డార్క్ సర్కిల్స్ పోవాలంటే ఖరీదైన క్రీములే అవసరం లేదు..! మన ఇంట్లోనే సొల్యూషన్ ఉంది..!

ముఖం చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడితే వ్యక్తి అలసినట్లుగా కనిపిస్తారు. చర్మం మసకబారినట్లు మారిపోతుంది, ముఖం ఆకర్షణత తగ్గిపోతుంది. ముఖ్యంగా ఈ నల్లటి వలయాలు కన్నుల కింద స్పష్టంగా కనిపిస్తాయి. మంచి నిద్ర లేకపోవడం, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండటం లేదా రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. ఇది చాలా మందికి చికాకుగా మారే సాధారణ సమస్య.

డార్క్ సర్కిల్స్ పోవాలంటే ఖరీదైన క్రీములే అవసరం లేదు..! మన ఇంట్లోనే సొల్యూషన్ ఉంది..!
Dark Circles Under Eyes

Updated on: May 29, 2025 | 10:44 PM

ఈ నల్లటి వలయాలు పోవాలంటే చాలా ఖరీదైన క్రీములు, చికిత్సలు అవసరం లేదు. మన ఇంట్లోనే ఉండే సరళమైన పదార్థాలతో సహజంగా తయారు చేసుకునే క్రీమ్‌ తో ఈ సమస్య నుంచి వారం రోజుల్లో బయట పడవచ్చు. ఈ క్రీమ్ తయారీకి మూడు ముఖ్యమైన పదార్థాలు అవసరం అవుతాయి. ఒకటి బంగాళదుంప, ఒక చెంచా బాదం పొడి, రెండు చెంచాలు కలబంద జెల్.

ముందుగా బంగాళదుంపను తీసుకుని దానిపై తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటిని నలిపి, గుజ్జుగా చేయాలి. ఈ గుజ్జులోంచి రసం వడకట్టాలి. ఇప్పుడు ఈ రసాన్ని ఒక చిన్న గిన్నెలోకి తీసుకోవాలి. అందులో బాదం పొడి వేసి బాగా కలపాలి. తరువాత కలబంద జెల్ వేసి మళ్ళీ కలపాలి. ఇలా చేసిన తర్వాత మనకు ఒక సహజ క్రీమ్ సిద్ధమవుతుంది.

ఈ క్రీమ్‌ ను ఉపయోగించే ముందు ముఖం పూర్తిగా శుభ్రంగా కడుక్కోవాలి. మేకప్ లేకుండా ఉండాలి. క్రీమ్‌ ను అరచేతిలో తీసుకుని ముఖంపై ముఖ్యంగా కన్నుల చుట్టూ నల్లటి వలయాలపై అప్లై చేయాలి. మృదువుగా మసాజ్ చేయాలి. ఇది రాత్రిపూటనే వేసుకుంటే మంచిది. క్రీమ్‌ ను రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయం లేచి ముఖాన్ని శుభ్రంగా కడగాలి.

ఈ క్రీమ్‌ ను ఒక వారం పాటు ప్రతిరోజూ రాత్రి ఉపయోగిస్తే స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. నల్లటి వలయాలు తగ్గిపోతాయి. ముఖం కాంతివంతంగా మారుతుంది. చర్మం మృదువుగా మారుతుంది. సహజ పదార్థాలు ఉపయోగించడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. కంటి చుట్టూ చర్మానికి మంచి పోషణ కూడా అందుతుంది.

ఈ పదార్థాలన్నీ సహజమైనవి. బంగాళదుంప చర్మం కాంతిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బాదం పొడి చర్మాన్ని శుభ్రం చేస్తుంది. కలబంద జెల్ చర్మానికి తేమను అందిస్తుంది. ఈ మూడు కలిసి పని చేస్తే నల్లటి వలయాలు తగ్గిపోవడమే కాకుండా ముఖం ఆరోగ్యంగా, అందంగా మారుతుంది. ఖరీదైన క్రీములు లేకుండానే ఇంట్లో ఈ చిట్కాతో నల్లటి వలయాల సమస్యను వారం రోజుల్లో పరిష్కరించవచ్చు.