Itchy Hair: జుట్టులో తీవ్రమైన దురద వస్తోందా? ఈ సింపుల్ టిప్స్‌తో సమస్యకు చెక్ పెట్టండి..

తలలో దురద కలిగితే చాలా చిరాకు పెడుతుంది. అంతేకాదు.. అది అనారోగ్యానికి కూడా దారి తీస్తుంది. బహిరంగ ప్రదేశంలో ఉన్నప్పుడు ఈ దురద మరింత ఇబ్బందికి గురిచేస్తుంది. ఎందుకంటే.. దీనిని అందరూ పరిశుభ్రతా లోపంగా భావిస్తారు. చుండ్రు, ఫంగల్ ఇన్ఫెక్షన్, హెయిర్ డై, పేను వంటి అనేక కారణాల వల్ల తలపై దురద వస్తుంది. జుట్టు పొడిగా ఉంటే..

Itchy Hair: జుట్టులో తీవ్రమైన దురద వస్తోందా? ఈ సింపుల్ టిప్స్‌తో సమస్యకు చెక్ పెట్టండి..
Hair Itching

Updated on: Mar 28, 2023 | 8:50 AM

తలలో దురద కలిగితే చాలా చిరాకు పెడుతుంది. అంతేకాదు.. అది అనారోగ్యానికి కూడా దారి తీస్తుంది. బహిరంగ ప్రదేశంలో ఉన్నప్పుడు ఈ దురద మరింత ఇబ్బందికి గురిచేస్తుంది. ఎందుకంటే.. దీనిని అందరూ పరిశుభ్రతా లోపంగా భావిస్తారు. చుండ్రు, ఫంగల్ ఇన్ఫెక్షన్, హెయిర్ డై, పేను వంటి అనేక కారణాల వల్ల తలపై దురద వస్తుంది. జుట్టు పొడిగా ఉంటే.. ఈ సమస్య మరింత పెరుగుతుంది. మీరు కూడా తలలో దురద సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే.. కొన్ని ఇంటి చిట్కాలతోనే సమస్యకు చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు నిపుణులు. మరి చిట్కాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

దురద, స్కాల్ప్ ఇలా వదిలించుకోండి..

1. నిమ్మరసం: నిమ్మరసంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉన్నాయి. దురద సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది. నిమ్మరసాన్ని దూదితో తలకు పట్టించి 10 నుండి 15 నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి ఒకటి లేదా రెండుసార్లు చేస్తే ఫలితం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

2. కొబ్బరినూనె: తలలో దురదలు రావడానికి స్కాల్ప్ పొడిబారడం కూడా ఒక కారణం. ఈ పొడిని తొలగించడానికి, కొబ్బరి నూనె సహాయం తీసుకోవచ్చు. కొబ్బరి నూనె తలపై మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ఈ నూనెను వేడి చేసి తలకు మసాజ్ చేయాలి. కొబ్బరినూనెలో కొద్దిగా కర్పూరం కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే కర్పూరం శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది తలపై దురదను తగ్గించడంలో సహాయపడుతుంది. ఏదైనా రకమైన ఇన్ఫెక్షన్ ఉంటే, అది కూడా నయమవుతుంది.

3. బేకింగ్ సోడా: 2 నుండి 3 చెంచాల బేకింగ్ సోడా తీసుకుని, నీళ్లలో కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ పేస్ట్‌ని తలకు పట్టించి 10 నుంచి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. బేకింగ్ సోడా యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ ఏజెంట్. ఇది స్కాల్ప్ pHని తగ్గించడంలో సహాయపడుతుంది.

4. ఉల్లిపాయ రసం: ఒక ఉల్లిపాయను తీసుకొని దాని రసాన్ని తీయాలి. ఆ తర్వాత కాటన్‌తో తలకు పట్టించి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఇది స్కాల్ప్ ఇన్ఫెక్షన్ నుండి కాపాడుతుంది. చికాకును తగ్గిస్తుంది.

5. యాపిల్ వెనిగర్: 4 టీస్పూన్ల నీటిలో 1 టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి, దానితో తలకు మసాజ్ చేయాలి. యాపిల్‌లో ఉండే మాలిక్ యాసిడ్‌లోని యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు దురద నుండి ఉపశమనం కలిగిస్తాయి.

6. మేరిగోల్డ్ పువ్వులు: మేరిగోల్డ్ పువ్వులు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి తల దురద నుండి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి.

7. పెరుగు: పెరుగుతో తలకు మసాజ్ చేయడం వల్ల తల దురద నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతే కాదు జుట్టుకు మెరుపును కూడా ఇస్తుంది.

గమనిక: ఈ వ్యాసంలో పేర్కొన్న పద్ధతులు, సూచనలను అనుసరించే ముందు డాక్టర్, సంబంధిత నిపుణుడి సలహా తీసుకోండి. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..