బీపీ ఒకేసారి ఎక్కువైతే ఏం చేయాలి..? వెంటనే ఈ సింపుల్‌ చిట్కాలు పాటించండి తగ్గుతుంది..!

నేటి అనారోగ్యకరమైన జీవనశైలి, ఒత్తిడి అధిక రక్తపోటుకు ప్రధాన కారణాలు. బీపీ అకస్మాత్తుగా పెరిగినప్పుడు పరిస్థితి విషమించకుండా తక్షణ ఉపశమనం కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. డీప్ బ్రీత్ తీసుకోవడం, సాధారణ ఉష్ణోగ్రత నీరు తాగడం, ఉప్పు లేకుండా నిమ్మరసం తీసుకోవడం వంటివి వెంటనే చేయాల్సిన పనులు. ఇవి గుండె జబ్బుల ముప్పును కూడా తగ్గిస్తాయి.

బీపీ ఒకేసారి ఎక్కువైతే ఏం చేయాలి..? వెంటనే ఈ సింపుల్‌ చిట్కాలు పాటించండి తగ్గుతుంది..!
Sudden High Bp

Updated on: Dec 24, 2025 | 2:06 PM

నేటి అనారోగ్యకరమైన జీవనశైలి అనేక తీవ్రమైన వ్యాధులకు కారణమవుతోంది. (అధిక బీపీ, లో బీపీ)రక్తపోటు పెరగడం లేదా తగ్గడం కూడా వీటిలో ఒకటి. అయితే, ఒక వ్యక్తికి రక్తపోటు అకస్మాత్తుగా పెరిగితే కొన్ని పనులు వెంటనే చేయాలి. దాంతో అతనికి ఉపశమనం దొరుకుతుంది. లేదంటే పరిస్థితి విషమించే ప్రమాదం ఉంటుంది. సడెన్‌గా బీపీ ఎక్కువైతే ముందుగా ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

నేటి ఆధునిక జీవనశైలి, అధిక ఒత్తిడి కారణంగా చాలా మంది బీపీ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. చిన్న పెద్ద తేడాలేకుండా బీపీ వెంటాడుతోంది. ఒకసారి బీపీ వచ్చిందంటే మందులు వాడాల్సిందే. ఒక్క పూట మానేసినా సరే వెంటనే బ్లడ్ ప్రెజర్ పెరిగిపోతుంది. పైగా గుండె జబ్బులు కూడా వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది. అయితే..మందులు వాడడంతో పాటు మరి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే, ఒక్కోసారి కొందరిలో అకస్మాత్తుగా బీపీ పెరిగిపోతూ ఉంటుంది. అలాంటి వారికి ముందుగా గాలి బాగా వచ్చే ప్రదేశంలో కూర్చోని.. డీప్ బ్రీత్ తీసుకోవాలి.

అనంతరం సాధారణ ఉష్ణోగ్రత కలిగిన నీటిని తాగాలి. గుటకలుగా తాగాలి. అలా చేయడం వల్ల రోగికి తక్షణ ఉపశమనం లభించవచ్చు. ఇంట్లో రక్తపోటు అకస్మాత్తుగా పెరిగితే నిమ్మరసం తాగండి. ఈ నీటిలో ఉప్పు లేదా చక్కెర వేయవద్దు. దీని కోసం 1-2 గ్లాసుల నీరు తాగడం మంచిది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..