నల్ల​నాగు లాంటి పొడవైన జడ కోసం చియా సీడ్స్ .. ఇలా వాడితే మ్యాజిక్ లాంటి మార్పు..

రాత్రి వేళ నానబెట్టిన చియా గింజలను తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. చియా విత్తనాలు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్, జింక్, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఈ చియా విత్తనాలు, ఆరోగ్యంతోపాటు అందానికి మేలు చేస్తాయి. పైగా కేశ సౌందర్యాన్ని కూడా రెట్టింపు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అదేలాగో ఇక్కడ తెలసుకుందాం..

నల్ల​నాగు లాంటి పొడవైన జడ కోసం చియా సీడ్స్ .. ఇలా వాడితే మ్యాజిక్ లాంటి మార్పు..
Chia Seeds

Updated on: May 26, 2025 | 1:11 PM

పొడవాటి, బలమైన జుట్టు ఎంతో అందాన్ని ఇస్తుంది. అందుకే ప్రతి ఆడపిల్ల పొడవైన జుట్టు కావాలని కోరుకుంటారు. అందుకోసం రకరకాలైన జుట్టు సంరక్షణ చర్యలు చేపడుతుంటారు. అయితే, చియా సీడ్స్‌తో కూడా మెరిసే, బలమైన, ఒత్తైన జుట్టు మీ సొంతం చేసుకోవచ్చునని మీకు తెలుసా..? అవును చియా విత్తనాలను ఉపయోగించి జుట్టును బలంగా, ఒత్తుగా, పొడవుగా పెంచుకోవచ్చు అంటున్నారు నిపుణులు..అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం…

చియా గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. చియా విత్తనాలు చిన్నవిగా కనిపించినా వాటిలో ఉన్న పోషక పదార్థాలు ఎంతో శక్తివంతంగా ఉంటాయి. రాత్రి నిద్రించే ముందు వీటిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు అద్భుతంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. రాత్రి చియా గింజలు తీసుకుంటే శరీరం హైడ్రేటెడ్ గా ఉండి ఉదయం తాజా భావన కలుగుతుంది. చియా గింజలు చిన్నగా కనిపించినా వాటిలో ఉన్న శక్తి చాలా ఎక్కువ. రాత్రి వేళ నానబెట్టిన చియా గింజలను తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. చియా విత్తనాలు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్, జింక్, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఈ చియా విత్తనాలు, ఆరోగ్యంతోపాటు అందానికి మేలు చేస్తాయి. పైగా కేశ సౌందర్యాన్ని కూడా రెట్టింపు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఇందుకోసం 2 టేబుల్ స్పూన్ల చియా విత్తనాలను తీసుకుని అర కప్పు నీటిలో 30 నిమిషాలు నానబెట్టాలి.. అవి జెల్ లాంటి ఆకృతిని ఏర్పరచిన తర్వాత దీనిని తలకు, జుట్టు మొత్తానికి అప్లై చేసుకోవాలి.. ఒక అరగంట తరువాత శుభ్రంగా వాష్ చేసుకోవాలి. తరచూ ఇలా చేయటం వల్ల మీ నెత్తిని హైడ్రేట్ చేస్తుంది. తలలో పొడితనాన్ని తగ్గిస్తుంది. నానబెట్టిన చియా విత్తనాలను అలోవెరా జెల్ తో మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని మీ నెత్తికి, జుట్టుకు అప్లై చేయండి. దీన్ని 10-15 నిమిషాలు ఉంచండి. దురద, చుండ్రును తగ్గించడానికి సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..