తలసి పూజ చేసేముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.. ఇలా చేస్తే ఇంట్లోని సమస్యలన్నీ మాయం..

లక్ష్మీదేవి కటాక్షం కలగాలన్నా, ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తొలగిపోవాలన్నా తులసి మొక్కను పూజించడం ఒక్కటే సరిపోదు.. వాస్తు శాస్త్రం ప్రకారం తులసి పూల విషయంలో కొన్ని నియమాలు పాటించాలి. చాలామంది మంజరిని అలాగే వదిలేస్తుంటారు, కానీ అది మొక్కకు భారం అని మీకు తెలుసా? ఆ మంజరిని ఎప్పుడు కోయాలి? ఏ రోజుల్లో తాకకూడదు? అనే విషయాలు తెలుసుకోండి..

తలసి పూజ చేసేముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.. ఇలా చేస్తే ఇంట్లోని సమస్యలన్నీ మాయం..
How To Use Tulsi Manjari For Wealth

Updated on: Apr 11, 2026 | 12:40 PM

హిందూమతంలో తులసి మొక్కకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. తులసిని కేవలం ఒక మొక్కగా కాకుండా సాక్షాత్తూ లక్ష్మీ స్వరూపంగా భావించి పూజిస్తారు. తులసి కోట ఉన్న ఇంట్లో సానుకూల శక్తి ఉంటుందని మన నమ్మకం. అయితే చాలామందికి తులసి ఆకుల ప్రయోజనాలే తెలుసు, కానీ తులసి పూలు, గింజలలో దాగున్న ఆధ్యాత్మిక రహస్యాలు తెలియవు. తలుసి పూలను మంజరి అని కూడా అంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం తులసిపూలతో చేసే కొన్ని పరిహారాలు మీ ఇంటికి సిరిసంపదలను తెచ్చిపెడతాయి.

విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రం

తులసి అంటే విష్ణుమూర్తికి ప్రాణం. మీ ఇంట్లోని తులసి మొక్కకుపూలు ఎక్కువగా వచ్చినప్పుడు, వాటిని శుభ్రమైన నీటితో కడిగి, గురువారం నాడు శ్రీమహావిష్ణువుకు సమర్పించండి. ఇలా చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం లభించి, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

ఆర్థిక ఇబ్బందులకు చెక్ పెట్టండిలా..

డబ్బు నిలవాలంటే: పూజ చేసిన తులసి మంజరిని ఒక శుభ్రమైన ఎర్రటి వస్త్రంలో కట్టి, మీ బీరువాలో లేదా పర్సులో ఉంచుకోండి. ఇది సంపదను ఆకర్షించడానికి ఒక శక్తివంతమైన పరిహారంగా పరిగణించబడుతుంది.

లక్ష్మీ కటాక్షం: లక్ష్మీదేవి పూజ సమయంలో మంజరిని సమర్పించడం వల్ల కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి.

ప్రతికూల శక్తి దూరం: గంగాజలంలో తులసి మంజరిని ముంచి, ఆ నీటిని ఇల్లంతా చల్లడం వల్ల ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి, ప్రశాంతత నెలకొంటుంది.

పూలు ఎప్పుడు, ఎలా కోయాలి?

తులసి మంజరిని కోసే విషయంలో చాలామంది పొరపాట్లు చేస్తుంటారు. గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే:

రంగు మారినప్పుడే: పూలు పచ్చగా ఉన్నప్పుడు కోయకూడదు. అది పూర్తిగా ఎండిపోయి గోధుమ రంగులోకి మారినప్పుడు మాత్రమే విరవాలి.

అనుమతి తప్పనిసరి: పూలను కోసేముందు ముందు తులసి మాతకు మనస్ఫూర్తిగా నమస్కరించి, అనుమతి తీసుకున్నాకే ఆ పని చేయాలి.

నిషిద్ధ రోజులు: ఆదివారాలు, ఏకాదశి రోజుల్లో, సూర్యాస్తమయం తర్వాత తులసిని అసలు తాకకూడదు. స్నానం చేయకుండా మురికి చేతులతో తులసిని తాకడం మహా పాపం.

ఈ జాగ్రత్తలు పాటించండి

  • తులసి మొక్క చుట్టూ ఎప్పుడూ పరిశుభ్రత ఉండాలి. మొక్క దగ్గర చెప్పులు వదలడం లేదా చెత్తబుట్టలు ఉంచడం వంటివి చేయకూడదు.
  • తులసి కోట దగ్గర కాక్టస్ వంటి ముళ్ల మొక్కలను అస్సలు పెంచకూడదు.
  • మొక్క నుండి వాటంతట అవే రాలిపడిన మంజరిని సేకరించి పూజకు ఉపయోగించడం అత్యంత శుభప్రదం.
Follow Us