Hair Oiling: స్నానం తర్వాత లేదా స్నానం ముందా? జుట్టుకు ఎప్పుడు నూనె రాయాలి? తెలుసుకోండి..

|

Jul 28, 2024 | 5:53 PM

ఎక్కువ మంది తలస్నానం చేసిన తర్వాత జుట్టు జిడ్డుగా ఉండకుండా ఉండేందుకు.. తలస్నానం చేసే ముందు నూనె రాసుకుంటారు. అయితే జుట్టుకు ఆయిల్ అప్లై చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అయితే నూనె రాయడానికి సరైన విధానాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. జుట్టుకు నూనెను సరిగ్గా అప్లై చేయక పొతే జుట్టు బలహీనంగా, నిర్జీవంగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో జుట్టుకు ఏ సమయంలో నూనె రాయాలో తెలుసుకుందాం..

Hair Oiling: స్నానం తర్వాత లేదా స్నానం ముందా? జుట్టుకు ఎప్పుడు నూనె రాయాలి? తెలుసుకోండి..
Hair Oiling
Follow us on

జుట్టు ఆరోగ్యంగా, దృఢంగా ఉండాలంటే నూనె రాయడం అవసరం. జుట్టుకు నూనె రాయడం వల్ల స్కాల్ప్ పొడిబారదు. జుట్టు నిర్జీవంగా మారదు. కొంతమంది జుట్టుకు షాంపూ పెట్టే ముందు నూనె అప్లై చేస్తారు మరికొందరు షాంపు చేసిన తర్వాత నూనె రాసుకుంటారు. అయితే ఎక్కువ మంది తలస్నానం చేసిన తర్వాత జుట్టు జిడ్డుగా ఉండకుండా ఉండేందుకు.. తలస్నానం చేసే ముందు నూనె రాసుకుంటారు.

అయితే జుట్టుకు ఆయిల్ అప్లై చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అయితే నూనె రాయడానికి సరైన విధానాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. జుట్టుకు నూనెను సరిగ్గా అప్లై చేయక పొతే జుట్టు బలహీనంగా, నిర్జీవంగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో జుట్టుకు ఏ సమయంలో నూనె రాయాలో తెలుసుకుందాం..

ఏ సమయంలో నూనె రాయాలంటే

ఇవి కూడా చదవండి

జుట్టుకు నూనె రాసుకోవాలంటే తలస్నానానికి ముందు అప్లై చేయండి. తల అంటుకునే ముందు అంటే కనీసం 1 గంట ముందు నూనె రాయాలని నిపుణులు అంటున్నారు. దీని తర్వాత తల స్నానం చేయడం వలన అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇది జుట్టు రాలడం, నిర్జీవమైన జుట్టు సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

జుట్టు కోసం ప్రోటీన్

జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రొటీన్లు చాలా ముఖ్యం. షాంపూ చేయడానికి ముందు కొబ్బరి నూనెను అప్లై చేయడం వల్ల రక్షణ పొర ఏర్పడుతుందని చాలా పరిశోధనలు చెబుతున్నాయి. ఇవి ప్రోటీన్ లోపాన్ని తొలగిస్తాయి. జుట్టులో ప్రోటీన్ లేకపోవడం వల్ల జుట్టు బలహీనంగా మారుతుంది.

పొడవుగా ధృడంగా జుట్టు

షాంపూ చేయడానికి 1 గంట ముందు జుట్టుకు నూనె రాయడం వలన ఊడిపోతున్న జుట్టు మళ్ళీ పెరుగుతుంది. జుట్టుకు నూనె రాయడం వలన తలపై రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. దీని వల్ల జుట్టు కుదుళ్లు చురుగ్గా మారి జుట్టు పొడవుగా పెరుగుతుంది.

జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది

జుట్టుకు నూనె రాయడం వల్ల జుట్టు బలంగా మారుతుంది. స్కాల్ప్ బ్లడ్ సర్క్యులేషన్ మెరుగ్గా ఉండటం వల్ల వెంట్రుకల మూలాలకు ఆక్సిజన్, రక్తం బాగా సరఫరా అవుతుంది. ఇది జుట్టుకు సరైన పోషకాహారాన్ని అందించడంతో పాటు జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.

 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)