Tamarind Seeds : మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా.. చింతగింజలతో ఇలా చేస్తే ఎంతో ఉపశమనం

|

Jun 22, 2021 | 2:46 PM

Tamarind Seeds : చింత చెట్టుని 'భారతదేశపు ఖర్జూరం' అంటారు. ఈ చెట్టు ఉత్పత్తి చేసే కాయలు, పండ్లు తినటానికి ఉపయోగ పడతాయి. చింత పండుని ప్రపంచవ్యాప్తంగా...

Tamarind Seeds :  మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారా.. చింతగింజలతో ఇలా చేస్తే ఎంతో ఉపశమనం
Tamarind Seeds
Follow us on

Tamarind Seeds : చింత చెట్టుని ‘భారతదేశపు ఖర్జూరం’ అంటారు. ఈ చెట్టు ఉత్పత్తి చేసే కాయలు, పండ్లు తినటానికి ఉపయోగ పడతాయి. చింత పండుని ప్రపంచవ్యాప్తంగా వంటకాల్లో విరివిగా ఉపయోగిస్తారు. అయితే ఈ చింతపండును తీసే సమయంలో చింత గింజలు వస్తాయి. అయితే ఆ చింత గింజలను పడేసేవారు చాలామంది ఉన్నారు. కొంతమంది వాటిని నిల్వచేసి.. మార్కెట్ లో వ్యాపారులకు అమ్ముతారు. అయితే చింతగింజలు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. ఇక నుంచి ఎప్పుడూ వాటిని పడెయ్యారు. చింతగింజల్లో ఎన్నో ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. మ‌రి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

కీళ్ల నొప్పులతో బాధపడేవారికి చింతగింజలు దివ్య ఔషధం. ముందుగా కొన్ని చింత గింజ‌ల‌ను తీసుకుని వాటిని బాగా వేయించాలి. అనంత‌రం 2 రోజుల పాటు వాటిని నీటిలో నాన‌బెట్టాలి. రోజుకు రెండు సార్లు నీటిని మార్చాలి. 2 రోజుల త‌రువాత చింత గింజ‌ల‌ను తీసి వాటి పొట్టును వేరు చేయాలి. అనంత‌రం వ‌చ్చే విత్త‌నాల‌ను చిన్న చిన్న ముక్క‌లుగా చేసి నీడ‌లో ఎండ‌బెట్టాలి. అలా ఎండిన ముక్క‌ల‌ను తీసుకుని మిక్సీలో వేసి పొడిగా ప‌ట్టాలి. ఆ పొడిని జార్‌లో నిల్వ చేసుకోవాలి. దీన్ని అర టీస్పూన్ మోతాదులో తీసుకుని రోజుకు రెండు సార్లు నీటితో లేదా పాల‌తో నెయ్యి లేదా చ‌క్కెర‌ను క‌లిపి తీసుకోవాలి.

ఇలా చేయడం వలన మోకాళ్ల నొప్పుల నుంచి వెంట‌నే ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అంతేకాదు 3-4 వారాల్లో స‌మ‌స్య పూర్తిగా తగ్గుముఖం ప‌డుతుంది. చింత గింజ‌ల్లో ఉండే ఔష‌ధ పదార్థాలు ఎముక‌ల‌కు బ‌లాన్నిస్తాయి. అదేవిధంగా కీళ్ల‌లో అరిగిపోయిన గుజ్జును మ‌ళ్లీ ఉత్పత్తి చేస్తాయి. దీంతో కీళ్ల నొప్పుల నుంచి శాశ్వ‌తంగా విముక్తి ల‌భిస్తుంది.

ఈ చింతగింజల పొడి కేవ‌లం కీళ్ల నొప్పులే కాదు డ‌యేరియా, చ‌ర్మంపై దుర‌ద‌లు, దంత సంబంధ స‌మ‌స్య‌లు, అజీర్ణంవంటి అనేక రోగాలను నయం చేస్తుంది.

ద‌గ్గు, గొంతు ఇన్‌ఫెక్ష‌న్లు, డ‌యాబెటిస్‌, గుండె సంబంధ వ్యాధులకు చ‌క్క‌ని ఔష‌ధంగా కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది.

ఇక ఎముక‌లు వీరిని ప్ర‌దేశంపై రోజూ చింత‌గింజ‌ల పొడిని పేస్ట్‌లా చేసి అప్లై చేస్తే దాంతో ఎముక‌లు త్వ‌ర‌గా అతుక్కుంటాయి.

ఇక చింతపిక్కలు: బిస్కట్ ల తయారీలో ఉపయోగిస్తారు. చింత గింజలపై పొట్టు తీసి యంత్రాల ద్వారా మెత్తటి పొడిగా తయారు చేస్తారు. దానిని బిస్కెట్ వంటి వాటిల్లో, ఇతర ఆహార పదార్థాలలో వాడుతారు.

చింతగింజలను ఎక్కువగా జిగురు తయారు చేయడానికి దీనిని వాడుతారు. గతంలో సినిమా పోష్టర్లు అంటించ డానికి ఈ పిండితో చేసిన జిగురునే ఎక్కువ వాడేవారు.

Also Read: కిడ్నీ స్టోన్స్ ను కరిగించే కొండపిండాకు పప్పు కూర తయారీ విధానం