Teeth Whitening Tips: ప్రతి ఒక్కరి ముఖంలో ముందుగా కనిపించేది మెరిసే దంతాలు.. అందుకే పళ్లు తెల్లగా, అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు..అంతేకాదు.. దంతాలు మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. అటువంటి దంతాలను సరిగ్గా శుభ్రం చేయకపోవడం వల్ల మురికి పొర పేరుకుపోతుంది. క్రమంగా దంతాల రంగు మారటంతో అందరి ముందు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితిలో, మీరు మీ దంతాలను ప్రకాశింపజేయడానికి ఎలాంటి ఖర్చు లేకుండా కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్‌ను అనుసరించవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకోసం కొబ్బరి, ఆవాల నూనె, ఉప్పు, అరటిపండు తొక్క, పసుపు వంటి వంటింటి వస్తువులతోనే మీ దంతాలను శుభ్రం చేయడానికి ఉపయోగించవచ్చు..
మన పళ్ళను తెల్లగా మెరుస్తూ ఉండేలా చేసుకోవటానికి ఆవాల నూనెను ఉపయోగించవచ్చు.. ఇందుకోసం ఆవాల నూనె చిటికెడు ఉప్పు కలిపి తీసుకుని చిగుళ్లపై మసాజ్ చేయడం వల్ల పసుపు రంగు పోతుంది. దంతాలు తెల్ల ఆవాల నూనె ఎంతో సహాయపడుతుంది. అంతేకాకుండా చిగుళ్ల ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే, తెల్లటి దంతాల కోసం ప్రతిరోజూ కొబ్బరి నూనెతో ఆయిల్ పుల్లింగ్ చేయవచ్చు.. ఇలా చేయడం వల్ల దంతాలు తెల్లగా మెరుస్తూ కనిపిస్తాయి. దీంతో దంతాల శుభ్రతతో పాటు నోట్లో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది.
పళ్లను మెరిసేలా చేసేందుకు బేకింగ్ సోడాను కూడా వాడుకోవచ్చు..దంతాలపై మరకలను తొలగించడంలో బేకింగ్ సోడా కూడా ఎంతో మేలు చేస్తుంది. బేకింగ్ సోడా వల్ల దంతాలపై ఉండే మరకలు, పసుపుదనం తొలగిపోయి దంతాలు తెల్లగా మారతాయి.
స్ట్రాబెరీలను ఉపయోగించడం వల్ల మంచి ఫలితం పొందవచ్చు. స్ట్రాబెరీలను పేస్ట్ గా చేసి అందులో బేకింగ్ సోడా కలిపి దంతాలను శుభ్రం చేయడం వల్ల దంతాలు శుభ్రం అవుతాయి. అలాగే, దంతాలను తెల్లగా మార్చడంలో యాక్టివేట్ చేసిన బొగ్గు కూడా ఉపయోగించవచ్చు. బొగ్గుతో దంతాలను బ్రెష్ చేసుకోవటం వల్ల పళ్లపై ఉండే మరకలు తొలగిపోతాయి. పండ్ల తొక్కలను ఉపయోగించడం వల్ల దంతాలపైన ఉండే పసుపు మరకలు తొలగించడంలో ఎంతో సహాయపడుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..