Beard: 20 ఏళ్లకే గడ్డం తెల్లబడుతుందా..? ఈ టిప్స్ ఫాలో అవ్వండి

తెల్ల గడ్డం నల్లగా మార్చడానికి మార్కెట్లో అనేక ఉత్పత్తులు అందుబాటులో ఉన్నప్పటికీ, కొన్ని ఇంటి నివారణలను అనుసరించడం ద్వారా మీ తెల్ల గడ్డాన్ని మళ్లీ నల్లగా మార్చుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం....

Beard: 20 ఏళ్లకే గడ్డం తెల్లబడుతుందా..? ఈ టిప్స్ ఫాలో అవ్వండి
Beard Guys

Updated on: Mar 16, 2024 | 1:33 PM

ప్రతి మగవాడు మందపాటి నల్ల గడ్డం కోరుకుంటాడు. అయితే ఎర్లీ ఏజ్‌లో గడ్డం నెరవడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. 30 ఏళ్ల నిండకుండానే గడ్డం తెల్లపడుతుంది. తెల్ల గడ్డం నల్లగా మార్చడానికి మార్కెట్లో అనేక ఉత్పత్తులు అందుబాటులో ఉన్నప్పటికీ, కొన్ని ఇంటి నివారణలను అనుసరించడం ద్వారా మీ తెల్ల గడ్డాన్ని మళ్లీ నల్లగా మార్చుకోవచ్చు. కాబట్టి మీ తెల్ల గడ్డాన్ని సహజంగా నల్లగా మార్చుకోవడానికి కొన్ని సింపుల్ హోం రెమెడీలను ప్రయత్నించండి.

ఒత్తిడికి దూరంగా ఉండండి..

మానసిక ఆరోగ్యానికి అంటే ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం, యోగా చేయడం ముఖ్యం. జుట్టు త్వరగా నెరసిపోవడానికి ఒత్తిడి ప్రధాన కారణం. అలా వాటర్ కూడా బాగా తాగాలి. మీ గడ్డానికి హాని కలిగించే రసాయన ఆధారిత జుట్టు ఉత్పత్తులను ఉపయోగించకుండా ఉండండి.

కొబ్బరి నూనె, నిమ్మ ఆకు:

కొబ్బరి నూనె, నిమ్మకాయ ఆకుల మిశ్రమం తెల్ల గడ్డానికి ఎఫెక్టివ్ రెమెడీ. నిమ్మ ఆకులలో విటమిన్లు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు రంగును ప్రోత్సహించడంలో సహాయపడతాయి. కొంచెం కొబ్బరి నూనెను వేడి చేసి, దానికి కొన్ని నిమ్మ ఆకులను కలపండి. ఆ మిశ్రమాన్ని కాసేపు ఆరబెట్టింది. ఆపై దానిని మీ గడ్డానికి అప్లై చేసి, 30 నిమిషాల తర్వాత కడకండి

జామ ఆకు పొడి:

జుట్టును నల్లగా మార్చడానికి దాని లక్షణాలకు ప్రసిద్ధి చెందిన మరొక సహజ నివారణ ఉంది. మీరు జామ ఆకు పొడిని నీటితో కలిపి పేస్ట్ లా చేసి మీ గడ్డానికి అప్లై చేయండి. పూర్తిగా కడిగే ముందు 30 నిమిషాలు అలాగే ఉంచండి.

విటమిన్ B12:

మీకు విటమిన్ బి12, ఐరన్ జింక్ వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తినండి. ఇది మీ గడ్డం నల్లగా ఉంచడానికి, పెరుగుదలకు ప్రొత్సాహంగా ఉంటుంది.

(ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా డాక్టర్లను సంప్రదించడమే ఉత్తమ మార్గం.)