Lifestyle: ఈ లక్షణాలా.? మీ రన్నింగ్ షూస్‌ను మార్చాల్సిన సమయం వచ్చినట్లే..

|

Oct 09, 2024 | 7:14 PM

వాకింగ్ లేదా రన్నింగ్ చేసే సమయంలో షూస్‌ ధరించడం సర్వసాధారణమైన విషయం. అయితే ప్రతీ దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉన్నట్లే రన్నింగ్ షూలకు కూడా ఉంటుందని మీకు తెలుసా.? కొన్ని రకాల మార్పుల ఆధారంగా మీ రన్నింగ్ షూస్‌ మార్చాల్సిన సమయం వచ్చినట్లేనని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా రన్నింగ్ షూస్‌లను ధరించడం వల్ల...

Lifestyle: ఈ లక్షణాలా.? మీ రన్నింగ్ షూస్‌ను మార్చాల్సిన సమయం వచ్చినట్లే..
Running Shoes
Follow us on

వాకింగ్ లేదా రన్నింగ్ చేసే సమయంలో షూస్‌ ధరించడం సర్వసాధారణమైన విషయం. అయితే ప్రతీ దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉన్నట్లే రన్నింగ్ షూలకు కూడా ఉంటుందని మీకు తెలుసా.? కొన్ని రకాల మార్పుల ఆధారంగా మీ రన్నింగ్ షూస్‌ మార్చాల్సిన సమయం వచ్చినట్లేనని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా రన్నింగ్ షూస్‌లను ధరించడం వల్ల కీళ్లు, కండరాల నొప్పులు రావు. అయితే షూస్‌ ఎక్స్పైరీ డేట్‌ దాటితే మాత్రం అదే సమస్యలకు దారి తీస్తుందని అంటున్నారు. సాధారణంగా షూస్‌ లైఫ్‌ టైమ్‌ కేవలం 300 నుంచి 500 మైళ్ల వరకు మాత్రమే. అంటే సగటున ప్రతీ ఏడాది షూస్‌ మార్చాలని నిపుణులు చెబుతున్నారు.

* రన్నింగ్ చేస్తున్న సమయంలో కీళ్లు, కండరాల్లో నొప్పులు లేదా కండరాల అలసట భావన కలిగినట్లు అనిపిస్తే మీ షూస్‌ జీవితకాలం ముగిసినట్లే అర్థం చేసుకోవాలి. బూట్లలో ఉండే కుషనింగ్‌ కాలపరిమితి చెల్లిందని అర్థం. ఇలాంటి సమస్యలు వస్తే వెంటనే షూస్‌లను మార్చేయాలి.

* ఇక రన్నింగ్ లేదా వాకింగ్ చేస్తున్న సమయంలో పాదాలకు బొబ్బలు లేదా గాయాలు వస్తుంటే సదరు షూస్‌ కాల పరిమితి చెల్లిందని భావించాలి. బూట్లలో కుషనింగ్ కోల్పోతే పాదాల చర్మంపై రాపిడి పడుతుంది. ఇది బొబ్బలకు దారి తీస్తుందని అంటున్నారు.

* పాడైపోయిన రన్నింగ్‌ షూస్‌ ఉపయోగడం వల్ల అరికాళ్లలో లేదా పాదాలు, మోకాళ్లపై తీవ్రమైన ఒత్తిడి కలుగుతుంది. ఇది అరికాళ్లు అరిగిపోవడానికి, గాయం కావడానికి కారణమవుతుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే షూస్‌ మార్చాల్సిన సమయం వచ్చిందని అర్థం చేసుకోవాలి.

* ఇక షూస్‌ బాటమ్‌ అరిగినా వెంటనే మార్చాలని నిపుణులు చెబుతున్నారు. వీటివల్ల పాదంపై ఒత్తిడి తీవ్రమవుతుంది. ఇలాంటి సమస్య ఏర్పడితే రన్నింగ్‌ చేసేప్పుడు సౌకర్యవంతంగా ఉండదు, అలాగే కాళ్ల నొప్పులు వేధిస్తాయి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..