Relationship
Love and Relationships Tips: వర్క్ ఫ్రమ్ హోమ్‌తోపాటు తీవ్ర పని ఒత్తిడి వల్ల చాలా మంది చిటికీమాటికీ కోపం తెచ్చుకుంటున్నారు. ఈ కోపం భార్యాభర్తల మధ్య గ్యాప్ తీసుకోస్తుందంటూ పలువురు సైకాలజిస్ట్‌లు పేర్కొంటున్నారు. ఈ సందర్భంలో మీపై కోపంగా ఉన్న భార్యను కంట్రోల్ చేయకపోతే.. వివాహబంధంలో మరింత గ్యాప్ వస్తుందంటూ చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సతీమణి కోపాన్ని తగ్గించే చిట్కాలు పాటించడం మంచిది. ఇక్కడ ఇచ్చిన సూచనలను ఒకసారి పరిశీలించి సమయం వచ్చినప్పుడల్లా ఆచరించడానికి ప్రయత్నించండి.
- ఆమె మెల్టింగ్ పాయింట్‌ను తెలుసుకోండి: కోపంగా ఉన్న సమయంలో అర్ధం చేసుకునేందుకు ప్రయత్నించాలి. ప్రతి ఒక్కరికీ ఒక వీక్నెస్ ఉంటుంది. దానిని గుర్తుంచుకోండి. మీరు ఆమెకు కోపం వచ్చే విధంగా తప్పు చేస్తే.. ఆమెను బుజ్జగించేందుకు ప్రయత్నించండి. ఇలాంటి సమయంలోనే ఆమె వద్దకు వచ్చి.. దానికి గల కారణాలను వివరించి చెప్పండి.
- ఆమె కోపాన్ని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించండి: ఆమె మీపై కోపంగా, ఆవేశంలో ఉంటే.. మీ మాట వినడానికి సిద్ధంగా ఉండదు. కావున సరియైన సమయం కోసం వేచిచూడండి. కోపం తగ్గేంత వరకు ఆమె చెప్పేదంతా వినండి. ఆమె శాంతించిన తర్వాత మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. కోపంగా ఉన్న ఎవరితోనైనా వాదించడం అర్థరహితం. ఆమె మాట్లాడే సమయంలో అస్సలు మాట్లాడకుండా.. కోపాన్ని అర్ధం చేసుకునే ప్రయత్నం చేయాలి.
- సరేండర్: నిశ్శబ్దంగా ఉండటానికి లేదా వాదించడానికి బదులుగా ఆమెకు లొంగిపోవడమే ఉత్తమమైన మార్గం అని పలువురు పేర్కొంటున్నారు. మీరు ఆమెతో ఏకీభవిస్తున్నానంటూ చెప్పే మీ మాటలు ఆమెను శాంతింపజేస్తాయి. అప్పుడప్పుడు తల వంచండం మంచిదే. భార్యాభర్తలు బంధంలో అప్పుడప్పుడు పొరపచ్చాలు సాధరణం. కావున పట్టింపులకు పోకండి.
- మహిళలు తరచూ కోపంతో బాధపడుతుంటారు. ఎందుకంటే వారు ఇంటి పరిస్థితిని చక్కదిద్దాలి. కావున.. వారు మిమ్మల్ని బాధపెట్టే విషయాలు మీతో పంచుకోవచ్చు. అలాంటి విషయాలను అక్కడితోనే వదిలివేయండి. అర్ధం చేసుకునేలా చెప్పడానికి ప్రయత్నించండి. సూటిపోటి మాటలనకుండా వారితో అన్యోన్యంగా ఉండండి.
Also Read: