Lifestyle: వీటిని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తాగండి.. ఊహకందని లాభాలు

|

Oct 05, 2024 | 4:21 PM

ఎండు ద్రాక్షలో ఉండే మూలకాలు బరువును తగ్గించడంలో ఉపయోగపతాయి. కొన్ని ఎండు ద్రాక్షలను తీసుకొని రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయాన్నే పడగడుపున ఆ నీటిని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా నల్ల ద్రాక్షలు అయితే మరింత మేలు జరుగుతుందని అంటున్నారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో...

Lifestyle: వీటిని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తాగండి.. ఊహకందని లాభాలు
Raisins Soaked Water
Follow us on

డ్రై ఫ్రూట్స్‌ ఆరోగ్యానికి ఎంతలా మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే వైద్యులు సైతం ప్రతీ రోజూ కచ్చితంగా డ్రై ఫ్రూట్స్‌ను తీసుకోవాలని సూచిస్తుంటారు. డ్రై ఫ్రూట్స్‌లో ఉండే ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యాన్ని కాపాడుతాయి. డ్రై ఫ్రూట్స్‌లో ఎండు ద్రాక్ష కూడా ఒకటి. సాధారణంగా కిస్మిస్‌లుగా చెప్పుకునే ఎండుద్రాక్షను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. అయితే ఎండు ద్రాక్ష నీటిని తీసుకున్నా లాభాలు ఉంటాయని అంటున్నారు.

ఎండు ద్రాక్షలో ఉండే మూలకాలు బరువును తగ్గించడంలో ఉపయోగపతాయి. కొన్ని ఎండు ద్రాక్షలను తీసుకొని రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయాన్నే పడగడుపున ఆ నీటిని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా నల్ల ద్రాక్షలు అయితే మరింత మేలు జరుగుతుందని అంటున్నారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగాలి. ఆ తర్వాత ఎండు ద్రాక్షలను తినేయాలి. ఇలా ఒక నెల రోజుల పాటు తీసుకుంటే శరీరంలో జరిగే మార్పులు మీ ఊహకు కూడా అందవని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

బరువు తగ్గాలనుకునే వారు ప్రతీ రోజూ ఈ నీరు తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఇందులోని ఫైబర్‌తో పాటు మరిన్ని మంచి గుణాలు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. అలాగే పొట్ట సంబంధిత సమస్యలను దూరం చేయడంలో తోడ్పడుతాయి. పొట్ట ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలన్నీ దూరమవుతాయి.

ఎండుద్రాక్షలను నానబెట్టిని నీటిని తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. అలాగే గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా ఉపయోగపడతాయి. వీటిలో ఉంటే ఫైబర్‌, మెగ్నీషియం కంటెంట్ గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. ఎండుద్రాక్ష నీటిని తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్రతీ రోజూ ఈ నీటిని తాగితే జలువు, దగ్గు వంటి సమస్యల బారిన పడడం తగ్గుతుంది. ఇక ఎండు ద్రాక్ష నానబెట్టిన నీటిలో.. కాల్షియం, ఐరన్, ఫైబర్, పొటాషియంతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని సంరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..