Idli vs Poha: ఇడ్లీ లేదా పోహా.. బరువు తగ్గేందుకు ఏది బెస్ట్.. నిపుణులు సజెస్ చేసేదేంటి?

Idli vs Poha weight Loss: మనం పొద్దున్నే చేసే బ్రేక్‌ఫాస్ట్ అనేది మనం రోజు మొత్తం ఎలా ఉంటామేది నిర్ణయిస్తుంది. కాబట్టి బ్రేక్‌ఫాస్ట్‌లోకి మంచి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. చాలా మంది మార్నింగ్‌ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఇడ్లీ, పోహా వంటి తేలికైన, ఆరోగ్యకరమైన అల్పాహారాలను తీసుకుంటారు. అయితే రెండింటికీ వాటి స్వంత ప్రయోజనాలు ఉన్నాయి. కానీ బరువు తగ్గడానికి, మెరుగైన జీర్ణక్రియకు ఏది ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందనే ప్రశ్న తరచుగా తలెత్తుతుంది. కాబట్టి ఈ విషయంలో రెండింటిలో ఏది ఉత్తమ ఫలితాలను ఇస్తుందో తెలుసుకుందాం.

Idli vs Poha: ఇడ్లీ లేదా పోహా.. బరువు తగ్గేందుకు ఏది బెస్ట్.. నిపుణులు సజెస్ చేసేదేంటి?
Healthy Breakfast Options

Updated on: Jan 24, 2026 | 5:59 PM

మన దేశంలో చాలా మంది మార్నింగ్‌ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఇడ్లీ, దోశ, పోహా వంటి ఆహారాలను తీసుకుంటూ ఉంటారు. ఇందులో ఇడ్లీ, పోహా విషయానికి వస్తే.. రెండూ తేలికైనవి, రుచికరమైనవి. వీటిని త్వరగా వండుకోవచ్చు. అలాగే వీటిని పిల్లల నుంచి పెద్దల వరకు ఇంట్లోని ప్రతి ఒక్కరూ ఇష్టపడుతారు. కానీ బరువు తగ్గడం, మెరుగైన జీర్ణక్రియ, రోజంతా శక్తి విషయానికి వస్తే, ప్రజలు తరచుగా ఇడ్లీ లేదా పోహా తినాలా వద్దా అనే విషయంలో గందరగోళానికి గురవుతారు. అందువల్ల, ఈ రెండింటిలో ఏది, ఎందుకు ఆరోగ్యకరమైనదో చూద్దాం.

పోషక విలువల పరంగా

ఇడ్లీని పులియబెట్టిన బియ్యం, మినపప్పుతో తయారు చేస్తారు. ఇందులో ప్రోటీన్, బి విటమిన్లు, జీర్ణక్రియకు సహాయపడే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ఉంటాయి. పోహాను కూడా చదును చేసిన బియ్యంతో తయారు చేస్తారు. అలాగే దీన్ని కూరగాయలు, వేరుశెనగలు, తేలికపాటి సుగంధ ద్రవ్యాల వండుతారు కాబట్టి దీని రుచి అద్భుతంగా ఉంటుంది. ఇది శరీరానికి ఇనుము, తేలికపాటి కార్బోహైడ్రేట్లు, ఫైబర్‌ను అందిస్తుంది.

కేలరీలు, బరువు తగ్గడం

ఒక మీడియం ఇడ్లీలో దాదాపు 39 కేలరీలు ఉంటాయి. అలాగే కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది, ఇది బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి ఆరోగ్యకరమైన ఎంపిక. మరోవైపు, ఒక గిన్నె పోహా తయారీ పద్ధతిని బట్టి దాదాపు 180–200 కేలరీలు కలిగి ఉంటుంది. ఇందులో అధిక కేలరీల కంటెంట్ ఉన్నప్పటికీ, పోహా మీకు ఎక్కువసేపు కడుపు నిండిని అనుభూతిని ఇస్తుంది. కానే దీన్ని వండేప్పుడు ఎక్కువ నూనెను ఉపయోగిస్తే.. బరువుపెరిగే అవకాశం ఉంటుంది.

జీర్ణక్రియ, పేగు ఆరోగ్యం

ఇడ్లీని కిణ్వ ప్రక్రియ ద్వారా తయారు చేస్తారు, కాబట్టి ఇందులో జీర్ణక్రియను మెరుగుపరిచే, పోషకాలను బాగా గ్రహించడాన్ని ప్రోత్సహించే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా (ప్రోబయోటిక్స్) ఉంటుంది. ఇడ్లీ మృదువుగా, తేలికగా, సులభంగా జీర్ణమయ్యేలా ఉంటుంది. కాబట్టి పిల్లలు లేదా వృద్ధులు ఎవరు తిన్నా సులభంగా జీర్ణయం అవుతుంది. పోహా కడుపుకు కూడా తేలికగా ఉంటుంది, కానీ ఇందులో ప్రోబయోటిక్స్ ఉండవు. ఇందులో తక్షణ శక్తిని అందించే సులభంగా జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్లు ఉంటాయి, కానీ ఇది దీర్ఘకాలిక పేగు ఆరోగ్యానికి ఇడ్లీ వలె ప్రయోజనకరంగా ఉండదు.

బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఏది బెస్ట్

ఈ రెండూ ఆహారాలు ఆరోగ్యకరమైనవే. అయితే మీరు బరువు తగ్గాలని, మంచి జీర్ణక్రియ, పేగు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చూస్తున్నట్లయితే, ఇడ్లీ మీకు మంచి ఎంపిక అవుతుంది. అయితే, మీకు ఉదయాన్నే శక్తి అవసరమైతే లేదా ఇనుము లోపం ఉంటే, పోహా మరింత ప్రయోజనకరంగా ఉండవచ్చు. రెండింటి మధ్య ప్రత్యామ్నాయంగా తీసుకొని వాటిని మీ ఆహారంలో చేర్చుకోవడం ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.