెచ్చే మొక్కలు ఇవి..!

అవును, కొన్ని మొక్కలు వాస్తుపరంగా ఇంటికి శ్రేయస్సు, ఆనందాన్ని కలిగిస్తాయి. వాటిని లక్కీప్లాంట్స్‌గా పిలుస్తారు. అయితే, లక్కీప్లాంట్స్‌ అనగానే అందరికీ మొదటగా గుర్తొచ్చేది మనీ ప్లాంట్. ఆ తర్వాత వెదురు గుర్తొస్తుంది. అయితే వాస్తు ప్రకారం ఇవి మాత్రమే కాదు మరికొన్ని మొక్కలు కూడా ఉన్నాయి. అవి మీ ఇంట్లో పెంచుకున్నట్లయితే నెగటివ్ ఎనర్జీ పోయి అష్టైశ్వర్యాలు కలిగిస్తాయిన వాస్తునిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Lucky Plants: వాస్తుప్రకారం మీ ఇంటికి అదృష్టాన్ని తెచ్చే మొక్కలు ఇవి..!
Good Luck Plants

Updated on: Oct 23, 2025 | 7:38 PM

ప్రస్తుతం చాలా మంది తమ ఇళ్లలో అందమైన మొక్కలను పెంచుకుంటున్నారు. ఉన్న స్థలంలోనే రకాల పూలు, పండ్ల మొక్కలను పెంచుతున్నారు. కొందరు ఇంటికి అదృష్టం, సంపదను తీసుకొచ్చే మొక్కలు కూడా పెంచుతారు. అవును, కొన్ని మొక్కలు వాస్తుపరంగా ఇంటికి శ్రేయస్సు, ఆనందాన్ని కలిగిస్తాయి. వాటిని లక్కీప్లాంట్స్‌గా పిలుస్తారు. అయితే, లక్కీప్లాంట్స్‌ అనగానే అందరికీ మొదటగా గుర్తొచ్చేది మనీ ప్లాంట్. ఆ తర్వాత వెదురు గుర్తొస్తుంది. అయితే వాస్తు ప్రకారం ఇవి మాత్రమే కాదు మరికొన్ని మొక్కలు కూడా ఉన్నాయి. అవి మీ ఇంట్లో పెంచుకున్నట్లయితే నెగటివ్ ఎనర్జీ పోయి అష్టైశ్వర్యాలు కలిగిస్తాయిన వాస్తునిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఇప్పుడు చూద్దాం.

తులసి మొక్క:

తులసి మొక్కతులసి మొక్క ఇంటికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఇంట్లో తులసి మొక్క ఉంచితే సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ప్రతిరోజూ తులసి మొక్క ముందు దీపం పెడితే మంచిది.

మనీ ప్లాంట్:
మనీ ప్లాంట్మనీ ప్లాంట్ సంపద, ఆర్థిక అభివృద్ధికి సంకేతం. ఈ మొక్కను ఇంట్లో తూర్పు లేదా ఉత్తరం వైపు పెట్టండి. డబ్బుకి లోటు ఉండదు.

వెదురు మొక్క :

వెదురు మొక్కవెదురు మొక్క ఇంట్లో ఉంచితే అదృష్టం, శాంతి కలుగుతాయి. ఈ మొక్కని ఇంట్లో పెంచడం వల్ల సానుకూల శక్తి వ్యాపిస్తుంది.

పీస్ లిల్లీ :

పీస్ లిల్లీపీస్ లిల్లీ మొక్క గాలిని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. ఈ మొక్క ఇంట్లో ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. సానుకూల శక్తి కూడా వ్యాపిస్తుంది.

కలబంద:

కలబంద మొక్క ఇంట్లో ఉన్న చెడు శక్తుల్ని తొలగిస్తుంది. ఇంట్లో కలబంద మొక్క పెంచడం వల్ల మొక్క బాగా పొడవుగా పెరుగుతుంది.

స్నేక్ ప్లాంట్ :

స్నేక్ ప్లాంట్స్నేక్ ప్లాంట్ మొక్క రాత్రిళ్లు ఆక్సిజన్ ఎక్కువగా విడుదల చేస్తుంది. చెడు శక్తిని తొలగిస్తుంది. స్నేక్ ప్లాంట్ ఉంచితే మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇంట్లో సానుకూల శక్తి వ్యాపిస్తుంది.

లావెండర్ మొక్క:

లావెండర్ మొక్కలావెండర్ మొక్క మంచి సువాసనను ఇస్తుంది. లావెండర్‌ మొక్కను ఇంట్లో ఉంచడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ప్రేమ, సంతోషం, శాంతి పెరుగుతాయి.

ఆర్చిడ్ మొక్క:

ఆర్చిడ్ మొక్క ఇంటి అందాన్ని పెంచుతుంది. ఆర్చిడ్ మొక్క శుభానికి ప్రతీక. ఈ మొక్క ఉత్సాహాన్ని కూడా పెంచుతుంది.

రబ్బర్ ప్లాంట్:

ఈ మొక్క సంపద, శ్రేయస్సుకి సంకేతం. ఈ మొక్కను ఇంట్లో పెంచడం వల్ల ఆర్థిక పరంగా కూడా బాగుంటుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..