ప్రతి ఒక్కరూ సుదీర్ఘ జీవితాన్ని కోరుకుంటారు. కానీ మనకు తెలియకుండానే మన జీవితకాలాన్ని 5 నుండి 10 సంవత్సరాల వరకు తగ్గించే జీవన శైలిని అనుసరిస్తాం. తాజా అధ్యయనం ప్రకారం.. చాలా మంది ప్రజలు ఎక్కువ కాలం జీవించాలని కోరుకుంటారు. కానీ వారి జీవిత కాలాన్ని ఎలా పొడిగించుకోవాలో తెలియదు. పరిశోధనలో పాల్గొన్న వారిలో 87% మంది ఎక్కువ కాలం జీవించడానికి చర్యలు తీసుకోవాలని, సగం కంటే ఎక్కువ మంది 100 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు (53%) వరకు జీవించాలని కోరుకుంటున్నారని అధ్యయనం పేర్కొంది. అయితే, ప్రతి నలుగురిలో ముగ్గురికి అంటే 74% మందికి ఎక్కువ కాలం జీవించడానికి కారణం తెలియదు. అయితే, తినే ఆహారం, జీవనశైలిలో ఆరోగ్యకరమైన అలవాట్లను చేర్చుకుంటే, సానుకూల దృక్పథంలో ఉంటే.. సుధీర్ఘ జీవితాన్ని గడపవచ్చు. మరి సుదీర్ఘకాలం ఆయురారోగ్యాలతో ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
విటమిన్ డి లోపం అనేది ఒక సాధారణ ప్రపంచ సమస్య. ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్ మంది ప్రజలు విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. వాస్తవానికి.. ఎముకలు, కండరాలు, రోగనిరోధక శక్తిని బలంగా ఉంచడానికి విటమిన్ డి అవసరం. మన శరీరం సహజంగా సూర్యరశ్మిని తాకడం ద్వారా విటమిన్ డిని తయారు చేస్తుంది. కానీ అది లోపించినప్పుడు, ఆహారంలో సాల్మన్, ట్యూనా ఫిష్, పాలు వంటి వాటిని తీసుకోవడం ద్వారా డి విటమిన్ లోపాన్ సెట్ చేసుకోవచ్చు. విటమిన్ డి లోపం జీవితాన్ని తగ్గిస్తుంది. అదే విటమిన్ డి లోపాన్ని అధిగమిస్తే మీ జీవితకాలం పెరుగుతుంది.
హార్వర్డ్ TH పరిశోధకుల నేతృత్వంలోని ఒక అధ్యయనంలో.. సంతోషంగా ఉండటం మరియు ఆశాజనకంగా ఉండటం జీవితకాలాన్ని పెంచడంలో చాలా సహాయపడుతుందని కనుగొన్నారు. జీవితంలో సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండి, ఆశావాద దృక్పథంతో జీవితాన్ని గడిపినట్లయితే, అది ధీర్ఘాయువుకు, వ్యాధులకు దూరంగా ఉండటానికి సహాయపడుతుంది. దీని వల్ల ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
ప్రస్తుత కాలంలో చాలా మంది సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఫలితంగా తక్కువ నిద్ర వస్తుంది. తక్కువ నిద్ర కారణంగా వృద్ధాప్య ప్రక్రియ వేగంగా పెరుగుతుంది. నిద్రలేమి కారణంగా డిప్రెషన్, ఒత్తిడి, కడుపులో, ఛాతిలో మంట ఏర్పడుతుంది. అందుకే వీలైనంత వరకు ఫోన్, టీవీ స్క్రీన్‌కు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి.
తినే ఆహారంలో పుట్టగొడుగులను చేర్చుకుంటే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు సొంతమవుతాయి. ఎక్కువ కాలం జీవించేందుకు ఆస్కారం ఇస్తుంది. పుట్టగొడుగులలో విటమిన్ డి, సెలీనియం, ఎర్గోథియోనిన్, గ్లూటాతియోన్ ఉన్నాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని, ఫ్రీ రాడికల్ నష్టాన్ని వేగంగా నయం చేస్తాయి. ఇందులో అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇది మన శరీరానికి అవసరమైన భాగాలను నయం చేయడంలో, ఆరోగ్యంగా ఉంచడంలో చాలా సహాయపడుతుంది.
నిద్ర లేకపోవడం వల్ల టైప్ 2 మధుమేహం, గుండె జబ్బులు, ఊబకాయం, డిప్రెషన్ వంటి అనేక వ్యాధులు పెరుగే ఛాన్స్ ఉంది. ఇది ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. జీవితకాలాన్ని తగ్గిస్తుంది. నిద్రలేమి మానసిక వ్యాధులను పెంచుతుంది. 7 నుండి 9 గంటల నిద్రపోతే.. వ్యాధుల బారిన పడకుండా ఉండొచ్చు. సంతోషంగా దీర్ఘకాల జీవితాన్ని గడపవచ్చు.
హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..