Heart Attack in Youth: యువతలో గుండెపోటు మరణాలు పెరగడానికి అసలు కారణం ఇదే
జీవనశైలిలో మార్పులు, సరైన ఆహారం తీసుకోకపోవడం, పెరుగుతున్న ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం వల్ల నేటి కాలంలో యువతలో అధికంగా గుండెపోటు సమస్యలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా కూర్చుని ఎక్కువసేపు పనిచేసేవారు, నిరంతరం ఒత్తిడికి లోనయ్యేవారు, కుటుంబంలో గుండె జబ్బుల సమస్యలు ఉన్నవారికి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది..

Heart Attack In Youth
ఇటీవల కాలంలో గుండెపోటు వృద్ధుల్లోనే కాకుండా చిన్న పిల్లలు, యువకులలో కూడా సంభవిస్తుంది. దీనికి తోడు గుండె సంబంధిత సమస్యలు, అధిక రక్తపోటు, పెరిగిన కొలెస్ట్రాల్, రక్తనాళాల అడ్డంకులు, గుండె స్పందన రేటులో హెచ్చుతగ్గులు కూడా కనిపిస్తున్నాయి. జీవనశైలిలో మార్పులు, సరైన ఆహారం తీసుకోకపోవడం, పెరుగుతున్న ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం ఇందుకు ప్రధాన కారణాలు. ముఖ్యంగా కూర్చుని ఎక్కువసేపు పనిచేసేవారు, నిరంతరం ఒత్తిడికి లోనయ్యేవారు, కుటుంబంలో గుండె జబ్బుల సమస్యలు ఉన్నవారికి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
చిన్న వయసులో గుండెపోటు రావడానికి కారణాలు ఇవే..
- ఎక్కువ సేపు కూర్చోవడం, వ్యాయామం చేయకపోవడం
- జంక్ ఫుడ్, అధిక నూనె గల ఆహారాలు తీసుకోవడం
- నిద్రలేమి, రాత్రిపూట ఆలస్యంగా నిద్ర పోవడం
- నిరంతర ఒత్తిడి, కోపం, మానసిక ఉద్రిక్తత
- ధూమపానం, మద్యం సేవించడం
గుండెపోటుకు ముందు కనిపించే లక్షణాలు
- ఛాతీలో నొప్పి లేదా ఒత్తిడి
- చేయి, మెడ, వీపులో నొప్పి
- శ్వాస ఆడకపోవడం
- అకస్మాత్తుగా అధికంగా చెమట పట్టడం
- తలతిరగడం, బలహీనత
- వాంతులు
జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి?
- ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం.
- ప్రతిరోజూ వ్యాయామం చేయడం.
- సమతుల్యమైన, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం.
- జంక్ ఫుడ్‌కు వీలైనంత దూరంగా ఉండటం.
- ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం చేయడం.
- బాగా నిద్రపోవడం.
- క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.
Follow Us
