Hair Care Tips: పెరుగుతున్న కాలుష్యం, దుమ్ము, మట్టి, సరైన ఆహారం తీసుకోకపోవడం కారణంగా జుట్టుకు సంబంధించిన అనేక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. దీనికి తోడుగా.. రసాయనాలు అధికంగా ఉండే ఉత్పత్తులు కూడా జుట్టుకు సంబంధించిన సమస్యలను తీవ్రం చేస్తున్నాయి. జుట్టు సమస్యలు పోవాలంటే.. ముందుగా కెమెకల్ ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. ఇంట్లో తయారు చేసిన సహజసిద్ధమైన ఉత్పత్తులను జుట్టుకు వాడటం ఉత్తమం. ఇవాళ మనం కొబ్బరి నూనెతో ప్రత్యేకమైన షాంపూని తయారుచేసే విధానాన్ని తెలుసుకుందాం. దీనిని వినియోగించడం వలన జుట్టు మృదువుగా, స్ట్రాంగ్‌గా పెరుగుతుంది.
కొబ్బరి నూనెతో షాంపూ తయారు చేయడం ఎలా?
అవసరమైన పదార్థాలు
1. కాస్టైల్ ఒక కప్పు
2. 3/4 కప్పు నీరు
3. టేబుల్ ఉప్పు – 2 స్పూన్
4. కొబ్బరి నూనె – 2 స్పూన్
5. జోజోబా ఆయిల్ – 2 స్పూన్
తయారీ విధానం..
1. ముందుగా మైక్రోవేవ్‌కు అనుకూలమైన గిన్నెలో నీరు పోయాలి.
2. ఇప్పుడు మైక్రోవేవ్‌లో అర నిమిషం పాటు ఉంచాలి.
3. ఆ తర్వాత అందులో కాస్టైల్ సోప్ వేయాలి.
4. ఆ తరువాత నెమ్మదిగా మిక్స్ చేయాలి. అలా మెత్తని పేస్ట్ చేయాలి.
5. ఆ తర్వాత అందులో ఉప్పు వేసి బాగా కలపాలి.
6. ఇప్పుడు దానికి అన్ని రకాల నూనె వేసి కలపాలి.
7. అన్నింటినీ బాగా కలపి.. ఒక సీసాలో నిల్వ చేయండి.
8. ఈ షాంపూని జుట్టుకు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు.
9. ఈ షాంపూని అప్లై చేసిన తర్వాత మరే ఇతర షాంపూని ఉపయోగించొద్దు. అయితే, కొబ్బరి నూనెతో ఏదైనా అలెర్జీ ఉన్నట్లయితే, ఈ షాంపూని ఉపయోగించకుండా ఉండండి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..