Kitchen Hacks: పెనంపై జిడ్డు వదలడం లేదా? ఈ సింపుల్ టిప్స్ పాటించండి..

|

Jul 28, 2023 | 1:20 PM

అయితే రెగ్యూలర్ దానిని వినియోగిస్తూ ఉంటే దానిని క్లీనింగ్ విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. లేకుంటే దానిపై జిడ్డు పేరుకుపోయి అనారోగ్యాలను కలిగించవచ్చు. పెనంపై జిడ్డు వదిలించేందుకు కొన్ని టిప్స్ మీకోసం అందిస్తున్నాం..

Kitchen Hacks: పెనంపై జిడ్డు వదలడం లేదా? ఈ సింపుల్ టిప్స్ పాటించండి..
Iron Tawa1
Follow us on

ఇటీవల కాలంలో నాన్ స్టిక్ కుక్ వేర్ కు జనాలు బాగా అలవాటు పడుతున్నారు. ఇంట్లో వంట సామగ్రిలో చాలా వరకూ నాన్ స్టిక్ వస్తువులే కనిపస్తుంటాయి. అయితే వాటికన్న పాత కాలపు పాత్రలతో నే ఆరోగ్యమని చాలా మంది నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పెనం. మనం దోశలు, అమ్లెట్లు, చపాతీలు, పరోటాలు వేసుకోడానికి వినియోగించే ఈ పెనం కూడా నాన్ స్టిక్ లో అందుబాటులో ఉన్నాయి. అయితే దీని విషయంలో చాలా వరకూ ఇనుప పెనాన్నే చాలా మంది వాడుతున్నారు. ఎందుకంటే నాన్ స్టిక్ లో అట్లు సరిగా రావు అనేది చాలా మంది చెబుతుంటారు. పైగా ఆరోగ్యానికి ఇనుప పెనమే మంచిదని నిపుణులు చెబుతున్న నేపథ్యంలో అట్ల పెనం వరకూ అందరూ ఇనుపదే వాడుతున్నారు. అయితే రెగ్యూలర్ దానిని వినియోగిస్తూ ఉంటే దానిని క్లీనింగ్ విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. లేకుంటే దానిపై జిడ్డు పేరుకుపోయి అనారోగ్యాలను కలిగించవచ్చు. పెనంపై జిడ్డు వదిలించేందుకు కొన్ని టిప్స్ మీకోసం అందిస్తున్నాం.. రండి చూద్దాం..

సబ్బు, గోరువెచ్చని నీళ్లతో..

  • పెనాన్ని గోరువెచ్చని నీటితో కడగాలి. ఇది ఆహార కణాలను విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది.
  • పెనం పైన కొన్ని చుక్కల లక్విడ్ డిష్ సబ్బును వేయాలి.
  • స్పాంజిని ఉపయోగించి, తవాను సున్నితంగా స్క్రబ్ చేయాలి.
  • వెచ్చని నీటితో మళ్ళీ శుభ్రం చేయాలి.
  • మెత్తని గుడ్డను ఉపయోగించి పై నీటిని తుడిచి, ఆరబెట్టండి.

ఉప్పు, నిమ్మకాయ స్క్రబ్..

  • నిమ్మకాయను సగానికి కట్ చేసి ఉప్పులో ముంచండి.
  • ఈ నిమ్మ మరియు ఉప్పు స్క్రబ్‌తో తవాను రుద్దాలి.
  • ఈ మిశ్రమాన్ని తవా మీద కొన్ని నిమిషాలు ఉంచాలి.
  • తర్వాత, స్క్రబ్బర్‌తో తవాను మళ్లీ రుద్దాలి.
  • గోరువెచ్చని నీటితో కడిగి వంటగది వస్త్రంతో ఆరబెట్టండి.

నీరు, వెనిగర్..

ఒక గిన్నెలో, నీరు, వెనిగర్ సమాన భాగాలుగా జోడించండి. ఒక స్పాంజితో దానిని పెనంపై అప్లై చేయండి. కొంత పేపు దానిని అలా వదిలేయండి. ఆ తర్వాత వెచ్చని నీటితో శుభ్రం చేయండి.

ఇనుప పెనం ఆరోగ్యదాయకం..

వాస్తవానికి నాన్ స్టిక్ తో పోల్చితే, ఇనుప పెనం చాలా ఆరోగ్యదాయకమని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే నాన్ స్టిక్ పాన్ తయారీ సమయంలో కొన్ని రసాయనాలను ఉపయోగిస్తారు. టెఫ్లాన్, నాన్ స్టిక్ పెనాలలో టాక్సిక్ లక్షణాలు కలిగి ఉంటాయి. ఈ రసాయనాలు వేడి చేసినప్పుడు ఆరోగ్యానికి హానికరమైన పదార్థాలను విడుదల చేస్తాయి. అది మనం తినే ఆహారంలో కలుస్తాయి. హార్మోన్స్ సమతుల్యతకు కారణం అవుతాయి. అదే సమయంలో ఇనుప పెనంపై వేసే ఆహారంలో ఇనుము చేరుతుంది. ఇది ఆరోగ్యానికి మంచి చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. శరీరానికి కావల్సినంత ఐరన్ అందుతుందని, ఇమ్యూనిటీ పెరిగేలా చేస్తుందని వివరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..