AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ ఫోన్‌ను ఎక్కువగా సైలెంట్‌‌లో పెడుతున్నారా ..? మీలోని ఈ సీక్రెట్ శక్తుల గురించి తెలుసుకోండి..

మీ ఫోన్ ఎప్పుడూ సైలెంట్ మోడ్‌లోనే ఉంటుందా? అది మీ బలహీనత కాదు.. మీలోని గొప్ప మానసిక శక్తికి సంకేతం.. ఫోన్ సౌండ్ ఆపేయడం వల్ల మీ మెదడు ఎలా మారిపోతుంది..? మీ ఏకాగ్రత ఎలా పెరుగుతుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. శాస్త్రవేత్తలు చెబుతున్న ఆ ఆసక్తికర నిజాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

మీ ఫోన్‌ను ఎక్కువగా సైలెంట్‌‌లో పెడుతున్నారా ..? మీలోని ఈ సీక్రెట్ శక్తుల గురించి తెలుసుకోండి..
Benefits Of Silent Phone
Krishna S
|

Updated on: Apr 12, 2026 | 2:13 PM

Share

నేటి డిజిటల్ యుగంలో ఫోన్ రింగ్‌టోన్ లేదా నోటిఫికేషన్ సౌండ్ వినబడకుండా ఒక్క నిమిషం కూడా గడవదు. కానీ కొందరు తమ ఫోన్‌ను ఎప్పుడూ సైలెంట్ మోడ్‌లోనే ఉంచుతారు. ఇలా చేయడం కేవలం ఇతరులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే కాదు దాని వెనుక ఒక గొప్ప మానసిక అలర్ట్ దాగి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్యుంగ్ హీ యూనివర్సిటీ, టెక్సాస్ వర్సిటీ పరిశోధకులు జరిపిన అధ్యయనాల్లో వెల్లడైన ఆసక్తికర విశేషాలు ఇప్పుడు నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్నాయి.

సైలెంట్ మోడ్

ఫోన్‌ను సైలెంట్ చేయడం లేదా స్విచ్ ఆఫ్ చేయడం అనేది కేవలం సౌండ్ ఆపడం కాదు, అది మీ మెదడుపై నియంత్రణ సాధించడం. ఒకసారి ఫోన్ మోగితే, మనసు మళ్ళీ పనిపై లీనమవ్వడానికి సగటున 23 నిమిషాల సమయం పడుతుంది. ఫోన్ సైలెంట్‌లో ఉంటే, మెదడు ఎక్కువసేపు ఏకాగ్రతతో పనిచేయగలదని, తక్కువ సమయంలో ప్రాజెక్టులను పూర్తి చేయగలదని పరిశోధనలు చెబుతున్నాయి. నిరంతర నోటిఫికేషన్ల వల్ల శరీరంలో కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి. రింగ్‌టోన్‌ను ఆఫ్ చేయడం వల్ల నాడీ వ్యవస్థ ప్రశాంతంగా ఉండి, హృదయ స్పందన రేటు స్థిరంగా ఉంటుంది.

మొబైల్ మైండ్‌ఫుల్‌నెస్

మొబైల్ మైండ్‌ఫుల్‌నెస్ ట్రైనింగ్ ద్వారా ఆఫీసు ఉద్యోగులపై జరిపిన పరిశోధనలో దిగ్భ్రాంతికర ఫలితాలు వచ్చాయి.

వ్యక్తిగత హద్దులు: ఫోన్ సైలెంట్‌లో ఉంచే వారు తమ సమయానికి విలువ ఇస్తారు. వీరు తక్షణమే స్పందించాలనే ఒత్తిడికి లోనవ్వరు. ఇది ఇతరులకు ఒక సంకేతాన్ని పంపిస్తుంది. ‘‘నేను అందుబాటులో ఉన్నాను, కానీ నా షెడ్యూల్ ప్రకారం మాత్రమే’’ అనే సిగ్నల్ ఇచ్చినట్లు అవుతుంది.

నిద్ర నాణ్యత: అర్ధరాత్రి వచ్చే మెసేజ్ శబ్దాలు లేకపోవడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. ఇది మరుసటి రోజు పనితీరుపై సానుకూల ప్రభావం చూపుతుంది.

లోతైన సంబంధాలు: వీరు ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఫోన్ వైపు చూడకుండా మాటల్లో పూర్తిగా నిమగ్నమవుతారు. అందుకే వీరిని సమాజంలో మంచి శ్రోతలుగా గుర్తిస్తారు.

పరిశోధకులు ఏమంటున్నారు?

టెక్సాస్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ఏడ్రియన్ వార్డ్ ప్రకారం.. స్మార్ట్‌ఫోన్ మీ పక్కన సైలెంట్‌గా ఉన్నా సరే, అది మీ మనసును కొంతవరకు ఆకర్షిస్తూనే ఉంటుంది. అందుకే ఏకాగ్రత పెరగాలంటే ఫోన్‌ను కంటికి కనిపించకుండా దాచిపెట్టడం లేదా నోటిఫికేషన్ ప్రివ్యూలను ఆఫ్ చేయడం ఉత్తమ మార్గం.

నిశబ్దమే మీ ఆయుధం

ఫోన్‌ను సైలెంట్‌లో పెట్టడం అంటే ప్రపంచానికి దూరంగా ఉండటం కాదు, మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం. ఫోకస్ అనేది చాలా విలువైనది, దానిని సోషల్ మీడియా నోటిఫికేషన్ల కోసం వృథా చేయకుండా ఉద్దేశపూర్వకమైన పనుల కోసం కేటాయించినప్పుడే మీరు మానసిక శక్తివంతులుగా మారుతారు.

Follow Us