Fridge Cleaning Tips: మీ ఇంట్లో ఫ్రిజు కంపు కొడుతోండా? ఈ చిట్కాలతో ఎల్లప్పుడూ ఫ్రెష్‌గా ఉంచుకోండి..

ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటే అందులో కూరగాయలు, పండ్లు, పాలు, పెరుగు, ఇతర ఆహార పదార్థాలు ఉంచుతారు. తరచుగా ఫ్రిజ్‌ను శుభ్రం చేయకపోవడం వల్ల గానీ, కొన్ని పదార్థాలను ఎక్కువసేపు..

Fridge Cleaning Tips: మీ ఇంట్లో ఫ్రిజు కంపు కొడుతోండా? ఈ చిట్కాలతో ఎల్లప్పుడూ ఫ్రెష్‌గా ఉంచుకోండి..
Firdge Smell

Updated on: Nov 16, 2022 | 10:01 AM

ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటే అందులో కూరగాయలు, పండ్లు, పాలు, పెరుగు, ఇతర ఆహార పదార్థాలు ఉంచుతారు. తరచుగా ఫ్రిజ్‌ను శుభ్రం చేయకపోవడం వల్ల గానీ, కొన్ని పదార్థాలను ఎక్కువసేపు ఉంచడం వల్ల గానీ ఫ్రిజ్ దుర్వాసన వస్తుంది. కొన్నిసార్లు ఒకేసారి చాలా ఎక్కువ మొత్తంలో కూరగాయలు కొనుగోలు చేసి వాటిని ఫ్రిజ్‌లో ఉంచుతారు. ఫ్రిజ్‌లో పెట్టడం వలన కూరగాయలు కుళ్లిపోవని అందరి భావన. కానీ, చాలా రోజులు అలాగే ఉంచితే కూరగాయలు కుళ్లిపోతాయి. అలాగే, పాలు, పెరుగు ఎక్కువ కాలం పెడుతుంటారు. దీని వలన ఫ్రిజ్ నుంచి దుర్వాసన వస్తుంటుంది.

ఫ్రిజ్ నుంచి దుర్వాసన రావడానికి అనేక కారణాలు ఉండొచ్చు. కొంతమంది ఆహారంపై మూత పెట్టకుండానే ఫ్రిజ్‌లో పెడుతుంటారు. దీని వలన కూడా ఫ్రిజ్ మొత్తం దుర్వాసన వస్తుంది. అంతేకాదు.. పాలు, జ్యూస్ వంటి ద్రవపదర్థాలు ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల ఫ్రిజ్‌ మురికిగా మారడమే కాకుండా దుర్వాసన కూడా వస్తుంది. ఆకు కూరలు ఎక్కువ కాలం నిర్వ చేయడం వల్ల కూడా అవి పాడైపోతాయి. తద్వారా ఫ్రిజ్‌లో దుర్వాసన వస్తుంది. అయితే, ఇలా దుర్వాసన రాకుండా ఉండాలంటే కొన్ని చర్యలు తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బ్రెడ్..

చాలా మంది రోజూ ఉదయాన్నే బ్రెడ్ తింటారు. అయితే, ఇదే బ్రెడ్.. ఫ్రిజ్ దుర్గంధాన్ని తొలగిస్తుందని మీకు తెలుసా? అవును, మీ ఫ్రిజ్ వాసన రాకుండా ఉండటానికి బ్రెడ్‌ను వాడొచ్చు. ఫ్రిజ్ లోపల 2, 3 బ్రెడ్ పీస్‌లను పెట్టాలి. ఇది ఫ్రిజ్ నుంచి వచ్చే దుర్వాసనను తొలగిస్తుంది.

ఇవి కూడా చదవండి

నారింజ పండు..

ఫ్రిజ్ నుండి వెలువడే దుర్మాసనను తొలగించడంలో నారింజ అద్భుతంగా ఉపకరిస్తుంది. నారింజ రసం తీసి కొంత నీటిలో కలపాలి. ఆ నీటితో ఫ్రిజ్‌ లోపల కడగాలి. దీని వల్ల దుర్వాసన మొత్తం పోతుంది. ఫ్రిజ్ క్లీన్ చేసిన తరువాత నారింజ తొక్కను కూడా ఫ్రిజ్ లోపల పెట్టొచ్చు. ఇది కూడా ఫ్రిజ్ దుర్వాసనను తొలగిస్తుంది.

పూదీనా..

పూదీనా కూడా ఫ్రిజ్ దుర్వాసనను తొలగిస్తుంది. ఫ్రిజ్‌ను పూదీనా వాటర్‌తో క్లీన్ చేయడం ద్వారా దుర్వాసన పోయి, ఫ్రెష్‌గా వాసన వస్తుంది. పూదీనా ఆకులను కూడా ఫ్రిజ్‌లో ఉంచొచ్చు.

కాఫీ గింజలు..

ఫ్రిజ్‌ నుంచి వచ్చే దుర్వాసనను తొలగించడానికి కాఫీ గింజలు అద్భుతంగా పని చేస్తాయి. కాఫీ వాసన బలంగా ఉంటుంది. కావున, ఫ్రిజ్ నుంచి వచ్చే దుర్వాసనను అది డామినేట్ చేస్తుంది. కాఫీ గింజలను మెత్తగా రుబ్బి, ఆ ఒక కంటైనర్లో వేసి ఫ్రిజ్‌లో ఉంచాలి. ఇది ఫ్రిజ్ వాసనను తొలగిస్తుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..