ప్రస్తుత కాలంలో చాలా మంది వారు పాటిస్తున్న ఆహారపు అలవాట్లు, జీవన విధానం కారణంగా స్థూలకాయం, ఒబెసిటీ, అధిక బరువు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఫలితంగా బరువు తగ్గడం అనేది ఒక పెద్ద సవాలుగా మారింది. క్రమరహిత జీవనశైలి, యోగా, వ్యాయామం చేయకపోవడం, జంక్ ఫుడ్ తినడం వల్ల చాలా మంది బరువు పెరుగుతున్నారు. కొందరు వ్యక్తులు కడుపు ఉబ్బరం సమస్యతో కూడా పోరాడుతున్నారు. ఎటువంటి శ్రమ లేకుండా బరువు తగ్గడానికి ప్రజలు అనేక పద్ధతులను ప్రయత్నిస్తారు. అందుకు బదులుగా మీరు గ్లూటెన్ రహిత ఆహారాలను తింటే మెరుగైన ఫలితాలు పొందగలుగుతారు. అవును నిజమే.. రోజువారీ ఆహారంలో గ్లూటెన్ రహిత ఆహార పదార్థాలను చేర్చడం ద్వారా వేగవంతంగా బరువు తగ్గవచ్చు.
అలాగే గ్లూటెన్ ఉన్న ఆహారాలను తినడం ఆరోగ్యానికి మంచిది కాదని పలువురు వైద్య నిపుణులు చెబుతున్నారు. గ్లూటెన్ వల్ల గ్యాస్, అసిడిటీ, డయేరియా, మలబద్దకం, కడుపు నొప్పి, తలనొప్పి, అలసట, చర్మ సమస్యలు, డిప్రెషన్ వంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణుల మాట. అంతేకాక గ్లూటెన్ లేని ఆహారం ఉదరకుహర వ్యాధి లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది పోషకాల శోషణను ప్రభావితం చేసే వ్యవస్థ. అందువల్ల గ్లూటెన్ లేని ఆహారాన్ని తీసుకోవడమే మన ఆరోగ్యానికి శ్రేయస్కరం. మరి అలాంటి పరిస్థితుల్లో గ్లూటెన్ రహిత ఆహారాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
హెచ్చరిక: ఈ కథనంలో అందించిన సమాచారం పాఠకుల ప్రయోజనాల కోసం రాసినది మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా సూచనను అనుసరించే ముందు దయచేసి వైద్యులను సంప్రదించండి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..