Biryani Tea: సర్వరోగ నివారిణి బిర్యానీ టీ.. రుచిలోనే కాదు.. ఆరోగ్యంలోనూ సూపర్ బెనిఫిట్స్‌.. ! ఇలా చేసి తాగితే..

వర్షాకాలం, శీతాకాలంలో మీరు పాలతో చేసిన టీ, కాఫీకి బదులుగా ఆరోగ్యకరమైన, రుచికరమైనదాన్ని కోరుకుంటే బిర్యానీ టీ మీకు సరైన ఎంపిక. అవును, దాని యాంటీఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు మీకు ఎన్నో లాభాలను అందిస్తుంది. ప్రస్తుతం ఈ బిర్యానీ బాగా ట్రెండ్‌ అవుతోంది. అనేక ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి ఈ టీ దివ్యౌషధంగా ఉపయోగించబడుతోంది. బిర్యానీ టీని ఎలా తయారు చేయాలి..? దాని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం.

Biryani Tea: సర్వరోగ నివారిణి బిర్యానీ టీ.. రుచిలోనే కాదు.. ఆరోగ్యంలోనూ సూపర్ బెనిఫిట్స్‌.. ! ఇలా చేసి తాగితే..
Biryani Tea

Updated on: Sep 18, 2025 | 12:35 PM

టీ ప్రియులకు టైంతో ప‌నిలేదు. ఎప్పుడుపడితే అప్పుడు తాగేస్తుంటారు. ఇక వర్షాకాలం, చలికాలంలో అయితే, ఉద‌యం, సాయంత్రం, రాత్రి ఇలా ఏ స‌మ‌యంలోనైనా వెచ్చ‌గా గరంగరం చాయ్‌ గొంతులో నింపుకోవాల‌ని ఉబ‌లాట‌ప‌డుతుంటారు. ఇకపోతే, వారి ఇష్టానికి అనుగుణంగా రకరకాల టీలు తయారు చేస్తుంటారు. ప్లెయిన్ టీ నుంచి మ‌సాలా టీ, గ్రీన్ టీ, అల్లం టీ, లెమన్‌ టీ ఇలా ఒక‌టేమిటి ఎన్నో వెరైటీల టీలను ఆస్వాదిస్తుంటారు. అయితే, మీరు ఎప్పుడైనా బిర్యానీ టీ ట్రై చేశారా..? అవును మీరు విన్నది నిజమే..ఇప్పుడు ఈ బిర్యానీ టీ బాగా పాపులర్‌ అవుతోంది.

ఈ చాయ్‌లో బిర్యానీ టేస్ట్ లేకపోయినప్పటికీ బిర్యానీలో ఉపయోగించే వివిధ పదార్ధాల‌తో కూడిన లేయ‌ర్స్ ఈ చాయ్‌ తయారీలో ఉపయోగిస్తున్నారు.. అందుకే దీనికి బిర్యానీ ఛాయ్ అనే పేరు పెట్టారట. ఈ స్పెషల్ చాయ్‌ తయారీ కోసం మిరియాలు, దాల్చినచెక్క, యాలకులు, స్టార్ మొగ్గ, టీ పొడి, సోంఫు, అల్లం ముక్క, తేనె, పుదీనా ఆకులు, నిమ్మరసం అవసరం.

ముందుగా పావు లీటర్ నీళ్లలో కొన్ని మిరియాలు వేసి మరిగించాలి. ఇందులోనే దాల్చిన చెక్క, యాలకులు, స్టార్ మొగ్గ, సోంఫుతో పాటు టీ పొడి కూడా వేసి మరిగించుకోవాలి. ఈ డికాషన్ మంచి సువాసన వస్తుండగా మంట తగ్గించుకోవాలి. ఇప్పుడు అల్లం ముక్కలు కచ్చాపచ్చాగా దంచుకుని ఓ గ్లాసులో వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా నిమ్మరసం, తేనె, కొన్ని పుదీనా ఆకులు కూడా వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముందుగా మరిగించిన డికాషన్‌లో వేయాలి. అంతే.. రుచికరమైన బిర్యానీ టీ రెడీ అయినట్లే. వేడి వేడిగా తాగితే అబ్బో అదిరిపోతుంది.

ఇవి కూడా చదవండి

పాలతో చేసే టీ, కాఫీలకు బదులు ఈ బిర్యానీ టీ తాగడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం యవ్వనంగా ఉంటుంది. అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సో మరెందుకు ఆలస్యం.. ఈ వర్షాకాలం, వచ్చే శీతాకాలంలో అప్పుడప్పుడు ఇలాంటి బిర్యానీ చాయ్‌ ఎంజాయ్‌ చేయండి. ఆరోగ్యంగా ఉండండి..

( NOTE: పైన పేర్కొన్న అంశాలు వైద్య నిపుణులు, ఇంటర్నెట్‌ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించబడినవి.. వీటిపై మీరు ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం)

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.