AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరివేపాకు చెట్టు గుబురుగా పెరగాలంటే ఇలా చేస్తే చాలు.. ఎవరూ చెప్పని సీక్రెట్స్..

మీ ఇంటి కరివేపాకు మొక్క ఒకే ఒక కాండంలా పైకి పెరుగుతోందా? ఆకులు పచ్చగా కాకుండా పాలిపోయినట్లు కనిపిస్తున్నాయా? అయితే మీరు చేస్తున్న చిన్న చిన్న పొరపాట్లే దీనికి కారణం.. పుల్లటి మజ్జిగ నుంచి ఎప్సమ్ సాల్ట్ వరకు.. మీ మొక్కను గుబురుగా మార్చే అద్భుతమైన రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

కరివేపాకు చెట్టు గుబురుగా పెరగాలంటే ఇలా చేస్తే చాలు.. ఎవరూ చెప్పని సీక్రెట్స్..
How To Grow Curry Leaf Plant Faster And Bushier
Krishna S
|

Updated on: May 16, 2026 | 2:25 PM

Share

ప్రతి భారతీయ వంటగదిలో కరివేపాకు తప్పక ఉంటుంది. కేవలం రుచి కోసమే కాకుండా జుట్టు ఆరోగ్యం, జీర్ణక్రియ కోసం కూడా చాలా మంది కరివేపాకును వాడుతుంటారు. అందుకే మార్కెట్లో దొరికే రసాయనాలతో కూడిన ఆకుల కంటే సొంతంగా పెంచుకోవాలని చాలా మంది ఆశపడతారు. కానీ మొక్క నాటిన కొద్ది రోజులకే అది ఎండిపోవడమో లేదా ఎదుగుదల ఆగిపోవడమో జరుగుతుంటుంది. మీ కరివేపాకు మొక్కను నందనవనంలా మార్చడానికి మీరు పాటించాల్సిన పూర్తి గైడ్ ఇక్కడ ఉంది.

వెలుగు ఉంటేనే ఎదుగుదల

కరివేపాకు ఉష్ణమండల మొక్క . దీనికి వేడి మరియు వెలుతురు చాలా అవసరం. చాలా మంది మొక్కను ఇంటి లోపల లేదా నీడ పడే చోట ఉంచుతారు. దీనివల్ల కిరణజన్య సంయోగ క్రియ సరిగ్గా జరగక మొక్క బలహీనపడుతుంది. రోజుకు కనీసం 5 నుండి 8 గంటల పాటు నేరుగా ఎండ తగిలే చోట మొక్కను ఉంచండి. ఒకవేళ మీరు అపార్ట్‌మెంట్‌లో ఉంటే, గాలి మరియు ఎండ బాగా వచ్చే బాల్కనీని ఎంచుకోండి.

నీరు పోయడంలో మెళకువలు

మొక్క వాడిపోకూడదని పదే పదే నీరు పోయడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. కుండీలో నీరు నిలిచిపోతే వేర్లు ఊపిరి తీసుకోలేవు. దీనివల్ల వేర్లు కుళ్లిపోవడం) ఏర్పడి మొక్క అకస్మాత్తుగా చనిపోతుంది. మట్టిని వేలితో తాకి చూడండి. పై పొర పొడిగా ఉంటేనే నీరు పోయండి. కుండీకి అడుగున కచ్చితంగా 3-4 డ్రైనేజ్ రంధ్రాలు ఉండాలి. కుండీ కింద ప్లేట్ పెడితే, అందులో నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి.

మొక్క గుబురుగా మారాలంటే

మీ మొక్క కేవలం ఒకే ఒక పొడవాటి కాండంలా పెరుగుతుంటే మీరు చేస్తున్న తప్పు కత్తిరించకపోవడం. మొక్క పైభాగంలోని చిగుళ్లను ఎప్పటికప్పుడు తుంచుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఆక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి పెరిగి, పక్కల నుండి కొత్త కొమ్మలు పుట్టుకొస్తాయి. దీనివల్ల మొక్క ఒక గొడుగులా గుబురుగా తయారవుతుంది.

మ్యాజికల్ ఫెర్టిలైజర్స్

కరివేపాకు మొక్కకు కృత్రిమ ఎరువుల కంటే సహజమైన పోషకాలంటేనే ఇష్టం.

పుల్లటి మజ్జిగ: వారం రోజులు నిల్వ ఉండి పులిసిన మజ్జిగను నీళ్లలో కలిపి వారానికి ఒకసారి మొక్క మొదట్లో పోయండి. ఇందులోని లాక్టిక్ యాసిడ్ మట్టిలోని బ్యాక్టీరియాను చంపేసి, నత్రజనిని పెంచుతుంది.

బియ్యం కడిగిన నీళ్లు: బియ్యం కడిగిన నీళ్లలో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని వృథా చేయకుండా మొక్కకు పోయండి.

ఎప్సమ్ సాల్ట్: నెలకు ఒకసారి ఒక స్పూన్ ఎప్సమ్ సాల్ట్‌ను నీళ్లలో కలిపి ఆకులపై స్ప్రే చేస్తే ఆకులు ముదురు పచ్చగా మెరుస్తాయి.

చీడపీడల నివారణ

కరివేపాకు ఆకులపై తెల్లటి మచ్చలు లేదా నల్లటి పురుగులు కనిపిస్తుంటే.. లీటర్ నీటిలో కొద్దిగా వేప నూనె, డిష్ వాష్ లిక్విడ్ కలిపి ఆకులపై చల్లండి. ఇది మొక్కను రోగాల నుండి కాపాడుతుంది. మొక్కను పెంచడం అంటే కేవలం నీరు పోయడం మాత్రమే కాదు, దాని అవసరాలను అర్థం చేసుకోవడం.

Follow Us