kitchen Hacks: సింక్‌పై మెండి మరకలు పోవట్లేదా? ఇలా క్లీన్ చేస్తే.. క్షణాల్లో అద్దంలా మెరవాల్సిందే!

How To Clean Kitchen Sink: ఇంట్లోని మహిళలకు చిరాకు తెప్పించే విషయం ఏమైనా ఉందంటే ఇళ్లు క్లీన్ చేయడం. ఎన్ని సార్లు కడిగినా, కాసేపటికే అన్ని చిందర వందర అవుతాయి. వీటిలో ముఖ్యంగా వంటిట్లో ఉండే సింక్.. దాన్ని క్లీన్ చేయడం అంటే తల ప్రాణం తోకకొస్తుంది. కాబట్టి దీన్ని సింపుల్‌గా క్షణాల్లో ఎక్కవ శ్రమ లేకుండా ఎలా క్లీన్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

kitchen Hacks: సింక్‌పై మెండి మరకలు పోవట్లేదా? ఇలా క్లీన్ చేస్తే.. క్షణాల్లో అద్దంలా మెరవాల్సిందే!
How To Clean Kitchen Sink

Updated on: Feb 20, 2026 | 10:15 PM

ఇంట్లో ఉన్న మహిళలకు పెద్ద సమస్య ఏదంటే సింక్ క్లీనింగ్ దీన్ని రుద్దీ రుద్దీ కొన్ని సార్లు వారు అలసిపోతారు. కానీ దానిపై ఉన్న మురికి మాత్రం పోదు. కానీ ఇప్పుడు మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎంత మురికిగా ఉన్న సింక్‌నైనా ఇప్పుడు మీరు క్షణాల్లో కొత్తదానిలా మర్చేయవచ్చు. అవును మేము ఇప్పుడు మీకు చెప్పబోయే ట్రిక్‌తో మీరు ఎలాంటి స్క్రబ్బింగ్ అవసరం లేదు. ఈ సాధారణ పద్ధతిని అనుసరించడం ద్వారా, మీరు నెలల తరబడి ఉన్న మురికిని తొలగించి సింక్‌ను నిమిషాల్లో అద్దంలా మెరిసేలా చేయవచ్చు. అదెలానో ఇప్పుడు చూద్దాం.

సింక్‌ క్లీన్ చేసేందుకు కావాల్సిన పదార్థాలు

మీరు సింక్ క్లీన్ చేసుకునేందుకు ఒక ద్రావణం తయారు చేయాల్సి ఉంటుంది. దీని కోసం, ముందుగా మీరు మీ ఇంట్లో ఉన్న ఏదైనా ఓ లిక్విడ్ డిటర్జెంట్ తీసుకోవాలి. దాంట్లో ఎదైనా పేస్ట్ లేదా మీరు సిల్వర్ పాలిషింగ్ పౌడర్‌ను యాడ్ చేయండి. అలాగే కొంత వెనిగర్ ఉంటే యాడ్ చేయండి లేకున్నా ఏం పర్లేదు. ఇవన్ని యాడ్ చేసిన తర్వాత దాన్ని కలిపి ఒక బౌల్‌లోకి తీసుకొండి

సింక్‌ను ఎలా క్లీన్ చేయాలి

  • ఈ ద్రావణంతో సింక్‌ను శుభ్రం చేయడానికి, ముందుగా మీరు సింక్‌ను నీటితో కడగండి. ఇలా చేయడం ద్వారా ద్రావణం బాగా వ్యాపించగలదు.
  • ఇప్పుడు తయారుచేసిన ద్రావణాన్ని సింక్ అంతటా పోయండి. ఈ ద్రావణం సింక్ ప్రతి మూలకు చేరేలా చూసుకొండి.
  • తర్వాత బేకింగ్ సోడా, నిమ్మకాయతో తీసుకొని దాన్ని మరకలు ఉన్న దగ్గర రాయండి.
  • తర్వాత ఒక బ్రష్ తీసుకొని సింక్ మొత్తం సున్నింతంగా స్క్రబ్ చేయండి. తర్వాత నీటితో శుభ్రం చేయండి.
  • ఒక్కసారికే మీ సింక్ శుభ్రంగా మారితే ఒకే.. లేదా ఇదే పద్దతిని మరోసారి ఉపయోగించండి.
  • అయితే మీ సింక్‌పై ఇన్నా మరకలు ఉన్నాయనుకుంటే రెండో సారి క్లీన్ చేసేప్పుడు ద్రావణం పోసిన తర్వాత 2గంటల పాటు అలాగే ఉంచండి ఆ తర్వాత క్లిన్ చేయండి.
  • ఇలా మీరు చేయడం ద్వారా మీ సింక్ ఎంత మురికిగా ఉన్న అద్దంలా మెరిసిపోతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us