High Temperatures: భారత్‌లో పెరుగుతున్న ఎండలు.. ఆ పంట ఉత్పత్తి తగ్గే చాన్స్..!

|

Feb 18, 2023 | 4:30 PM

భారత్‌లో రానున్న కాలంలో గోధుమ ఉత్పత్తి గణనీయంగా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. పంజాబ్ రాష్ట్రంలోని అధిక సంఖ్యలో రైతులు గోధుమలు సాగు చేస్తున్నారు. సాధారణంగా శీతాకాలంలో కొంత మేర వర్షాలు పడతాయి. అయితే ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడంతో మార్చిలోనే ఎండలు తీవ్రమయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

High Temperatures: భారత్‌లో పెరుగుతున్న ఎండలు.. ఆ పంట ఉత్పత్తి తగ్గే చాన్స్..!
Sun Breaks Off
Follow us on

భారతదేశంలో ఎండలు క్రమేపి పెరుగుతున్నాయి. ఈ ఏడాది మార్చి మధ్యకు చేరే సరికే ఎండలు గరిష్ట స్థాయికు చేరతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఏడు రాష్ట్రాల్లో ఈ ఎండల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. భారత్‌లో ఎక్కువ మంది తీసుకునే ఆహారం గోధుమలు. ఈ ఎండల వల్ల గోధుమ పంటకు తీవ్ర నష్టం చేకూరనుంది. ఎందుకంటే ఫిబ్రవరి నెలలో కొంచెం చల్లని వాతావరణం ఉంటుంది. క్రమేపి మార్చిలో వచ్చే అధిక ఎండల వల్ల గోధుమ ఉత్పత్తిపై ప్రభావం చూపిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్‌లో రానున్న కాలంలో గోధుమ ఉత్పత్తి గణనీయంగా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. పంజాబ్ రాష్ట్రంలోని అధిక సంఖ్యలో రైతులు గోధుమలు సాగు చేస్తున్నారు. సాధారణంగా శీతాకాలంలో కొంత మేర వర్షాలు పడతాయి. అయితే ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడంతో మార్చిలోనే ఎండలు తీవ్రమయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రాబోయే రెండు వారాల్లోని ఎండలు తీవ్రరూపం దాలుస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాబట్టి ఈ పరిస్థితి గోధుమల ఉత్పత్తిపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 

భారత వాతావరణ శాఖ గ్రిడెడ్ డేటా సెట్ ప్రకారం భారతదేశంలో ఫిబ్రవరి 16న గరిష్టంగా నమోదైన ఎండ తీవ్రత 27.52 డిగ్రీల వద్ద ఉంది. వారానికి 1981-2010 సగటు కంటే 0.39 డిగ్రీలు ఎక్కువగా ఉంది. అలాగే ఈ వారంలో సగటు ఉష్ణోగ్రత 25.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది 1951 నుంచి వచ్చిన ఎండలను పోలిస్తే రెండో స్థానంలో ఉంటుంది. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో ఎండలు ముందుగానే ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలో ఈ పరిస్థితి నెలకొని ఉంది. అలాగే మూడో స్థానంలో ఉండే రాష్ట్రాలను తీసుకుంటే రాజస్థాన్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, కేరళ, ఒడిశా, మిజోరంలో ఈ వరుసలో ముందున్నాయి.  పంజాబ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఎండలు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇంచుమించు మార్చి 15 నుంచి 20 తేదీలోపు అన్ని రాష్ట్రాల్లోని ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరే అవకాశం ఉందని నివేదికలు వెల్లడిస్తున్నాయి.  అయితే కొంతమంది నిపుణులు మాత్రం ఫిబ్రవరిలో ఎండలు అధికంగా ఉంటే మార్చిలో కూడా అలాగే ఉంటయనుకోవడం అవివేమని అంటున్నారు. దీనికి సంబంధించి వారు కొన్ని ఉదాహరణలు కూడా ఇస్తున్నారు. చాలా ఫిబ్రవరిలో అధిక ఎండలు ఉన్నా మార్చిలో చలివాతావరణం వచ్చిందని పేర్కొంటున్నారు. కాబట్టి ఎండలను చూసి అప్పుడే అంచనాకు రాకూడదని మరో పదిరోజులు పరిస్థితిని గమనించాలని సూచిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..