వర్షం పడగానే నేరేడు పండ్లు తింటే ఏమవుతుందో తెలుసా..? మన పెద్దలు చెప్పిన ఈ నిజాలు తెలుసుకోండి..
నేరేడు పండ్లను వర్షం కురిసిన వెంటనే వీటిని తింటే మాత్రం హాస్పిటల్ పాలు కావడం ఖాయం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఊపిరితిత్తుల సమస్యలు, దగ్గు, ఆస్తమా ఉన్నవాళ్లు ఈ ఊదా రంగు పండుకు ఈ సీజన్లో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అసలు వర్షపు నీటిలో నానిన నేరేడు పండ్లు కడుపులోకి వెళ్తే ఏం జరుగుతుంది? అనేది తెలుసుకుందాం..

వర్షాకాలంలో రోడ్ల పక్కన మెరిసిపోయే అల్ల నేరేడు పండ్లు అందరినీ ఆకర్షిస్తాయి. చూడగానే నోరూరించే ఈ పండులో ఎన్నో అద్భుతమైన పోషక విలువలు, యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. అయితే నేరేడు పండ్ల విషయంలో మన తాతముత్తాతలు ఒక కఠినమైన నియమాన్ని చెబుతుంటారు. అదేమిటంటే.. వర్షం పడిన వెంటనే ఈ పండ్లను అస్సలు తినకూడదు. వినడానికి ఇది మూఢనమ్మకంలా అనిపించినా.. దీని వెనుక దాగున్న అసలు ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి. వర్షం పడినప్పుడు వాతావరణంలో తేమ విపరీతంగా పెరుగుతుంది. ఈ సమయంలో నేరేడు పండు పల్చని తొక్కపై చిన్న చిన్న బ్యాక్టీరియా, శిలీంధ్రాలు వేగంగా వృద్ధి చెందుతాయి. నేరేడు పండ్ల ఉపరితలంపై ఉండే సూక్ష్మ రంధ్రాలలో ఇవి దాక్కుంటాయి. మనం ఎంత బాగా కడిగినా ఈ సూక్ష్మజీవులు పూర్తిగా పోవు. వర్షంలో నానిన ఈ పండ్లను అలాగే తినడం వల్ల ఆ మురికి, బ్యాక్టీరియా నేరుగా కడుపులోకి ప్రవేశించి తీవ్రమైన ఇన్‌ఫెక్షన్లకు కారణమవుతాయి.
ఊపిరితిత్తుల సమస్యలు.. దగ్గు ఉన్నవారు దూరం ఉండాలి
ఆస్తమా, అలర్జీలు లేదా ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు వర్షాకాలంలో నేరేడు పండ్లకు దూరంగా ఉండటమే మంచిది. నేరేడు పండుకు సహజంగానే శరీరాన్ని చల్లబరిచే గుణం ఉంటుంది. వర్షాకాలపు చల్లని వాతావరణానికి తోడు ఈ పండును తింటే ఊపిరితిత్తులలోని నరాలు సంకోచించే ప్రమాదం ఉంది. తేలికపాటి జలుబు లేదా దగ్గు ఉన్నప్పుడు వర్షంలో నానిన నేరేడు పండ్లు తింటే గొంతులో కఫం పెరిగి, దగ్గు తీవ్రత రెట్టింపు అవుతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడమే కాకుండా ఆస్తమా అటాక్ వచ్చే ఛాన్స్ కూడా పెరుగుతుంది.
మందగించే జీర్ణశక్తి.. కడుపు నొప్పి..
వర్షాకాలంలో మన శరీర జీర్ణక్రియ సహజంగానే కొంచెం నెమ్మదిగా సాగుతుంది. వర్షపు నీటిని పీల్చుకుని తమ సహజ గుణాన్ని మార్చుకున్న నేరేడు పండ్లను ఈ సమయంలో తినడం వల్ల కడుపు నొప్పి, గ్యాస్, అజీర్తి లేదా విరేచనాలు వంటి జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. ఇవి జీర్ణశక్తిని మరింత మందగింపజేస్తాయి.
నిపుణులు ఇచ్చే సలహా ఏంటి?
నేరేడు పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ వాటిని తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.
- వర్షం పడిన వెంటనే చెట్ల నుండి కోసిన లేదా రోడ్డు పక్కన తడిసిన పండ్లను అస్సలు కొనకండి.
- పొడిగా, తాజాగా ఉన్న పండ్లను తెచ్చుకుని.. కాసేపు ఉప్పు నీటిలో బాగా కడిగి, ఆ తర్వాతే తినాలి.
- ఖాళీ కడుపుతో కాకుండా, ఏదైనా తిన్న తర్వాత మాత్రమే నేరేడు పండ్లను తీసుకోవడం సురక్షితం.
