మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిందని చెప్పే హెచ్చరిక సంకేతాలు! నిర్లక్ష్యం చేశారంటే మొదటికే మోసం!!

ప్రస్తుత జీవనశైలి, అసంతృప్త ఆహార అలవాట్లు, వ్యాయామ లోపం వల్ల చాలామందిలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతున్నాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పరిమితికి మించి పెరిగినప్పుడు రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి తీవ్ర ప్రమాదాలకు దారితీస్తుంది. సాధారణంగా కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు ఎలాంటి నొప్పి లేదా ప్రత్యక్ష లక్షణాలు కనిపించవు, అందుకే దీనిని సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. కానీ, మన కళ్ళు, చర్మం, కాళ్ళలో కనిపించే కొన్ని చిన్న చిన్న మార్పుల ఆధారంగా కొలెస్ట్రాల్ పెరిగిందని గ్రహించవచ్చు. ఆ ముఖ్యమైన హెచ్చరిక సంకేతాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిందని చెప్పే హెచ్చరిక సంకేతాలు! నిర్లక్ష్యం చేశారంటే మొదటికే మోసం!!
High Cholesterol Symptoms

Updated on: Sep 29, 2026 | 1:39 PM

రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు ప్రారంభంలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించవు. అందుకే దీనిని సైలెంట్ కిల్లర్ అంటారు. అయితే, మన కళ్ళు, చర్మం, కాళ్ళలో కనిపించే కొన్ని మార్పుల ద్వారా కొలెస్ట్రాల్ శాతాన్ని ముందుగానే గుర్తించవచ్చని వైద్యులు చెబుతున్నారు.ఈ గుర్తులను ముందస్తుగా గమనించి వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఆ లక్షణాలేంటో ఇప్పుడు చూద్దాం..

కళ్ళలో కనిపించే మార్పులు:

కంటి రెప్పలపై పసుపు మచ్చలు: కంటి రెప్పల చుట్టూ లేదా మూలల్లో పసుపు రంగులో చిన్న చిన్న కొవ్వు మచ్చలు లేదా గుల్లలు ఏర్పడితే అది శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని చెప్పడానికి స్పష్టమైన సంకేతం.

నల్లపాప చుట్టూ తెల్లటి వలయం: కంటి నల్లపాప చుట్టూ తెల్లటి లేదా బూడిద రంగులో వలయం లాగా ఏర్పడుతుంది. సాధారణంగా వృద్ధులలో ఇది కనిపించినప్పటికీ, చిన్న వయస్సులోనే ఇది వస్తే రక్తంలో కొలెస్ట్రాల్ ప్రమాదకర స్థాయిలో ఉందనడానికి సూచన.

ఇవి కూడా చదవండి

కాళ్ళలో కనిపించే లక్షణాలు:

రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల కాళ్ళకు రక్త ప్రసరణ తగ్గుతుంది. దీని ఫలితంగా.. నడిచేటప్పుడు లేదా మెట్లు ఎక్కేటప్పుడు కాళ్ళ కండరాలు తీవ్రంగా గుంజడం, పిక్కల నొప్పి రావడం. కాళ్ళు ఎల్లప్పుడూ చల్లగా ఉండటం, కాళ్ళలో తరచూ తిమ్మిర్లు రావడం. కాళ్ళపై చర్మం రంగు మారడం, కాళ్ళలోని వెంట్రుకలు రాలిపోవడం, గోళ్ళు మందంగా మారడం.

చర్మంపై కనిపించే సంకేతాలు:

శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు మోచేతులు, మోకాళ్ళు, పిరుదులు లేదా చేతి వేళ్ళ కీళ్ళ వద్ద చర్మం కింద పసుపు లేదా ఎరుపు రంగులో చిన్న చిన్న కొవ్వు గడ్డలు ఏర్పడతాయి. కళ్ళు, చర్మం లేదా కాళ్ళలో పైన పేర్కొన్న మార్పులు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి లిపిడ్ ప్రొఫైల్ బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. సకాలంలో సరైన ఆహార నియమాలు, వ్యాయామం మరియు వైద్యుల సలహాల ద్వారా కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకుని గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us