
ఇండోనేషియా భారతీయ పర్యాటాకులు వెళ్ళే ప్రముఖ గమ్యస్థానం. ముఖ్యంగా హనీమూన్ కోసం వెళ్లాలనుకునే నవ దంపతులు , అందమైన జంటలు అందమైన బాలి ప్రదేశాన్ని అన్వేషించడానికి భారీ సంఖ్యలో ఆసక్తిని చూపిస్తారు. సెలబ్రిటీలు కూడా తమ సెలవులను గడపడానికి ఇక్కడికి వస్తారు. బాలి దాని సహజ సౌందర్యానికి ప్రసిద్ధి చెందింది. ఈ దేశంలో సందర్శించడానికి చాలా అందమైన ప్రదేశాలున్నాయి. అందువల్ల పర్యాటక దృక్కోణంలో కూడా ఇది అత్యంత రద్దీగా ఉండే ప్రదేశాలలో ఒకటి. అయితే ఇండోనేషియాలోని బాలిలో పూర్తి నిశ్శబ్దంగా ఉండే ఒక రోజు ఉంటుందని మీకు తెలుసా.. ఎవరూ శబ్దం చేయలేరు. రవాణా సౌకర్యాలు ముసివేయబడతాయి. అంటే కనీసం ప్రజలు బయటకు కూడా వెళ్లరు. ఆ సమయంలో మీరు ఈ దేశంలో ఉంటే.. మీరు నిజంగా వేరే అనుభవాన్ని అనుభవిస్తారు.
జనాభా పరంగా ఇండోనేషియా నాల్గవ అతిపెద్ద దేశం. ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపసమూహం కూడా. ఇక్కడ జనాభా కూడా చాలా ఎక్కువ. సందర్శించడానికి వచ్చే పర్యాటకులు భారీ సంఖ్యలో బాలికి చేరుకుంటారు. అయినప్పటికీ పూర్తి శాంతి ఉన్న రోజు కూడా ఒకటి ఉంది. ఈ రోజును నిశ్శబ్ద దినం అని పిలుస్తారు. ఇది చాలా ఆశ్చర్యకరమైనా.. ప్రతి సంవత్సరం ఒక రోజు నిర్వహిస్తారు. ఈ రోజును నైపి డే అని పిలుస్తారు. దీని వెనుక కారణం ఏమిటో తెలుసుకుందాం.
నైపీ డే అంటే ఏమిటి?
ప్రతి ప్రదేశానికి దాని సొంత ఆచారాలు ఉంటాయి. అదేవిధంగా ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో ప్రతి సంవత్సరం నైపీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది ఆదేశ నూతన సంవత్సరం. ఈ సమయంలో ప్రజలు 24 గంటలు తమ ఇళ్లలోనే ఉండి మౌనం పాటిస్తారు. లైట్లు కూడా వెలిగించరు. ఈ రోజును ధ్యానం, ఉపవాసం, నిశ్శబ్ద దినంగా పరిగణిస్తారు. అంతేకాదు ఎటువంటి పని చేయరు. వినోదంతో సహా ప్రజలు ప్రయాణించరు. దీని కారణంగా దుకాణాలు, రెస్టారెంట్లు మూసివేస్తారు. రోడ్లు ఖాళీగా కనిపిస్తాయి. ఏ విధమైన ప్రజా కార్యక్రమం జరగదు. ఈ రోజు న్గురా రాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఏ విమానమూ బయలుదేరదు.
అన్ని మతాల ప్రజలు అనుసరిస్తారు
నైపీ దినోత్సవం రోజున ఆ దేశం మొత్తం 24 గంటల పాటు నిశ్శబ్దంగా ఉంటుంది. ఉదయం 6 గంటలకు ప్రారంభమై మర్నాడు రోజు ఉదయం 6 గంటలకు ముగుస్తుంది. ఈ పండుగను ప్రధానంగా హిందూ మతాన్ని అనుసరించే వ్యక్తులు జరుపుకుంటారు. అయితే దీనిని ఆధ్యాత్మిక, సాంస్కృతిక పండుగగా పరిగణించడం వలన అన్ని మతాల ప్రజలు దీని నియమాలను పాటిస్తారు. 2025 సంవత్సరంలో ఈ రోజును మార్చి 29న జరుపుకున్నారు. 2026లో దీనిని మార్చి 19న జరుపుకుంటారు. ఈ రోజు ఇండోనేషియా అంతటా ప్రభుత్వ సెలవుదినం.
ముందు రోజు దృశ్యం అద్భుతంగా ఉంది
నైపీ దినోత్సవానికి ఒక రోజు ముందు రాత్రి ఇక్కడ మీరు ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూడవచ్చు. బాలిలో ఓగో-ఓగో కవాతు జరుగుతుంది. దీనిలో కళాకారులు భారీ రాక్షసుల దిష్టిబొమ్మల గెటప్ ధరించి నడుస్తారు. అగ్ని జ్వాలలు వెలిగిస్తారు. దీనితో పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఇళ్ల చుట్టూ బియ్యం చల్లడం, విగ్రహాలను బీచ్‌లకు తీసుకెళ్లడం ద్వారా శుద్ధి చేయడం, వెదురు డ్రమ్స్ వాయించడం వంటి పనులు ఇందులో జరుగుతాయి.
నూతన సంవత్సరం రోజున ఎందుకు మౌనం పాటిస్తారంటే
ప్రతిచోటా చాలా మంది ప్రజలు నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటారు. బాలిలో నిశ్శబ్దంగా ఉంటారు. ప్రార్థనలు చేస్తారు. దీని వెనుక ఉన్న నమ్మకం ఏమిటంటే ఈ పద్ధతి మానవులకు ప్రకృతితో సామరస్యంగా ఎలా జీవించాలో నేర్పుతుంది. ఇది ప్రతికూల శక్తిని తొలగించి, తమ తప్పుల గురించి మనిషి ఆత్మపరిశీలన చేసుకోవడం ద్వారా జీవితాన్ని మెరుగుపరచుకునే సమయంగా పరిగణించబడుతుంది. అందుకనే నైపి రోజున పూర్తి నిశ్శబ్దాన్ని పాటిస్తారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)