Pot Biryani: రుచికరమైన కుండ బిర్యానీ తినాలని ఉందా.. ఇంట్లో సింపుల్‌గా ఇలా తయారుచేసుకోండి..

|

Jan 01, 2023 | 2:00 PM

బిర్యానీ రెగ్యులర్‌గా తినేదే.. ఈసారి బిర్యానీలో వెరైటీ రుచి చూడాలని చాలామంది అనుకుంటుంటారు. ఈమధ్యన పాట్ బిర్యానీ చాలా ఫేమస్‌ అయింది. వాస్తవానికి బిర్యానీ చేసి కుండలో పెడితే అది కుండ బిర్యానీ అయిపోతుంది. కాని రుచికరంగా ఆ బిర్యానీని..

Pot Biryani: రుచికరమైన కుండ బిర్యానీ తినాలని ఉందా.. ఇంట్లో సింపుల్‌గా ఇలా తయారుచేసుకోండి..
Pot Biryani
Follow us on

Pot Biryani: బిర్యానీ రెగ్యులర్‌గా తినేదే.. ఈసారి బిర్యానీలో వెరైటీ రుచి చూడాలని చాలామంది అనుకుంటుంటారు. ఈమధ్యన పాట్ బిర్యానీ చాలా ఫేమస్‌ అయింది. వాస్తవానికి బిర్యానీ చేసి కుండలో పెడితే అది కుండ బిర్యానీ అయిపోతుంది. కాని రుచికరంగా ఆ బిర్యానీని తయారుచేయడం అందరికీ సాధ్యం కాదు. అన్ని సరైన మోతాదులో ఉపయోగించినప్పుడు మాత్రమే బిర్యానీ టెస్ట్‌ అదిరిపోతుంది. అలాంటి కుండ బిర్యానీ ఇంట్లోనే తయారు చేయాలనుకుంటే చాలా కష్టపడాలి అనుకుంటారు. కాని చాలా సింపుల్​గా ఈ రెసిపీని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేసుకోవడానికి ఎలాంటి పదార్థాలు కావాలి.. తయారీ విధానం వంటి విషయాలు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

చికెన్ కోసం..

చికెన్ – అరకిలో (ముక్కలు కొంచెం పెద్దవిగా ఉండాలి)

కారం – 1/2 టీస్పూన్

ఇవి కూడా చదవండి

మిరియాల పొడి – 1/2 టీస్పూన్

ఉప్పు – తగినంత

రైస్ కోసం..

బియ్యం – ఒక కప్పు

కారం – 1 టేబుల్ స్పూన్

పసుపు – 1 టీస్పూన్

బ్లాక్ పెప్పర్ – 1 టీస్పూన్

ధనియా పొడి – 2 Tsp

ఉప్పు – రుచికి తగినంత

చికెన్‌ స్టాక్‌- 2కప్పులు

తయారీ విధానం

చికెన్ ముక్కలను మట్టికుండలో తీసుకుని దానిలో కారం, పెప్పర్, ఉప్పు వేసి ఫ్రై చేయాలి. వాటిని బంగారు రంగు వచ్చేవరకు ఉడికించాలి. అనంతరం వాటిని బయటకు తీసి.. ఇప్పుడు అదే పాత్రలో కడిగిన బియ్యాన్ని వేసి అందులో కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. బియ్యం కాస్త వేగిన తర్వాత.. అన్నం ఉడకడానికి చికెన్ స్టాక్ వేయాలి. అనంతరం దానిని బాగా కలపాలి. తరువాత ముందుగా ఫ్రై చేసిన చికెన్ వేయాలి. దీన్ని మూతపెట్టి బియ్యం ఉడికినంత వరకు ఉడికించాలి. చివరిగా నిమ్మకాయ, కొత్తిమీర తరుగుతో దానిని గార్నిష్ చేసి మళ్లీ కలపాలి. అంతే వేడి వేడి కుండ బిర్యానీ తయారు అయింది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం చూడండి..