
ప్రస్తుతం శీతాకాలంలో చలి పులి అందరిపైనా పంజా విసురుతుంది. విపరీతమైన చలి గాలుల వల్ల ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. అలాగే చలికాలంలో వివిధ ఆరోగ్య సమస్యలు కూడా ప్రజలను వెంటాడుతాయి. ముఖ్యంగా జలుబు, దగ్గు, ఊపిరిత్తితుల సమస్యలతో చాలా మంది బాధపడుతుంటారు. ఇలాంటి సమయంలో ఆ వ్యాధుల నుంచి రక్షణ తగిన ఆహార నియమాలను పాటించాల్సి ఉంటుంది. కొన్ని ఆహారాలు ఇన్ ఫెక్షన్లను తగ్గించడానికి సాయం చేస్తాయి. అల్లం, బెల్లం, పసుపు, అశ్వగంధ వంటి పదార్థాలు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. శీతాకాలంలో నిపుణులు సూచించే సూపర్ ఫుడ్స్ ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
ఆయుర్వేద వైద్యుల సూచన ప్రకారం బెల్లం జీర్ణక్రియ సహాయం చేస్తుంది. అలాగే గ్రాస్ట్రిక్ సమస్యలను దూరం చేస్తుంది. అలాగే చక్కెరకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం బెల్లమే..అలాగే బెల్లంలో ఐరన్, విటమిన్ – సి అధికంగా ఉంటాయి. జలుబు వల్ల కలిగే ఇన్ ఫెక్షన్లతో బెల్లం శక్తివంతంగా పోరాడుతుంది. కాబట్టి శీతాకాలంలో మనం తీసుకునే ఆహారంలో కచ్చితంగా బెల్లం ఉండేలా చూసుకోవాలి.
అల్లంలో కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శీతాకాలం తీసుకునే ఆహారంలో కచ్చితంగా అల్లాన్ని చేర్చుకోవాలి. శీతాకాలం చలిని తట్టుకోడానికి అల్లం చాయ్ తాగితే మంచి ఫలితాలు ఉండడమే కాక జలుబు సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. కాలానికి అనుగుణంగా వచ్చే అలర్జీల నుంచి కూడా అల్లం రక్షిస్తుంది.
ఈ మూలికను ఇండియన్ జిన్‌సెంగ్ అని కూడా పిలుస్తారు. అశ్వగంధ అక్షరాలా ఒక అద్భుత మూలిక! ఇది రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో కూడా ఉపయోగపడుతుంది. శీతాకాలంలో శారీరక వ్యాయామం లేకపోవడం, అధికంగా తినడం రెండింటిలో పెరుగుదలను కలిగించే సమయంలో దీన్ని వాడితే అధిక బరువు సమస్య దూరం అవుతుంది. అశ్వగంధ మిమ్మల్ని వెచ్చగా ఉంచుతుంది. అలాగే సాధారణ జలుబు, ఫ్లూ ఇన్ ఫెక్షన్లను దూరం చేస్తుంది. దీన్ని అల్పాహారం తృణధాన్యాలకు జోడించినా, లేదా పొడి రూపంలో తీసుకున్నా మంచి ఫలితాలు వస్తాయి.
పసుపులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పచ్చి పసుపు శ్లేష్మం ఉత్పత్తిని పెంచుతుంది, ఇది సహజంగా శ్వాసకోశాన్ని అడ్డుకునే సూక్ష్మజీవులను బయటకు పంపుతుంది. పసుపులోని యాంటీవైరల్,. యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఇన్ఫెక్షన్‌తో పోరాడటానికి సాయం చేస్తాయి. అలాగే దగ్గు, జలుబు లక్షణాల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి.
కుంకుమపువ్వు శీతాకాలంలో ఉపయోగించడానికి ఒక గొప్ప ఆహారం. ఇది మీకు వెచ్చదనాన్ని కలిగించడమే కాకుండా జలుబు, దగ్గు లక్షణాలను నయం చేస్తుంది. అల్లం, పసుపు, జాజికాయ వంటివి తరచూ ఉపయోగిస్తున్నా కుంకుమ పువ్వు ధర నేపథ్యంలో పెద్దగా వాడరు. అయితే, వెచ్చని కప్పు పాలల్లో కుంకుమపువ్వు కలుపుకుని తాగితే మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.