చాక్లెట్ తినడానికి ఇష్టపడే వారికి.. చాక్లెట్ వడిచిపెట్టడం ఒక కల లాంటిది. అలాంటి వారి కోసం ఓ నెల రోజుల పాటు చాక్లెట్ మానేసి, ఆ తర్వాత మీ శరీరంలో వచ్చే మార్పులను చూడండి అంటూ ఈ కథనం ద్వారా ఛాలెంజ్ ఇస్తున్నాం. మీ శరీరంలో వచ్చే మార్పులను చూసి మీరు ఆనందిస్తారు. మీరు ఒక నెల పాటు చాక్లెట్ తినడం మానేస్తే, మీ శరీరంలో కొన్ని మార్పులు వస్తాయి. మీరు కూడా నమ్మలేరు.. చాలా మంది చాక్లెట్ తినడానికి ఇష్టపడతారు. కానీ కొందరికి చాక్లెట్ తిన్నాక ముఖంపై మొటిమలు వస్తాయి. దీనితో పాటు, అనేక రకాల చర్మ సంబంధిత వ్యాధులు కూడా ఉన్నాయి.
హెల్త్ ఆర్టికల్ అందించిన సమాచారం ప్రకారం, ఎప్పుడైతే స్వీట్ లేదా హై క్యాలరీ ఫుడ్ ఐటమ్స్ తినాలని అనిపిస్తుంది. అప్పుడు కొన్ని సహజమైన వాటిని తినడానికి ప్రయత్నించాలని డాక్టర్లు అంటున్నారు. ఎండుద్రాక్ష, జీడిపప్పు, ఖర్జూరం వంటివి తినాలి. మిఠాయిలు శరీరానికి ఏమాత్రం మేలు చేయకపోగా ఎక్కువ హాని కలిగిస్తాయి.
తక్కువ చక్కెర, ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు కలిగిన అధిక కోకో కంటెంట్ (70% లేదా అంతకంటే ఎక్కువ) ఉన్న డార్క్ చాక్లెట్‌ను తక్కువగా తినండి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి