ప్రస్తుతం దాదాపు అందరు నాన్ స్టిక్ పెనం వాడుతున్నారు. ముఖ్యంగా దోశను నాన్ స్టిక్ పెనంపై వేస్తుంటారు. ఎందుకంటే దీనికి పిండి అట్టుకోదు దోశ బాగా వస్తుంది. అందుకే చాలా మంది ఇనుప పెనాన్ని పక్కన పడేసి నాన్‌స్టిక్ పెనం తెచ్చుకుంటున్నారు. కానీ నాన్ స్టిక్ ప్యాన్ వాడడం వల్ల సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
నాన్ స్టిక్ ప్యాన్‌పై పిండి వేసిన తర్వాత అంటుకోకుండా దోశ రావడానికి ముఖ్య కారణం ఆ ఆ పెనం మీద ఉండే కోటింగ్. ఆ కోటింగ్ టెఫ్లాన్‌తో వేస్తారు. టెఫ్లాన్ అనేది ఒక రసాయన పదార్థం. ఇలా కెమికల్స్ తో తయారైన నాన్ స్టిక్ ప్యాన్ వాడడం వల్ల కిడ్నీ సమస్యలు, కాలేయ సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు వివరిస్తున్నారు. ప్యాన్ వేడి చేయడం వల్ల టెఫ్లాన్ కరిగి ఆహారంలో కలుస్తుంది. దాని వల్ల కెమికల్ మనిషి శరీరంలోకి వెళ్తుంది. అదే ఇనుప పెనం మీద అయితే ఎటువంటి కెమికల్స్ ఉండవు. కాబట్టి ఇనుప పెనం మీద చేసిన ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.
గమనిక :– అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.
Read Also.. Polished rice: పాలిష్ చేసిన రైస్ 3 పూటలా తింటున్నారా..? అయితే మీకు ముప్పు తప్పదు