డయాబెటిక్ రోగులకు రాఖీ స్పెషల్ లడ్డూ.. చక్కెర లేకుండా ఎలా చేయాలంటే?

Edited By:

Updated on: Aug 08, 2025 | 4:13 PM

రక్షాబంధన్ వచ్చేసింది. ఆగస్టు 9న ప్రతి ఒక్కరూ రాఖీ పౌర్ణమిని ఘనంగా జరుపుకోనున్నారు. అయితే ఈ రోజు సోదరీమణులు తమ సోదరుడికి రాఖీ కట్టి, స్వీట్ తినిపిస్తుంటారు. చాలా ఆనందంగా గడుపుతారు. అయితే ఈరోజున డయాబెటిక్ రోగులు మాత్రం స్వీట్ తినలేరు. ఇది ఎక్కడో వారి మనసును కదిలిస్తుంటుంది. కానీ అలా బాధపడాల్సిన పనే లేదు. ఎందుకంటే? రాఖీ రోజున డయాబెటిక్ రోగుల కోసం షుగర్ ఫ్రీ లడ్డూ రెడీ చెయ్యబోతున్నాం. అది ఎలా తయారు చేయాలో మీరు చూసెయ్యండి!

1 / 5
డయాబెటిక్ రోగుల కోసం అంజీర్, ఖర్జూర లడ్డూ ఎలా తయారు చేయాలి అం టే? దాని కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. కప్పు ఎండిన అంజూర పండ్లు, ఒక కప్పు ఖర్జూర, రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి, ఆఫ్ కప్పు బాదం, ఆఫ్ కప్పు జీడిపప్పు, ఆఫ్ కప్పు వాల్ నట్స్, రెండు టేబుల్ స్పూన్ల గుమ్మడికాయ గింజలు, రెండు టేబుల్ స్పూన్ల పొద్దు తిరుగుడు విత్తనాలు, ఆఫ్ కప్పు ఎండు కొబ్బరి, 1/3 స్పూన్ ఏలకుల పొడి.

2 / 5
అంజీర్, ఖర్జూర లడ్డూ తయారీ విధానం : ముందుగా కప్పుడు ఎండిన అంజూర పండ్లు, అరకప్పు ఎండు ద్రాక్ష, కప్పు ఖర్జూరలోని విత్తనాలు తీసి వేసి, వీటిని ఒక పాత్రలో వేసి నిటిలో రాత్రి మొత్తం నానబెట్టాలి. తర్వాత వీటిని మిక్సీ ‌లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.

3 / 5
తర్వాత గ్యాస్ ఆన్ చేసి, దానిపై పాన్ పెట్టి, అరకప్పు నెయ్యి వేయాలి. నెయ్యి వేడి అయిన తర్వాత అర కప్పు బాదం, అరకప్పు జీడిపప్పు, అరకప్పు వాల్ నట్స్, రెండు టేబుల్ స్పూన్ల గుమ్మడి గింజలు, రెండు టేబుల్ స్పూన్ల పుచ్చకాయ గింజలు, రెండు టేబుల్ స్పూన్ల పొద్దుతిరుగుడు గింజలు, అర కప్పు ఎండు కొబ్బరి వేసి బాగా వేయించాలి. తర్వాత వీటిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి.

4 / 5
ఆ తర్వాత అదే పాన్‌లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి, నెయ్యి వేడి అయిన తరవాత 3 బెల్లం ముక్కలు వేసి కరిగించాలి. బెల్లం కరిగిన తరవాత అంజీర్, ఖర్జూర మిశ్రమానని బెల్లం పాత్రలో వేసి బాగా కలపాలి. నోట్ డయాబెటీస్ ఉంటే లడ్డూలో బెల్లం వాడకపోవడమే ఉత్తమం.

5 / 5
తర్వాత బెల్లం, అంజీర్, ఖర్జూర మిశ్రమంలో ముందుగా వేయించుకున్న  డ్రై ఫ్రూట్ విత్తనాలను యాడ్ చేసుకోవాలి. వీటిని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. కాస్త వేడి చల్లారిన తర్వాత ఆ మిశ్రమాన్ని చిన్నగా లడ్డూల్లా చేసుకోవాలి. అంతే అంజీర్, ఖర్జూర లడ్డూ రెడీ.