Late Night Eating: లేట్ నైట్ తినే అలవాటా.. వెంటనే మార్చుకోండి.. లేదంటే ఈ 5 వ్యాధులు జీవితాంతం వెంటాడతాయి..

గత కొన్నేళ్ళ క్రితం వరకూ తినడం, నిద్రపోవడం పని చేయడం ఇలా ప్రతి విషయంలోనూ కొన్ని నియమాలున్నాయి. రాత్రి త్వరగా తిని.. త్వరగా నిద్రపోవడం.. తెల్లవారుజామునే నిద్ర లేవడం చేసేవారు. అయితే మారిన కాలంతో పాటు జీవన శైలిలో కూడా అనేక మార్పులు వచ్చాయి. ఇప్పుడు తినడానికి, నిద్రపోవడానికి.. నిద్ర లేవడానికి కూడా సమయం సందర్భం లేదు. ఎప్పుడు బడితే అప్పుడు చేస్తున్నారు. అయితే ఆలస్యంగా తినడం అలవాటు మీకుందా.. ఈ అలవాటు ఎంత ప్రమాదమో ఈ రోజు తెలుసుకుందాం..

Late Night Eating: లేట్ నైట్ తినే అలవాటా.. వెంటనే మార్చుకోండి.. లేదంటే ఈ 5 వ్యాధులు జీవితాంతం వెంటాడతాయి..
Late Night Eating

Updated on: Jun 13, 2025 | 8:31 AM

నేటి మనిషి జీవితం ఉరుకుల పగురులతో సాగుతోంది. కాలంతో పోటీ పడుతూ మనషి జీవిస్తున్న తరుణంలో జీవన శైలిలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. దినచర్యలో కూడా మార్పులు జరుగుతున్నాయి. ఆలస్యంగా నిద్రపోవడం, ఆలస్యంగా తినడం చాలా మందికి అలవాటుగా మారింది. దీనికి కారణం పని భారం లేదా అధిక చదువుల ఒత్తిడి అని అని కూడా చెప్పవచ్చు. మనం ఎటువంటి టైమ్ టేబుల్ లేకుండా వివిధ కారణాల వల్ల తినే అలవాటులో విపరీతమైన మార్పులు వచ్చాయి. భోజనం చేయడానికి సమయం లేకపోతే..రాత్రి భోజనం ఆలస్యంగా తింటున్నారని నిపుణులు అంటున్నారు. అయితే ఇలా ఆలస్యంగా తినడం వలన ఆరోగ్యానికి స్లో పాయిజన్ గా ఆ ఆహారం మారుతుందని మీకు తెలుసా?

ఆలస్యంగా తినడం వల్ల నిద్ర నాణ్యతపై ప్రతికూల ప్రభావం

రాత్రి 8 గంటల తర్వాత తినడం వల్ల శరీరం జీర్ణక్రియ, హార్మోన్ల సమతుల్యత , నిద్ర నాణ్యతపై చెడు ప్రభావం చూపుతుందని నిపుణుల చెబుతున్నారు. సమయానికి ఆహారం తినకపోవడం వలన అనేక వ్యాధులకు కారణమవుతుంది. ఆలస్యంగా తినడం వల్ల కలిగే నష్టాలు.. దానిని నివారించే మార్గాలను తెలుసుకుందాం.

ఆలస్యంగా తినడం వల్ల కలిగే నష్టాలు ఏమిటి?

  1. జీర్ణవ్యవస్థపై ప్రభావాలు: రాత్రి ఆలస్యంగా తినడం వల్ల శరీరంలో జీర్ణ ప్రక్రియ మందగిస్తుంది. భోజనం చేసిన వెంటనే నిద్రపోయినప్పుడు.. ఆహారం సరిగ్గా జీర్ణం కాదు, దీనివల్ల గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి.
  2. బరువు పెరగడం ఖాయం: రాత్రి ఆలస్యంగా భోజనం చేసినప్పుడు శరీరం ఆ ఆహారాన్ని జీర్ణం చేయడనికి బదులుగా కొవ్వుగా నిల్వ చేయడం ప్రారంభిస్తుంది. ఇది వేగంగా బరువు పెరగడానికి దారితీస్తుంది. ముఖ్యంగా బొడ్డు, నడుము దగ్గర కొవ్వు పెరుగుతుంది.
  3. ఇవి కూడా చదవండి
  4. నిద్ర లేమి సమస్య: రాత్రి సమయంలో అధిక మొత్తంలో ఆహారం తినడం వల్ల శరీరంలో జీర్ణక్రియ ప్రక్రియ కొనసాగుతుంది. ఇది గాఢ నిద్రను నిరోధిస్తుంది. తరచుగా మేల్కొనడం, విశ్రాంతి లేకపోవడం లేదా నిద్రలేమి వంటి సమస్యలు కూడా సంభవించవచ్చు.
  5. మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదం: ఆలస్యంగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అసమతుల్యత చెందుతుందని , ఇన్సులిన్ ప్రభావం తగ్గుతుందని, టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
  6. యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంట: రాత్రి ఆలస్యంగా భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం వలన కడుపులో ఆమ్లం పెరుగుతుంది. ఇది గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్‌కు దారితీస్తుంది.

మంచి ఆరోగ్యం కోసం ఏమి చేయాలంటే

  1. రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య భోజనం చేయండి.
  2. తిన్న తర్వాత కనీసం 2 గంటల వరకూ నిద్రపోవద్దు. అంటే తిన్న ఆహారానికి.. నిద్రకు మధ్య రెండు గంటల గ్యాప్ ఉండేలా చూసుకోండి.
  3. రాత్రి సమయంలో కిచిడి, గంజి లేదా కూరగాయల సూప్ వంటి తేలికైన , సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తినండి.
  4. రాత్రి కెఫిన్ , చక్కెర కలిగిన ఆహారాలకు దూరంగా ఉండండి.
  5. దినచర్యలో యోగా, నడక, వ్యాయామం చేర్చుకోండి.
  6. రాత్రి భోజనం తర్వాత 10-15 నిమిషాలు నడవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

 

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)