Hair Care Tips: తెల్ల జుట్టు అని ‘చింత’ ఎందుకు.. పెరట్లోనే ఉందిగా అద్భుతం.. ఇలా చేస్తే ఆ సమస్యే ఉండదిక..

సహజమైన హెయిర్ కలరింగ్ ఏజెంట్లు చింతపండు ఆకులలో కనిపిస్తాయి. కొన్ని వారాల పాటు దీన్ని ఉపయోగించడం వల్ల తెల్ల జుట్టు తిరిగి నల్లగా మారడమే కాకుండా జుట్టు రాలడం, పొడి జుట్టు, బలహీనమైన జుట్టు మొదలైన వాటి నుండి ఉపశమనం లభిస్తుంది.

Hair Care Tips: తెల్ల జుట్టు అని చింత ఎందుకు.. పెరట్లోనే ఉందిగా అద్భుతం.. ఇలా చేస్తే ఆ సమస్యే ఉండదిక..
Tamarind Leaves

Updated on: Feb 16, 2023 | 10:56 AM

చిన్న వయసులోనే తలపై తెల్ల జుట్టు రావడం అనేది ఈ రోజుల్లో యువత ఎదుర్కొంటున్న సాధారణ సమస్య. నెరిసిన జుట్టుకు పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రజలు చాలా కష్టపడతారు. కానీ, ఆశించిన ప్రభావం మాత్రం కనిపించడం లేదు. మరికొందరు సులువైన మార్గాన్ని ఎంచుకుని రసాయనాలతో జుట్టుకు రంగులు వేసుకుంటున్నారు. ఇందుకోసం మార్కెట్లో వివిధ రంగులు అందుబాటులోకి వచ్చాయి. అయితే, వాటన్నింటితో జుట్టు పొడిబారి నిర్జీవంగా మారుతుంది. అంతే కాదు జుట్టు రాలడం మొదలవుతుంది. అందుకే అన్ని సమస్యలకు చెక్‌ పెడుతూ మీ పెరట్లో దొరికే ఈ ఆకు తెల్ల జుట్టు సమస్యకు సులువైన పరిష్కారం చూపుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

చింతచెట్టు.. దాదాపుగా ఈ చెట్టుకు అందిరికీ తెలిసిందే. ఆ చింతచెట్టు తెల్లజుట్టు నల్లగా మారుస్తుంది..!. ఈ ఆకులలో చాలా విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి.. ఇవి జుట్టు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా అనేక శరీర సంబంధిత సమస్యలను నయం చేస్తాయి. ఇందులోని యాంటీ చుండ్రు, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు జుట్టుకు చాలా మేలు చేస్తాయి.

చింతచెట్టు ఆకులను ఎలా ఉపయోగించాలి..
మెరుగైన జుట్టు ఆరోగ్యం కోసం, మీరు చింత ఆకులతో హెయిర్ ప్యాక్‌ను తయారు చేసుకోవచ్చు. మీరు ఈ ఆకులను ఉపయోగించి హెయిర్ స్ప్రేని కూడా తయారు చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

1. స్ప్రేని సిద్ధం చేయడానికి ముందుగా ఒక పాత్రలో 5 కప్పుల నీటిని తీసుకుని అందులో అరకప్పు చింతచెట్టు ఆకులను కలుపుకోవాలి. ఇప్పుడు ఈ నీటిని మరిగించి, అది చల్లబడే వరకు వేచి ఉండండి. ఈ నీరు చల్లబడిన తర్వాత, మీ జుట్టు మీద చల్లుకోండి. తర్వాత జుట్టును శుభ్రమైన నీటితో కడగాలి.

2. చింతచెట్టు ఆకుల హెయిర్ ప్యాక్ చేయడానికి మిక్సీ గ్రైండర్‌లో పెరుగుతో కొన్ని ఆకులను గ్రైండ్ చేసి, ఆ పేస్ట్‌ను జుట్టుకు అప్లై చేసి మసాజ్ చేయండి, పేస్ట్ ఆరిన తర్వాత, జుట్టును శుభ్రమైన నీటితో కడగాలి.

సహజమైన హెయిర్ కలరింగ్ ఏజెంట్లు చింతపండు ఆకులలో కనిపిస్తాయి. కొన్ని వారాల పాటు దీన్ని ఉపయోగించడం వల్ల తెల్ల జుట్టు తిరిగి నల్లగా మారడమే కాకుండా జుట్టు రాలడం, పొడి జుట్టు, బలహీనమైన జుట్టు మొదలైన వాటి నుండి ఉపశమనం లభిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us