AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాలుక బద్దతో బరాబరా గీరుతున్నారా.. ఈ విషయం తెలుసుకోండి..

అతిగా నాలుకను శుభ్రం చేయడం వల్ల రుచి గ్రంధులు దెబ్బతిని రుచిని కోల్పోవచ్చని ENT నిపుణులు హెచ్చరిస్తున్నారు. నాలుకపై ఉండే ఫిలిఫామ్ పాపిల్లే దెబ్బతినకుండా, కేవలం నాలుక ముందు భాగాన్ని సున్నితంగా శుభ్రం చేసుకోవాలని, లేదా నాలుక సహజంగానే శుభ్రం చేసుకుంటుందని సూచిస్తున్నారు.

నాలుక బద్దతో బరాబరా గీరుతున్నారా.. ఈ విషయం తెలుసుకోండి..
Tongue Cleaning Dangers
Ram Naramaneni
|

Updated on: Apr 20, 2026 | 1:53 PM

Share

నోటి పరిశుభ్రతలో నాలుకను శుభ్రం చేసుకోవడం ఒక భాగం. అయితే, టంగ్ క్లీనర్ లేదా నాలుక బద్దలతో నాలుకను అతిగా, గట్టిగా రుద్దడం వల్ల అనర్థాలు కలుగుతాయని  ENT నిపుణులు హెచ్చరిస్తున్నారు. నాలుక అనేది నోటిలో స్వేచ్ఛగా కదిలే అవయవం. దీనిపై ఫిలిఫామ్, ఫంగీఫామ్, ఫోలియేట్, సర్కంవాలేట్ అనే నాలుగు రకాల రుచి గ్రంధులు ఉంటాయి. వీటిలో దారాల్లా ఉండే ఫిలిఫామ్ పాపిల్లే అత్యధికంగా ఉంటాయి. ఈ ఫిలిఫామ్ పాపిల్లేలను గట్టిగా రుద్దడం వల్ల వాటి ఉపరితలం దెబ్బతింటుంది. దీనివల్ల రుచిని కోల్పోవడమే కాకుండా, ఉష్ణోగ్రతను గ్రహించే సామర్థ్యం కూడా తగ్గుతుంది. రుచి గ్రంధులు దెబ్బతినడం వలన రుచిలో మార్పులు వస్తూ ఉంటాయి.

కాబట్టి, నాలుకను శుభ్రం చేయాల్సిన అవసరం అనిపిస్తే, నాలుక ముందు మూడో వంతు భాగాన్ని మాత్రమే టంగ్ క్లీనర్‌తో అత్యంత సున్నితంగా శుభ్రం చేసుకోవాలి. వెనుక భాగం వరకు పెట్టి గీకడం పూర్తిగా చేయకూడదు. వాస్తవానికి, నాలుక దానికదే శుభ్రం చేసుకుంటుంది కాబట్టి, టంగ్ క్లీనర్ వాడకం అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు. నోటి ఆరోగ్యం, రుచి అనుభూతిని కాపాడుకోవడానికి నాలుక పట్ల సున్నితంగా వ్యవహరించడం ముఖ్యం.

Follow Us