
ఆరోగ్యకరమైన ఆహారం అంటే కేవలం చక్కెర తగ్గించడం లేదా జంక్ ఫుడ్ మానేయడం మాత్రమే అనుకుంటాం. కానీ మనం రోజూ వాడే వంట నూనె మన శరీరంలోకి ఎంత నిశ్శబ్దంగా చేరుతుందో చాలామంది గమనించరు. పోపుల నుండి పరోటాల వరకు నూనె మన డైట్‌లో ఒక ముఖ్య భాగమైపోయింది. ఈ నేపథ్యంలో భారతీయ ఆహార భద్రత మరియు ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) విడుదల చేసిన ఒక వీడియో ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది.
ఒక్క చెంచా నూనెలో సుమారు 5 గ్రాముల ఫ్యాట్ ఉంటుంది. కూరలు వండేటప్పుడు లేదా పరోటాల మీద వేసేటప్పుడు మనం లెక్కలేకుండా నూనెను వాడుతుంటాం. “తక్కువ అదనపు నూనె తీసుకుంటే అది మీ శరీరానికి అంత మేలు చేస్తుంది” అని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా పరోటాల మీద 4 చెంచాల నెయ్యి వేస్తేనే రుచి అనే మనస్తత్వాన్ని మార్చుకోవాలని సూచిస్తున్నారు. అయితే వేరుశనగలు, బాదం, వాల్‌నట్స్ వంటి గింజల్లో ఉండే సహజ సిద్ధమైన నూనెలు శరీరానికి మేలు చేస్తాయని, ముఖ్యంగా వాల్‌నట్స్‌లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఆరోగ్యానికి ఎంతో అవసరం అంటున్నారు నిపుణులు.
నూనె వాడకం తగ్గించాలనుకునే వారి కోసం రుచిలో ఏమాత్రం తగ్గని కొన్ని ఆయిల్-ఫ్రీ వంటకాలు..
* ఆయిల్-ఫ్రీ చికెన్ మసాలా: క్లాసిక్ చికెన్ మసాలా రుచిని నూనె లేకుండానే పొందవచ్చు. మసాలాలతో నెమ్మదిగా ఉడికించడం వల్ల ఆ దేశీ రుచి అలాగే ఉంటుంది.
* నూనె లేని ఫిష్ కర్రీ: చేపల కూరకు నూనె అవసరం లేకుండా చింతపండు, మసాలాల గ్రేవీతో దీనిని అద్భుతంగా వండుకోవచ్చు. కన్యాకుమారి స్టైల్ ఫిష్ కర్రీ కూడా ఇందుకు ఒక మంచి ఉదాహరణ.
* టోఫు, జీడిపప్పు మయోనైజ్: సాధారణ మయోనైజ్ లో ఆయిల్ ఎక్కువగా ఉంటుంది. దానికి బదులుగా టోఫు, జీడిపప్పుతో చేసే ఈ డైరీ-ఫ్రీ మయోనైజ్ శాండ్‌విచ్‌లకు మంచి రుచిని ఇస్తుంది.
* ముర్గ్ మలైవాలా: పెరుగు, మసాలాలు మరియు తక్కువ క్రీమీ బేస్‌తో చేసే ఈ వంటకం నూనె లేకుండానే ఎంతో మృదువుగా, రుచిగా ఉంటుంది.
మనం తీసుకునే ఆహారంలో దాగి ఉన్న కొవ్వును గుర్తించడం చాలా ముఖ్యం. కూరల్లో పైన వేసే నూనెను తగ్గించడం వల్ల కాలేయంపై ఒత్తిడి తగ్గుతుంది. రుచి కోసం నూనెపై ఆధారపడకుండా సహజమైన మసాలాలు, పెరుగు వంటి వాటిని వాడటం అలవాటు చేసుకోవాలి. డాక్టర్ సరిన్ చెప్పినట్లుగా ఆహారపు అలవాట్లలో చిన్నపాటి మార్పులు చేసుకుంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. నూనె లేని ఆహారం అంటే చప్పని ఆహారం అని కాకుండా, అది ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం అని గుర్తించాలి.