Gray Hair Home Remedies: కొబ్బరినూనెలో ఈ రెండు పదార్థాలను మిక్స్ చేసి తలకు పట్టిస్తే.. తెల్లజుట్టు సమస్య పరార్..

|

Jan 17, 2024 | 9:51 AM

సాధారణంగా మన జుట్టుకు కొబ్బరి నూనెను అప్లై చేయటం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని అందరికీ తెలిసిందే.. ఈ నూనె జుట్టుకు లోతైన పోషణను అందిస్తుంది. అంతేకాకుండా ఇది జుట్టు తేమను సంరక్షిస్తుంది. రోజూ కొబ్బరినూనెను అప్లై చేయడం వల్ల అనేక రకాల సమస్యలు తగ్గుతాయి. అయితే, కొబ్బరి నూనెతో పాటుగా మరికొన్ని పదార్థాలను మిక్స్ చేసి అప్లై చేయటం వల్ల అద్భుత ఫలితాలు పొందుతారు. ఇది మీ జుట్టుకు డబుల్ బెనిఫిట్ ఇస్తుంది. దాని గురించి వివరంగా తెలుసుకుందాం

Gray Hair Home Remedies: కొబ్బరినూనెలో ఈ రెండు పదార్థాలను మిక్స్ చేసి తలకు పట్టిస్తే.. తెల్లజుట్టు సమస్య పరార్..
Gray Hair
Follow us on

Gray Hair Home Remedies: జుట్టు రాలడం సమస్యను అధిగమించడానికి మనం ఎన్నో రకాల ఆయిల్స్‌, కెమికల్ ప్రొడక్ట్స్ వాడుతుంటాం.. కానీ ఈ ఉత్పత్తులు మంచి ఫలితాలను ఇవ్వవు. పైగా కొన్నిసార్లు జుట్టు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల తెల్ల జుట్టు సమస్యను తగ్గించడానికి సహజ నివారణలు ప్రయత్నించటం ఉత్తమ పరిష్కారంగా పనిచేస్తుంది. దీంతో మీ తెల్ల జుట్టు కొద్ది రోజుల్లోనే నల్లగా, ఒత్తుగా మారాలంటే, మీరు దీనికి కొన్ని నేచురల్ రెమెడీస్ ప్రయత్నించండి. అలాంటి ఇంటి చిట్కాలకు సంబంధించిన సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..

సాధారణంగా మన జుట్టుకు కొబ్బరి నూనెను అప్లై చేయటం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని అందరికీ తెలిసిందే.. ఈ నూనె జుట్టుకు లోతైన పోషణను అందిస్తుంది. అంతేకాకుండా ఇది జుట్టు తేమను సంరక్షిస్తుంది. రోజూ కొబ్బరినూనెను అప్లై చేయడం వల్ల అనేక రకాల సమస్యలు తగ్గుతాయి. అయితే, కొబ్బరి నూనెతో పాటుగా మరికొన్ని పదార్థాలను మిక్స్ చేసి అప్లై చేయటం వల్ల అద్భుత ఫలితాలు పొందుతారు. ఇది మీ జుట్టుకు డబుల్ బెనిఫిట్ ఇస్తుంది. దాని గురించి వివరంగా తెలుసుకుందాం

కొబ్బరి నూనెలో మెంతులు కలిపి వాడితే..

ఇవి కూడా చదవండి

నెరిసిన జుట్టు సమస్యను దూరం చేయడంలో మెంతులు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇది మీ జుట్టు రాలే సమస్యను పరిష్కరిస్తుంది. ఇది మూలాల నుండి జుట్టును బలపరుస్తుంది. అలాగే ఇందులో ఉండే గుణాలు జుట్టును నల్లగా మారుస్తాయి.

ఎలా ఉపయోగించాలి..

మెంతులను ముందుగా మెత్తగా రుబ్బుకోవాలి. ఆ తరువాత 3 నుండి 4 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెలో 1 టేబుల్ స్పూన్ మెంతి పొడిని వేసి బాగా మరిగించాలి. దీని తరువాత నూనెను బాగా చల్లారిన తర్వాత జుట్టుకు అప్లై చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు వాడండి.. ఇలా చేస్తే తెల్ల జుట్టు సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

కొబ్బరినూనె- కరివేపాకు..

తెల్ల జుట్టు సమస్యలను తగ్గించడంలో కొబ్బరి నూనె అత్యంత ప్రయోజనకరంగా పనిచేస్తుంది. ఇందులో కరివేపాకు వేసి జుట్టుకు రాసుకుంటే జుట్టుకు రెట్టింపు లాభాలు పొందవచ్చు. దీన్ని వెంట్రుకలకు అప్లై చేయడానికి, ముందుగా 1 బౌల్ కొబ్బరి నూనె తీసుకుని, అందులో కొన్ని కరివేపాకులను వేసి బాగా వేడి చేయండి. నూనె రంగు మారినప్పుడు, దానిని చల్లబరుచుకోండి. ఆ తర్వాత మీ జుట్టుకు అప్లై చేయండి. ఇది మీ జుట్టును నల్లగా మార్చడంలో సహాయపడుతుంది. రాత్రి పడుకునే ముందు ఈ నూనెను రాసుకుని, ఉదయం తలస్నానం చేస్తే కొద్ది రోజుల్లోనే ఇది మంచి ఫలితాలను ఇస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..