
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనం ఎన్నో విషయాలపై శ్రద్ధ పెడతాం.. కానీ మన ప్రాణాలను నిలిపే గుండె ఆరోగ్యాన్ని మాత్రం పట్టించుకోం. అందుకే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 140 కోట్ల మంది తెలియకుండానే ఒక ప్రమాదకరమైన మాయదారి రోగం బారిన పడుతున్నారు. అదే..హైపర్ టెన్షన్. దీనికి ఎలాంటి ముందస్తు హెచ్చరికలు, లక్షణాలు ఉండవు కాబట్టే వైద్యులు దీనిని సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. చాలామంది తమకు తలనొప్పి, కళ్లు తిరగడం వంటివి వస్తేనే బీపీ ఉందని అనుకుంటారు. కానీ అది తప్పు. రక్తపోటు పెరిగినా శరీరం పైకి ఎలాంటి సంకేతాలూ ఇవ్వకపోవచ్చు. కానీ లోపల మాత్రం అది శరీర భాగాలను గుల్ల చేస్తుంది. సకాలంలో గుర్తించకపోతే ఇది నేరుగా హార్ట్ ఎటాక్,బ్రెయిన్ స్ట్రోక్,కిడ్నీ ఫెయిల్యూర్ లకు దారి తీస్తుంది.
బీపిని తగ్గించడం ఎలా
అయితే మన రోజువారి జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల ఈ పెద్ద ప్రమాదం నుంచి బయటపడవచ్చు అంటున్నారు వైద్యులు. బీపీని కంట్రోల్ చేయడం పెద్ద బ్రహ్మవిద్య ఏమీ కాదని.. మన రోజువారీ జీవనశైలిలో ఈ కింద పేర్కొన్న మార్పులు చేసుకుంటే సరిపోతుందంటున్నారు.
హైపర్ టెన్షన్‌ను ఓడించడం కేవలం బాధితుడి పని మాత్రమే కాదు. కుటుంబ సభ్యులు, సమాజం, ఆరోగ్య కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా అవగాహన పెంచాలి. ఇంట్లో పెద్దవారికి, ఆఫీసుల్లో ఒత్తిడితో పనిచేసే వారికి క్రమం తప్పకుండా బీపీ టెస్టులు చేయించడం అలవాటు చేయాలి.ఈ రోజే మీ రక్తపోటును పరీక్షించుకోండి. మీ బీపీ రీడింగ్ ఎంతో తెలుసుకోండి.. మీ గుండెను భద్రంగా కాపాడుకోండి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.