Stroke Risk: ఇష్టం అంటూ కాఫీ, కూల్ డ్రింక్స్ అతిగా తాగేస్తున్నారా.. స్ట్రోక్‌కు కారణం అవుతున్నాయని తెలుసా?

|

Oct 05, 2024 | 5:12 PM

గుండె ఆరోగ్యం విషయానికి వస్తే, మనం ఏమి తింటున్నాము, త్రాగుతున్నాము అనే దానిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కార్బోనేటేడ్ పానీయాలు, పండ్ల రసం తీసుకోవడం వల్ల మన శరీరంలో స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని మీకు తెలుసా. రోజూ నాలుగు కప్పుల కాఫీ తాగితే అది కూడా స్ట్రోక్‌కు దారితీస్తుందని మరో అధ్యయనంలో వెల్లడైంది. ఈ పరిశోధనలో తెలిసిన ఆశ్చర్యకరమైన విషయం ఎనుటంటే మనం సాధారణంగా నాలుగు కప్పుల కాఫీ తాగుతాము..

Stroke Risk: ఇష్టం అంటూ కాఫీ, కూల్ డ్రింక్స్ అతిగా తాగేస్తున్నారా.. స్ట్రోక్‌కు కారణం అవుతున్నాయని తెలుసా?
Stroke Risk
Follow us on

గుండె ఆరోగ్యం విషయానికి వస్తే, మనం ఏమి తింటున్నాము, త్రాగుతున్నాము అనే దానిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కార్బోనేటేడ్ పానీయాలు, పండ్ల రసం తీసుకోవడం వల్ల మన శరీరంలో స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని మీకు తెలుసా. రోజూ నాలుగు కప్పుల కాఫీ తాగితే అది కూడా స్ట్రోక్‌కు దారితీస్తుందని మరో అధ్యయనంలో వెల్లడైంది. ఈ పరిశోధనలో తెలిసిన ఆశ్చర్యకరమైన విషయం ఎనుటంటే మనం సాధారణంగా నాలుగు కప్పుల కాఫీ తాగుతాము.. అయితే అంతకంటే ఎక్కువ కాఫీ తాగితే, స్ట్రోక్ ప్రమాదం చాలా రెట్లు పెరుగుతుంది.

అంతే కాకుండా శీతల పానీయాలు, ఫిజీ డ్రింక్స్ తాగడానికి కూడా ప్రజలు ఇష్టపడుతున్నారు. ఇవి ఆరోగ్యానికి ఎలా ముప్పుగా పరిణమిస్తాయో ఈ రోజు తెలుసుకుందాం.. మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఎలాంటి పద్ధతులను అవలంబించాలో కూడా తెలుసుకుందాం..

పరిశోధన ఏం చెబుతోందంటే

మెక్‌మాస్టర్ యూనివర్సిటీ కెనడా, యూనివర్సిటీ ఆఫ్ గాల్వే కి సంబంధించిన బృందం కాఫీ లేదా ఇతర చక్కెర పానీయాలపై పరిశోధనలు చేశాయి. దీని ప్రకారం కార్బోనేటేడ్ డ్రింక్స్ లేదా పండ్ల రసాలను తరచుగా తాగడం వల్ల స్ట్రోక్ రిస్క్ 37 శాతం పెరుగుతుంది. మరొక అధ్యయనం ప్రకారం చక్కెరతో తయారు చేయబడిన కార్బోనేటేడ్ పానీయాలు స్ట్రోక్ ప్రమాదాన్ని 22 శాతం పెంచుతాయి. ఈ పరిశోధన జనరల్ ఆఫ్ స్ట్రోక్ , ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ స్ట్రోక్‌లో ప్రచురించబడింది. ఈ ప్రాజెక్టులో 27 దేశాల నుంచి 27 వేల మందిని చేర్చారు. 13500 మంది మొదటిసారిగా స్ట్రోక్ ముప్పును ఎదుర్కొన్నారు. అటువంటి పరిస్థితిలో స్ట్రోక్ ప్రమాదాన్ని ఎక్కువగా పెంచే ఈ పానీయాలలో ఏమి ఉంది అనే ప్రశ్న తలెత్తుతుంది?

ఇవి కూడా చదవండి

ఈ పానీయాలు స్ట్రోక్ ప్రమాదాన్ని ఎందుకు పెంచుతాయంటే

తరచుగా కాఫీ లేదా ఫిజీ డ్రింక్స్ తాగడం వల్ల స్ట్రోక్ ఎందుకు వస్తుంది అనే విషయంలో నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మెదడులోని ఏదైనా భాగానికి రక్త సరఫరా ఆగిపోయినప్పుడు లేదా మెదడు కణాలు దెబ్బతిన్నప్పుడు ఎవరికైనా స్ట్రోక్ వస్తుంది. అటువంటి పరిస్థితిలో ఇస్కీమిక్ స్ట్రోక్ సంభవించవచ్చు, ఇది సాధారణంగా రక్తం గడ్డకట్టడం వల్ల వస్తుంది. ఇందులో మెదడులో అంతర్గత రక్తస్రావం జరుగుతుంది.

ఫిజీ డ్రింక్స్ లేదా ప్యాక్డ్ ఫ్రూట్ డ్రింక్స్‌లో అదనపు షుగర్, ప్రిజర్వేటివ్స్ ఉంటాయని ఈ పరిశోధన వెల్లడించింది. వీటిని ఎక్కువగా తాగడం వల్ల చక్కెర స్థాయి పెరుగుతుంది. దీని కారణంగా స్ట్రోక్ ప్రమాదం కూడా గణనీయంగా పెరుగుతుంది. ఊబకాయం లేదా ఇతర వ్యాధితో బాధపడుతున్న స్త్రీలు, వ్యక్తులలో స్ట్రోక్ సంభావ్యత మరింత పెరుగుతుంది.

ఏ పానీయాలు తాగవచ్చు అంటే

కాఫీ, టీ వంటి వాటిని కొంతమంది తాగకుండా ఉండలేమని చెబుతున్నారు. అయితే వీటి వినియోగాన్ని ఖచ్చితంగా తగ్గించవచ్చు. కాఫీ , టీ లకు బదులుగా గ్రీన్ టీ, హెర్బల్ టీని ఉపయోగించవచ్చు ఎందుకంటే ఇవి హానికరం కాదు. పాలు కాకుండా ఇతర ఎంపికలను కూడా అన్వేషించవచ్చు. పాలకు బదులుగా బాదం, సోయా లేదా ఓట్స్‌తో చేసిన ఫోర్టిఫైడ్ పాలను తాగవచ్చు.

 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..