Health Tips: భార్యాభర్తలు శృంగారం తర్వాత ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు!

|

Aug 25, 2024 | 4:28 PM

ప్రేమ, సంభోగం ఒక జంటలో వర్ణించలేని భావాలు. స్త్రీపురుషుల మధ్య సంబంధాన్ని బలోపేతం చేయడంలో ఇది చాలా ముఖ్యమైనది. ప్రేమ ఇద్దరినీ మానసికంగా కనెక్ట్ చేస్తే వారిద్దరి కలయిక శారీరకంగా కనెక్ట్ అవుతుంది. అలాంటి పవిత్రమైన సంభోగం సమయంలో, తర్వాత జంట కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఇది కాకపోతే జీవితాంతం ఇద్దరూ బాధపడాల్సిన పరిస్థితి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు..

Health Tips: భార్యాభర్తలు శృంగారం తర్వాత ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు!
Health Tips
Follow us on

ప్రేమ, సంభోగం ఒక జంటలో వర్ణించలేని భావాలు. స్త్రీపురుషుల మధ్య సంబంధాన్ని బలోపేతం చేయడంలో ఇది చాలా ముఖ్యమైనది. ప్రేమ ఇద్దరినీ మానసికంగా కనెక్ట్ చేస్తే వారిద్దరి కలయిక శారీరకంగా కనెక్ట్ అవుతుంది. అలాంటి పవిత్రమైన సంభోగం సమయంలో, తర్వాత జంట కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఇది కాకపోతే జీవితాంతం ఇద్దరూ బాధపడాల్సిన పరిస్థితి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. వారిద్దరి సంభోగం తర్వాత కొన్ని పనులు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. మనలో చాలా మంది జంటలకు సంభోగం తర్వాత తీసుకోవాల్సిన కొన్ని విషయాల గురించి తెలియదు. దీని కారణంగా, సంభోగం తర్వాత వెంటనే చేసే కొన్ని పొరపాట్లు స్త్రీలకు సమస్యలను కలిగిస్తాయి. అలాగే త్వరగా గర్భం దాల్చాలనుకునే వారు కొన్ని చిట్కాలు పాటించాలంటున్నారు నిపుణులు. ఈ సందర్భంలో భార్యాభర్తలిద్దరి సంభోగం ఏమి చేయాలి? ఏం చేయకూడదో నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం తెలుసుకుందాం.

మూత్రవిసర్జన:

సంభోగం తర్వాత వెంటనే మూత్ర విసర్జన చేయవద్దు. ఇన్ఫెక్షన్ భయం ఉంటే కాటన్ తో శుభ్రం చేయడం మంచిది. కనీసం 15 నుంచి 20 నిమిషాల తర్వాత మూత్ర విసర్జన చేయాలి. అలాగే, చాలా మంది మహిళలు కలుసుకున్న తర్వాత మూత్ర విసర్జనకు దూరంగా ఉంటారు. ఇలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది.

సబ్బును ఉపయోగించడం:

సంభోగం తర్వాత జననేంద్రియ ప్రాంతాన్ని సబ్బుతో కడగవద్దు. స్త్రీలు ఇలా చేయడం వల్ల జననేంద్రియ ప్రాంతంలో వాపు, పొడిబారడం వంటి సమస్యలు వస్తాయి. అలాగే కొంతమంది కలయికలో పాల్గొన్న వెంటనే బాత్రూమ్‌కి వెళ్లి శుభ్రం చేసుకుంటారు. అయితే ఇది మంచిది కాదు. వీలైతే సంభోగం తర్వాత 30 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోండి.

స్నానం:

సంభోగం జరిగిన వెంటనే స్నానం చేయడం కూడా మంచిది కాదంటున్నారు నిపుణులు. కొంతమంది తర్వాత వేడి నీటిని ఉపయోగిస్తారు. ఇది కూడా తప్పు. ఎందుకంటే సాధారణంగా సంభోగం తర్వాత స్త్రీ ప్రైవేట్‌ భాగంలో కండరాలు తెరుచుకుని రిలాక్స్ అవుతాయి. అందుకే వేడి స్నానాలు ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి.

గట్టి దుస్తులు:

కొంతమంది దంపతులు సంభోగం తర్వాత బిగుతుగా ఉండే బట్టలు వేసుకుంటారు. ఈ సమయంలో బిగుతుగా ఉండే బట్టలు ఎప్పుడూ ధరించకూడదు. అలాంటి దుస్తులు ధరించడం వల్ల ఇన్ఫెక్షన్, దురద వంటి సమస్యలు వస్తాయి. బిగుతుగా ఉండే లోదుస్తులకు దూరంగా ఉండండి. భార్యభర్తలిద్దరు కలుసుకున్న తర్వాత తేలికపాటి కాటన్ దుస్తులను ధరించండి.

చేతులు కడగడం:

సంభోగం సమయంలో స్త్రీ పురుషులిద్దరూ తమ జననాంగాలను తాకడం సహజం. అయితే కలయిక తర్వాత చేతులు కడుక్కోవాలి. లేదంటే చాలా బాక్టీరియా ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.

వెంటనే నిద్రపోకండి:

సంభోగం తర్వాత 30 నిమిషాలు విశ్రాంతి తీసుకోవడం మంచిది. సంభోగం సమయంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. పర్యవసానంగా మీరు విశ్రాంతి తీసుకున్న తర్వాత శరీరంలోని అన్ని భాగాలకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

నీరు:

కలయిక తర్వాత ఒకటి లేదా రెండు గ్లాసుల నీరు తాగాలి. ఇది మీ శరీరానికి చాలా మంచిది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వివిధ సైట్లు, నిపుణులు తెలిపిన అంశాల ఆధారంగా అందిస్తున్నాము. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)