భారతీయులు ఆహార ప్రియులు. ఒకొక్క ప్రాంతంలో ఒకొక్క రకపు ఆహారపు అలవాట్లు ఉంటాయి. అందుకనే చిన్న తనం నుంచి అమ్మాయిలకు వంట చేయడం నేర్పుతారు. అత్తారింట్లో కొత్త కోడలు చేసే వంటలే ఆమెకు ఒక ప్రత్యెక స్థానాన్ని తీసుకుని వస్తాయి. ఇక పండగలు, పంక్షన్ల సమయంలో కూడా వివిధ రకాల ఆహార పదార్ధాలను తయారు చేస్తారు. ముఖ్యంగా స్వీట్లకు మంచి ప్లేస్ ఉంది. అయితే ఎక్కువ మంది రవ్వ కేసరి, సేమ్యా హల్వా, బియ్యం పాయసం వంటి వాటినే తయారు చేస్తారు. నచ్చిన స్వీట్ ను మార్కెట్ నుంచి తెప్పిస్తారు. ఈ నేపధ్యంలో మీ ఇంట్లో భిన్నంగా స్వీట్ తయారు చేయడం ట్రై చేయాలనుకుంటే పిల్లలు పెద్దలు అత్యంత ఇష్టంగా తినే రస్ మలై బెస్ట్ ఎంపిక. బెంగాల్ లో పుట్టిన ఈ వంటకం ప్రపంచం వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. ప్రపంచంలో టాప్ 10 బెస్ట్ చీజ్ డెజెర్ట్స్‌లో సెకండ్ ప్లేస్ లో నిలిచింది.
బెంగాలీ వంటకం రస్ మలై మృదువుగా, జ్యుసిగా ఉండి నోట్లో వేసుకోగానే కరిగిపోయే డెజర్ట్. చాలా మంది ఈ రస్ మలై ని ఇంట్లో తయారు చేయలేమని అనుకుంటారు, అయితే కొన్ని సాధారణ చిట్కాలను పాటిస్తూ స్వీట్ షాప్స్ లో దొరికే విధంగా రుచికరమైన రసమలైని ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఈ రోజు భారతీయుల ఫేవరేట్ స్వీట్ రస్ మలై రెసిపీ ని తెలుసుకుందాం..
రస్ మలై చేయడానికి కావాల్సిన పదార్థాలు
చిక్కటి పాలు- రెండున్నర లేదా మూడు లీటర్లు
వైట్ వెనిగర్ లేదా నిమ్మ రసం – కొంచెం
చక్కెర లేదా పటికి బెల్లం పొడి రుచికి సరిపడా
నీరు – ఒక కప్పు
ఐస్ క్యూబ్స్ – రెండు
యాలకుల పొడి
కుంకుమపువ్వు
పిస్తా
బాదం
జీడిపప్పు
ఫుడ్ కలర్ లేదా కస్టర్డ్ పౌడర్
తయారీ విధానం: ముందుగా రబ్రీ తయారు చేయండి. ఒక పెద్ద గిన్నెని తీసుకుని 3 కప్పుల పాలు పోయండి. మీడియం మంట మీద మరిగించడ్ని. ఇప్పుడు కుంకుమపువ్వు/కేసర్ వేసి కస్టర్డ్ పౌడర్ వేసి
స్విమ్ లో పెట్టి ప్రతి కొన్ని నిమిషాలు వేడి చేసి తర్వాత షుగర్ లేదా పటికి బెల్లం పొడిని వేసి వేడి చేయండి. తక్కువ మంట మీద ప్రతి 2 నుండి 3 నిమిషాలకు కదిలిస్తూ ఉండండి. ఇలా చేస్తున్న సమయంలో పాల పైన వచ్చే మలై/క్రీమ్‌ను పక్కన పెట్టండి.. ఈ పాలు సగానికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫే చేసి సంగం క్రీంని ఫ్రిజ్‌లో పెట్టండి. మిగిలిన వాటిని అదే గిన్నెలో ఉంచండి.
ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద మందపాటి అడుగు ఉన్న గిన్నెను పెట్టాలి. ఇప్పుడు అందులో తీసుకున్న పాలను పోసి.. మీడియం మంటమీద మరిగించాలి. ఇలా పాలు మరుగుతున్న సమయంలో గిన్నెలో అడుగు అంటకుండా అప్పుడప్పుడు గరిటెతో కదిలిస్తూ ఉండాలి. ఇలా పాలు మరిగిన తర్వాత పన్నీర్ కోసం.. మరుగుతున్న పాలల్లో ఒక స్పూన్ వెనిగర్ లేదా నిమ్మరసం వేయండి. ఇప్పుడు పాలు విరిగి.. పన్నీర్ అవ్వడం మొదలవుతుంది. పన్నీర్ బాగా అయ్యింది అని అనిపించిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి పాల గిన్నెలో ఐస్ క్యూబ్స్ వేయండి. ఇలా చేయడం వలన పన్నీర్ మృదువుగా వస్తుంది. కొంచెం సేపు అలా విరిగిన పాలను వదిలేయండి. తరువాత పన్నీరును శుభ్రమైన మస్లిన్ లేదా కాటన్ క్లాత్ లో వేసి నీటిని ఫిల్టర్ చేసి పన్నీర్ ను వేరు చేయండి.
ఇంతలో పిస్తా, బాదం, జీడిపప్పులను వేడి నీటిలో నానబెట్టి కాసేపటి తర్వాత ముక్కలుగా కట్ చేయండి.. నీటిని నుంచి వేరు చేసిన పన్నీర్ ను ఒక గిన్నెలో వేసుకుని మెత్తగా అయ్యేలా చేయండి. ఇలా స్మూత్ గా అయిన పన్నీరుని తీసుకుని కావలసిన సైజులో గుండ్రంగా ఉండలు సిద్ధం చేసుకోండి.. ( పగుళ్లు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి).. ఈ గుండ్రం బంతులను కొంచెం నొక్కి.. చదును చేయండి. ఈ బాల్స్ మరింత రుచిగా ఉండాలనుకుంటే ఉండల మధ్యలో సన్నగా తరిగిన జీడిపప్పును పెట్టుకోవచ్చు. ఇప్పుడు కొంచెం లోతున్న బాణలి లేదా పాన్‌ని తీసుకుని స్టవ్ మీద పెట్టి 3 1/2 కప్పుల నీటిలో 1 కప్పు చక్కెర వేసి మరిగించండి. సిరప్ కొంచెం మరగడం ప్రారంభించిన తర్వాత అందులో సిద్ధం చేసి పెట్టుకున్న పన్నీర్ బాల్స్ వేసి 5 నుండి 7 నిమిషాలు ఉడికించండి. ఇప్పుడు ఆ పన్నీర్ బాల్స్ పంచదార పాకంలో ఉడికి పెద్దగా అవుతాయి. అంతేకాదు స్వీట్ ని అవి పీల్చుకుంటాయి.
చివరిగా
20 నిమిషాలు పన్నీర్ బాల్స్ పక్కకు పెట్టి చల్లార నివ్వండి. ఇప్పుడు ఒకొక్కటిగా వాటిని షుగర్ సిరప్ నుంచి తీసి అరచేతుల మధ్య మెత్తగా పిండండి. ఇలా షుగర్ సిరప్ ను తీసిన పన్నీర్ బాల్స్ ను
మిగిలిన రబ్రీ మిశ్రంమంలో వేసింది. సర్వ్ చేయాలనుకున్నప్పుడు వీటిని ప్రిజ్ద్ లో పెట్టిన రబ్రీ మిశ్రమం వేసి.. తరిగిన బాదం, పిస్తా, జీడిపప్పుతో గార్నిష్ చేసి అందించండి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..