కేవలం ప్రోటీన్ లోపం వల్లనే జుట్టు రాలుతుందా?

మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, కాలుష్యం, నిద్రలేమి వంటి కారణాలతో పాటు సరైన పోషకాహారం తీసుకోకపోవడం కూడా జుట్టు ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా శరీరంలో ప్రోటీన్ లోపం ఉంటే జుట్టు పెరుగుదల తగ్గి, జుట్టు బలహీనంగా మారే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..

కేవలం ప్రోటీన్ లోపం వల్లనే జుట్టు రాలుతుందా?
Hair Loss Problem Increasing Among Youth

Updated on: Aug 07, 2026 | 9:37 PM

ఇటీవల కాలంలో యువతలోనూ జుట్టు రాలడం సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, కాలుష్యం, నిద్రలేమి వంటి కారణాలతో పాటు సరైన పోషకాహారం తీసుకోకపోవడం కూడా జుట్టు ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా శరీరంలో ప్రోటీన్ లోపం ఉంటే జుట్టు పెరుగుదల తగ్గి, జుట్టు బలహీనంగా మారే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే జుట్టు రాలడానికి ప్రతిసారీ ప్రోటీన్ లోపమే కారణం కాదు. జుట్టు రాలడానికి అనేక ఇతర కారణాలు కూడా ఉండవచ్చు. కాబట్టి సమస్య ఎక్కువ కాలం కొనసాగితే వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. మన జుట్టు ప్రధానంగా కెరాటిన్ (Keratin) అనే ప్రోటీన్‌తో తయారవుతుంది. శరీరానికి తగినంత ప్రోటీన్ అందకపోతే, శరీరం ముందుగా గుండె, మెదడు, కాలేయం వంటి ముఖ్యమైన అవయవాలకు పోషకాలను అందిస్తుంది. దీంతో జుట్టు పెరుగుదలకు అవసరమైన పోషకాలు తగ్గి, జుట్టు రాలడం ప్రారంభమవుతుంది.

ప్రోటీన్ లోపం వల్ల జుట్టు రాలుతుందా?

ఆరోగ్య నిపుణుల ప్రకారం, దీర్ఘకాలంగా శరీరంలో ప్రోటీన్ లోపం ఉంటే జుట్టు పెరుగుదల మందగించవచ్చు. అయితే ప్రతి ఒక్కరిలోనూ ప్రోటీన్ లోపం వల్లే జుట్టు రాలుతుందని చెప్పలేం. జుట్టు రాలడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి.అధిక ఒత్తిడి, హార్మోన్లలో మార్పులు, థైరాయిడ్ సమస్యలు, ఇనుము లోపం, విటమిన్ డి, బి12 లోపం, కొన్ని మందుల దుష్ప్రభావాలు, జన్యుపరమైన సమస్యలు, ఆటో ఇమ్యూన్ వ్యాధులు వంటి వాటి వల్ల కూడా జుట్టు రాలుతుంది. అందువల్ల జుట్టు రాలడం ఎక్కువగా ఉంటే సొంతంగా మందులు వాడకుండా వైద్యులను సంప్రదించడం అవసరం. శరీరంలో ప్రోటీన్ స్థాయి తగ్గినప్పుడు ఈ కింది లక్షణాలు కనిపిస్తాయి. అవేంటంటే..

ఇవి కూడా చదవండి
  • తరచుగా జుట్టు రాలడం
  • కండరాల బలహీనత
  • త్వరగా అలసిపోవడం
  • గాయాలు నెమ్మదిగా మానడం
  • శరీరంలో వాపు రావడం
  • తరచూ ఇన్ఫెక్షన్లు రావడం
  • గోళ్లు బలహీనపడటం
  • పొడి చర్మం

ప్రోటీన్ పెంచుకోవడానికి తీసుకోవాల్సిన ఆహారాలు

రోజువారీ ఆహారంలో ప్రోటీన్ అధికంగా ఉండే పదార్థాలను చేర్చుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలను అందించవచ్చు. ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలు ఏవంటే.. పప్పుధాన్యాలు, రాజ్మా, శనగలు, సోయా ముక్కలు, పాలు, పెరుగు, పనీర్, గుడ్లు, చేపలు, కోడి మాంసం, బాదం, వాల్‌నట్స్, గుమ్మడికాయ గింజలు, చియా గింజలు వంటి ఇతర అహారాల్లో దండిగా ప్రోటీన్‌ ఉంటుంది. అయితే కొన్ని వారాలుగా నిరంతరంగా జుట్టు రాలడం, తలపై ఖాళీ ప్రదేశాలు కనిపించడం, అకస్మాత్తుగా ఎక్కువ మొత్తంలో జుట్టు రాలిపోవడం, తీవ్రమైన అలసట, కారణం లేకుండా బరువు తగ్గడం, కండరాల బలహీనత, థైరాయిడ్ లేదా ఇతర ఆరోగ్య సమస్యల లక్షణాలు కనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే తప్పకుండా వైద్యుల సలహా తీసుకోవాలి. జుట్టు రాలడానికి అసలు కారణాన్ని తెలుసుకునేందుకు వైద్యులు అవసరమైతే రక్త పరీక్షలు వంటి పరీక్షలు సూచించవచ్చు. సరైన కారణాన్ని గుర్తించి చికిత్స తీసుకుంటే జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us