నమ్మరేమో గాని, నల్ల తుమ్మ మేలు తెలిస్తే.. వెతుక్కుంటూ వెళ్లి తెచ్చుకుంటారు..!

మన చుట్టు ఉన్న ప్రకృతిలో అనేక రకాల మొక్కలు, మహా వృక్షాలు అనేకం ఉన్నాయి. అలాంటి వాటిల్లో తుమ్మ, నల్ల తుమ్మ చెట్లు కూడా ఉన్నాయి. వీటిలో నల్లతుమ్మ ఆయుర్వేదంలో దివ్యౌషధంగా పరిగణిస్తారు. కానీ, మనలో చాలా మంది ఈ చెట్టు ఉపయోగాలు తెలియదు..కేవలం గ్రామాలు, గ్రామీణ నేపథ్యం ఉన్నవారికి మాత్రమే కొద్ది గొప్పగా తెలిసి ఉంటుంది. అందుకే నల్లతుమ్మతో కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం...

నమ్మరేమో గాని, నల్ల తుమ్మ మేలు తెలిస్తే.. వెతుక్కుంటూ వెళ్లి తెచ్చుకుంటారు..!
Gum Arabic Tree

Updated on: Aug 18, 2025 | 1:13 PM

పసుపు రంగులో చిన్నసైజు బంతుల్లా పూలు పూసే ఈ నల్ల తుమ్మ గ్రామాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే, పట్టణీకరణలో భాగంగా ఇప్పుడు ఇలాంటి చెట్లు గ్రామాల్లోనూ కనుమరుగై పోతున్నాయి. అయితే, నల్ల తుమ్మ నల్లటి బెరడు, పొడవాటి కాయలు కలిగి ఉంటుంది. ఈ చెట్టులో అసాధారణమైన పోషక విలువలు, ఎన్నో రకాల రోగాల్ని నయం చేసే ఔషధ గుణాలు కలిగి ఉందని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

చెట్టు నిండా ఎన్నో రకాల ఔషధ గుణాలు కలిగిన నల్ల తుమ్మ మరెన్నో రకాల రోగాలను నయం చేస్తుందని చెబుతున్నారు. ఈ చెట్టు నుండి వచ్చే కలప నుండి చాలా రకాల వస్తువులు కూడా తయారు చేస్తారు. ఈ చెట్టు కాయలు కూడా పలు రకాల అనారోగ్య సమస్యలు తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. నల్ల తుమ్మ బెరడుతో పాటు దాని జిగురును, కాయలను కలిపి మెత్తగా పేస్ట్ లాగా చేసుకుని ప్రతిరోజూ మూడు పూటలా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతారు. దీంతో వెన్ను నొప్పి తగ్గుతుంది. అలాగే నల్ల తుమ్మ చెట్టు బంకను పొడిగా చేసి పాల్లలో కలుపుని తాగితే కీళ్ల నొప్పులు తగ్గుతాయని అంటున్నారు.

నల్ల తుమ్మ లేద ఆకులను జ్యూస్ గా చేసుకుని తాగితే.. స్త్రీలలో నెలసరి సమయంలో వచ్చే నొప్పులు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ చెట్టు కాయలను ఎండబెట్టి పొడిగా చేసుకుని దీనిలో తగినన్ని నీళ్లు అలాగే కండె చక్కెరను కలిపి తీసుకుంటే… మగవారికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. నల్ల తుమ్మ చెట్టు బెరడుతో కషాయాన్ని చేసుకొని నోట్లో పోసుకుని పుక్కిలించి ఉమ్మి వేయటం వల్ల నోటిపూత, ఇతర నోటి సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

నల్ల తుమ్మ ఆకుల‌ను వాము, జీల‌క‌ర్ర క‌లిపి క‌షాయంలా చేసుకుని తాగాటం వల్ల డ‌యేరియా స‌మ‌స్య త‌గ్గుతుంది. నల్ల తుమ్మ చెట్టు బెరడుతో కషాయాన్ని చేసుకొని నోట్లో పోసుకుని పుక్కిలించి ఉమ్మి వేయటం వల్ల నోటిపూత, ఇతర నోటి సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా న‌ల్ల తుమ్మ చెట్టు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..