Weight Loss Tips: మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తే ఈ 4 విషయాలు అస్సలు మరిచిపోకండి..!

|

Sep 12, 2021 | 8:12 PM

Weight Loss Tips: ఆధునిక జీవన శైలి, సమయపాలన లేని ఆహార పద్దతుల వల్ల చాలామంది విపరీతంగా బరువు పెరిగిపోతున్నారు. దీంతో అనారోగ్య సమస్యలు కొని

Weight Loss Tips: మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తే ఈ 4 విషయాలు అస్సలు మరిచిపోకండి..!
Weight Loss
Follow us on

Weight Loss Tips: ఆధునిక జీవన శైలి, సమయపాలన లేని ఆహార పద్దతుల వల్ల చాలామంది విపరీతంగా బరువు పెరిగిపోతున్నారు. దీంతో అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకొని బాధపడుతున్నారు. తర్వాత బరువు తగ్గించుకోవడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తున్నారు. అందుకోసం ఎక్సర్‌ సైజ్‌లు, గంటల తరబడి జిమ్‌లో గడపడం వంటివి చేస్తున్నారు. కానీ ఈ 4 విషయాలను మరిచిపోకుండా పాటిస్తే కచ్చితంగా బరువు తగ్గుతారు.

1. మరింత చురుకుగా ఉండాలి
బరువు తగ్గాలని ప్రయత్నిస్తే మరింత చురుకుగా ఉండాలి. ఎందుకంటే ఉదయాన్నే నిద్ర లేచి వర్కవుట్స్‌ చేయాలి. సాయంత్రం వాకింగ్‌కి సమయం కేటాయించాలి. రోజూ వ్యాయామం, యోగా, ధ్యానం చేయాలి. ఒక్కరోజు చేయకపోయినా ఆ ఎఫెక్ట్ శరీరంపై కనిపిస్తుంది. అందుకే చురుకుగా ఉండటం తప్పనిసరి.

2. తగినంత నీరు
ఒక సాధారణ వ్యక్తి ప్రతిరోజూ కనీసం 2.5 లీటర్ల నీటిని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. మీరు బరువు తగ్గించే ప్రయాణంలో ఉన్నట్లయితే కనీసం 3 లీటర్ల నీరు తాగాలి. రాత్రి సమయంలో మీ మెటబాలిజం మందగించినట్లయితే ఉదయాన్నే ఒకటి నుంచి రెండు గ్లాసుల గోరువెచ్చని నీరు త్రాగాలి. మీ జీర్ణక్రియతో పాటు విషాన్ని బయటకు పంపడంలో వేడి నీరు సహాయపడుతుంది.

3. తగినన్ని పండ్లు తినాలి.
పండ్లు మీకు చాలా శక్తిని ఇస్తాయి. బరువు తగ్గించే ప్రయత్నంలో ఉన్నప్పుడు కచ్చితంగా సీజనల్‌ ఫ్రూట్స్‌ తీసుకోవడం అవసరం. పండ్లు ఎంత ఎక్కువగా తింటే అంత మంచిది. ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు, పీచు, ఖనిజాలు, విటమిన్లు, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి.

4. అల్పాహారం మిస్ చేయవద్దు
అల్పాహారం మానేయడం వల్ల త్వరగా బరువు తగ్గవచ్చని చాలా మంది నమ్ముతారు. కానీ అది మీకు తీరని నష్టం చేకూరుస్తుంది. అల్పాహారం మానేయడం మంచిది కాదు. ఓట్స్, రాగి మొదలైన అల్పాహారాలను తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. తేలికపాటి అల్పాహారం రోజంతా మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుతుంది.

రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. సరిగ్గా వారం రోజులకే ఇంటి నుంచి భార్య మాయం.. చివరకు..

Moles: శరీరంలోని ఈ 5 భాగాలలో పుట్టుమచ్చ ఉంటే అదృష్టవంతులు..! ఎలాగో తెలుసుకోండి..

Viral Video: ఆడుకుంటున్న చిన్నారి వద్దకు బ్లాక్‌ కోబ్రా..! తర్వాత ఏం జరిగిందో చూస్తే షాక్‌..