
మొక్కలు ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. ఇంట్లో మొక్కలను పెంచడం అంత సులభం కాదు. మొక్కను నాటడం నుంచి అది పెరిగడం వరకూ ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. కొంతమంది మొక్కలను ఆరోగ్యంగా పెరగడానికి మార్కెట్లో అందుబాటులో ఉన్న అనేక రకాల ఎరువులను ఉపయోగిస్తారు. వీటిలో రసాయనాలు కూడా ఉపయోగించబడతాయి. అయ్తీ మొక్కలకు సేంద్రియ ఎరువులు ఉపయోగించడం మంచిది.
సహజ పద్దతిలో మొక్కలకు ఎరువు తయారు చేసుకోవాలంటే వంటగది లోని కొన్ని రకాల వ్యర్థాలు చాలు. అవును వ్యర్థాలుగా పరిగణించి చెత్తబుట్టలో విసిరే వస్తువులు మొక్కలకు జీవం పోస్తాయి. గుడ్డు పెంకుల నుంచి టీ ఆకుల వరకు. మొక్కలకు ఎరువుగా ఉపయోగించగల కొన్ని వ్యర్థ పదార్థాలు ఉన్నాయి. అలాంటి 5 పనికిరాని వ్యర్ధాల గురించి.. వాటిని ఎలా ఉపయోగించాలో ఈ రోజు తెలుసుకుందాం.
గుడ్డు పెంకులు
గుడ్డు పెంకుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది మొక్కల కణాలను బలోపేతం చేయడానికి, పూల తలలు కుళ్ళిపోకుండా నిరోధించడానికి సహాయపడుతుంది. ఈ గుడ్డు పెంకులు ఉపయోగించడం కూడా చాలా సులభం. గుడ్డు పెంకులను రుబ్బుకుని, పొడి చేసి, మొక్కను పెంచే ముందు వేర్ల చుట్టూ ఉండే మట్టిపై చల్లుకోవాలి. ఈ ఎరువు టమోటా, మిరప , వంకాయ మొక్కలకు సరైనదిగా పరిగణించబడుతుంది.
అరటి తొక్క
పొటాషియం, భాస్వరం వంటి మూలకాలు అరటి తొక్కలో కనిపిస్తాయి. ఇది పండ్లు , పువ్వులు బాగా పెరగడానికి సహాయపడుతుంది. దీని కోసం అరటి తొక్కను చిన్న ముక్కలుగా కోసి మొక్క వేర్ల దగ్గర వేయాలి. లేదా మీరు అరటి తొక్కని నీటిలో వేసి నానిన తర్వాత ఆ నీరుని మొక్కకి పోయవచ్చు. ఇలా చేయడం వలన మొక్క అధికంగా పువ్వులు, పండ్లు ఇస్తుందట.
టీ పొడి:
టీ ఆకులు మొక్కలకు సహజ ఎరువుగా కూడా పనిచేస్తాయి. ఇది నేల నిర్మాణాన్ని మెరుగుపరచడంలో, మొక్కల ఆకుల ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది. దీని కోసం ముందుగా ఉపయోగించిన టీ పొడిని బాగా నీటితో కడిగి.. తర్వాత ఆ టీ పొడిని ఎండబెట్టి.. తర్వాత ఈ టీ పొడిని మట్టిలో లేదా ఎరువుతో కలిపి మొక్క వేర్ల దగ్గర వేయండి. ఇది గులాబీ మొక్క, వంటి పుష్పించే మొక్కలకు అనుకూలమైనదిగా పరిగణించబడుతుంది.
కూరగాయల తొక్కలు
బంగాళాదుంప తొక్కల నుంచి క్యారెట్ తొక్కల వరకు.. ఏ కూరగాయ తోక్కలైనా వాటిని మొక్కలకు ఎరువుగా ఉపయోగించవచ్చు. అవి సహజ ఎరువులా పనిచేస్తాయి. వాటిని మట్టిలో కలిపి మొక్కలో వేయండి. లేదా మీరు వాటిని నేరుగా కూడా వేయవచ్చు. ఇవి అన్ని రకాల మొక్కలకు మంచివి ఎరువుగా పరిగణించబడుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)